Movie News

స్నేహితురాలి సినిమాకు సమంత ‘ఎస్’

సమంతని వెండితెరపై చూసి రెండేళ్లకు పైగానే గడిచిపోయాయి. 2023లో రెండు ఫ్లాపులు శాకుంతలం, ఖుషి పలకరించాక మళ్ళీ తన దర్శనం జరగలేదు. ఇటీవలే అమెజాన్ ప్రైమ్ వెబ్ సిరీస్ సిటాడెల్ హానీ బన్నీలో కనిపించింది కానీ అదేమీ ఆశించిన మేజిక్ చేయలేకపోయింది. ఎప్పుడో కొన్ని నెలల క్రితం మా ఇంటి బంగారం అంటూ స్వంత ప్రాజెక్టు ప్రకటించాక కనీసం దాని డీటెయిల్స్ కూడా షేర్ చేసుకోలేదు. ఇదిలా ఉండగా సమంతా మహిళా దర్శకురాలు నందిని రెడ్డికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు సమాచారం. ఇన్స్ టాలో డైరెక్టర్ పుట్టినరోజు సందర్భంగా పరస్పరం పంచుకున్న సందేశాలు చూస్తే అదే అనిపిస్తుంది.

త్వరలోనే కలిసి పని చేసేందుకు ఎదురు చూస్తున్నట్టు ఇద్దరూ మెసేజ్ చేసుకోవడం ఒక ప్రాజెక్టు వైపు అడుగులు పడుతున్న సంకేతాన్ని ఇస్తున్నాయి. సామ్ కున్న అతి దగ్గరి స్నేహితుల్లో నందిని రెడ్డి ఒకరు. ఈ కలయికలో మొదట జబర్దస్త్ వచ్చింది. సిద్దార్థ్ హీరోగా రూపొందిన ఈ ఎంటర్ టైనర్ బాక్సాఫీస్ వద్ద ఆడకపోవడం పక్కనపెడితే కోర్టు తీర్పు వల్ల అసలెక్కడ దొరకని పరిస్థితి తలెత్తింది. సమంత నటన గురించి అప్పట్లో పాజిటివ్ రివ్యూలు వచ్చాయి. తర్వాత ఓ బేబీ కోసం చేతులు కలిపారు. ఇది ఘన విజయం సాధించింది. తర్వాత నందిని రెడ్డి తీసిన అన్నీ మంచి శకునములే ఫెయిల్యూర్ గా నిలిచింది.

సో అఫీషియల్ గా ప్రకటన వచ్చేదాకా ఎదురు చూడాల్సిందే కానీ మొత్తానికి మంచి కాంబోనే అవుతుంది. నిజానికి నందిని రెడ్డి టిల్లు స్క్వేర్ కన్నా ముందు సిద్ధూ జొన్నలగడ్డతో ఒక సినిమా ఓకే చేసుకున్నారు. కానీ ఏవేవో కారణాల వల్ల అది కార్యరూపం దాల్చలేదు. ఈలోగా సిద్దు వేరే దర్శకులకు కమిట్ మెంట్స్ ఇచ్చేసి ముందుకెళ్ళిపోగా నందినికి రెండు సంవత్సరాల గ్యాప్ వచ్చింది. ఈ టైంలోనే స్క్రిప్ట్ ఒకటి సిద్ధం చేసుకున్నారని, సమంతాకు సూటయ్యేలా ఉండటంతో నిర్మాణం వైపు అడుగులు పడుతున్నట్టు సమాచారం. సో కొంచెం లేట్ అయినా సామ్ ని బ్యాక్ టు బ్యాక్ సినిమాల్లో చూసేందుకు ఫ్యాన్స్ రెడీ కావొచ్చు.

This post was last modified on March 5, 2025 11:39 am

Share

Recent Posts

రవితేజ – వివేక్ సినిమా పరిస్థితి ఏంటి

మాస్ రాజా రవితేజ ఇమేజ్ ఛట్రం నుంచి బయటికి వచ్చి విభిన్నమైన సినిమాలు చేస్తున్నాడు ఈ మధ్య. ఈ క్రమంలో…

5 hours ago

రాకా… అలా ఫిక్సయిపోవచ్చా?

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, తమిళ స్టార్ డైరెక్టర్ అట్లీల కాంబినేషన్లో తెరకెక్కుతున్న ‘రాకా’ సినిమా మీద అంచనాలు ఏ…

6 hours ago

ఆదర్శ నిర్ణయాలు మంచి ఫలితాలు ఇవ్వాలి

ఈ మధ్య భారీ బడ్జెట్ సినిమాలకు ముందు రోజు వేస్తున్న ప్రీమియర్ షోలు పెద్ద సమస్యగా మారాయి. అసలు కంటెంట్…

8 hours ago

హైదరాబాద్ తగలబెడతానంటోన్న దానం

ప్రధాని మోదీ, సీఈసీ జ్ఞానేశ్ కుమార్ లపై సీఎం రేవంత్ రెడ్డి సంచలన ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే. ఓట్ల…

8 hours ago

జగన్ పిలిచినా సాయిరెడ్డి వెళ్ళరు

ఒకప్పుడు వైసీపీలో ఓ వెలుగు వెలిగిన విజయ సాయిరెడ్డి ఇప్పుడు ఆ పార్టీపై ఒంటికాలిపై లేస్తున్న వైనం పలువురిని ఆశ్చర్యపరుస్తోంది.…

8 hours ago

సిగ్మా తీర్చాల్సిన బాకీ ఇద్దరిదే

దసరా నెల ప్రారంభంలో విడుదలవుతున్న మొదటి వారం సినిమాల్లో సిగ్మా మీద మంచి అంచనాలే నెలకొన్నాయి. తమిళనాడు సిఎం కొడుకు…

8 hours ago