తెలుగులో ఇప్పుడు ఎన్ని పాటలు పాడే షోలైనా ఉండొచ్చు కానీ ఈటీవీలో ప్రసారమయ్యే పాడుతా తీయగాకున్న ఫాలోయింగ్, గౌరవం చాలా ప్రత్యేకం. ముఖ్యంగా ఎస్పి బాలసుబ్రమణ్యం గారు ఉన్నప్పుడు రెండు దశాబ్దాల పాటు దాన్ని నడిపించిన తీరు సంగీత ప్రియులకు బోలెడు ఆనందంతో పాటు విజ్ఞానాన్ని పంచింది. టాలీవుడ్ నంతా ఒకే తాటిపైకి తీసుకొచ్చి ఎన్నో కార్యక్రమాలు నిర్వహించేలా చేసింది. బాలుగారు పోయాక ఆయన వారసత్వాన్ని అందుకున్న ఎస్పి చరణ్ ప్రోగ్రాంని అదే స్థాయిలో కొనసాగించేందుకు కష్టపడుతున్నారు. ఇప్పుడు దిల్ రుబా ప్రస్తావన ఎందుకో చూద్దాం.
ఈ నెల 14 విడుదల కాబోతున్న కిరణ్ అబ్బవరం దిల్ రుబా ఇప్పుడీ పాడుతా తీయగాలో పాల్గొనబోతోంది. ప్రమోషన్లలో భాగంగా ఇది చేస్తున్నారు. అయితే పాతికేళ్ల ఈ షో ప్రస్థానంలో ఎప్పుడూ ఏ సినిమా యూనిట్ ఈ ప్రాంగణంలో అడుగు పెట్టలేదు. ఆ ఘనత దిల్ రుబాకే దక్కింది. బిగ్ బాస్, క్యాష్, ఢీ, ఇండియన్ ఐడల్ లాంటి ఎన్నో ప్రోగ్రాంస్ లో కొత్త రిలీజుల పబ్లిసిటీ జరగడం సహజమే కానీ పాడుతా తీయగాలో చేయడం మాత్రం ఒక ప్రత్యేక మైలురాయిగా నిలిచిపోతుంది. రెగ్యులర్ తరహాలో కాకుండా ఆ కార్యక్రమం హుందాతనం కాపాడేలా దిల్ రుబా ఎపిసోడ్ డిజైన్ చేసినట్టు సమాచారం.
క ఇచ్చిన బ్లాక్ బస్టర్ కిక్ తో కిరణ్ అబ్బవరం మంచి జోష్ లో ఉన్నాడు. నిజానికి దిల్ రుబా దీనికన్నా ముందు రిలీజవ్వల్సిన సినిమా. కానీ కని ముందు విడుదల చేయడం వల్ల చాలా ప్లస్ అయ్యింది. మంచి బిజినెస్ ఆఫర్లతో కిరణ్ మూవీకి ఓపెనింగ్స్ రాబోతున్నాయి. కాకపోతే టాక్ కీలకం కానుంది. ఇది సక్సెస్ అయితే మార్కెట్ మరింత బలపడుతుందనే నమ్మకంతో ప్రమోషన్లను మంచి స్వింగ్ లో పెట్టారు. నాని నిర్మించిన ప్రియదర్శి కోర్ట్ తో పాటు మలయాళం డబ్బింగ్ ఆఫీసర్ ఆన్ డ్యూటీ మార్చి 14 విడుదల కాబోతున్నాయి. మరి పాడుతా తీయగా దిల్ రుబాకి ఎలాంటి ప్రయోజనం కలిగిస్తుందో చూడాలి.
This post was last modified on March 5, 2025 2:46 pm
వెల్లులి బెట్టి పొగిచిన పుల్లని గోంగూర రుచిని బొగడగ వశమా? అంటూ గోంగూర రుచిని పొగిడారో తెలుగు కవి. గోంగూరకు…
ఏడు పదుల వయసులో రకరకాల పాత్రలు చేస్తూ తనకు తాను ఛాలెంజ్ విసురుకుంటున్న మలయాళం స్టార్ మమ్ముట్టి కొత్త సినిమా…
ఒకరికి శాపం మరొకరికి వరం అయ్యిందన్న తరహాలో అఖండ 2 వాయిదా బాలీవుడ్ మూవీ దురంధర్ కు భలే కలిసి…
బాలయ్య కెరీర్ లోనే మొదటిసారి ఇలాంటి పరిస్థితి చూస్తున్నామా అన్నట్టుగా అఖండ 2 తాలూకు పరిణామాలు ఫ్యాన్స్ ని బాగా…
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(ఏఐ)లో ఏపీ దూకుడుగా ఉందని కేంద్ర ప్రభుత్వం తెలిపింది. ఏఐ ఆధారిత ఉత్పత్తులు, వృద్ధి వంటి అంశాల్లో ఏపీ…
అధికారంలో ఉన్నాం. అయినా మాకు పనులు జరగడం లేదు. అనే వ్యాఖ్యను అనంతపురం జిల్లాకు చెందిన ఒక సీనియర్ నాయకుడు…