కరోనా కారణంగా తెలుగు సినిమా ఈ ఏడాది బిజినెస్ కోల్పోయింది. జనవరి, ఫిబ్రవరి మినహా తెలుగు సినిమా అసలు ఆపరేషన్‍లోనే లేదు. సంక్రాంతి వరకు సినిమాలు విడుదల చేసే మూడ్‍లో నిర్మాతలు లేకపోవడంతో తెలుగు సినిమా పరంగా ఈ ఏడాది ఒక ముగిసినట్టే. ఈ ఏడాది జరిగిన నష్టాల వల్ల ఎగ్జిబిషన్, డిస్ట్రిబ్యూషన్ రంగం అతలాకుతలమయింది.
వచ్చే ఏడాది ఈ నష్టం భర్తీ అవ్వాలంటే భారీ చిత్రాలు పెద్ద సంఖ్యలో రావాలి. ఎన్ని భారీ సినిమాలను విడుదల చేస్తే అంతగా ఈ నష్టాలను పూరించుకోవడంతో పాటు ఆడియన్స్ని అంతగా థియేటర్లకు మళ్లీ అలవాటు చేయవచ్చు. తెలుగు సినిమా బిజినెస్‍ను యథాస్థాయికి అంత త్వరగా తీసుకు రావచ్చు.
మిగిలిన హీరోల మాట ఎలా వున్నా పవర్‍స్టార్ పవన్ కళ్యాణ్ నుంచి మాత్రం వచ్చే ఏడాది మూడు సినిమాలు రావడం ఖాయం. ఇది సినిమా బిజినెస్‍లో వున్న వారికి చాలా మంచి న్యూస్. వకీల్ సాబ్, అయ్యప్పనుమ్ కోశియుమ్ రీమేక్ రెండూ ఒకటి సంక్రాంతి, మరొకటి సమ్మర్‍లో రిలీజ్ అవుతాయి. క్రిష్ చిత్రాన్ని కూడా దసరాకి విడుదల చేయాలనేది పవన్ కళ్యాణ్ ప్లాన్. ఆ సినిమా పూర్తి చేసాక హరీష్ శంకర్‍తో ఒక సినిమా, సురేందర్ రెడ్డితో మరో చిత్రం చేయాలని పవన్ సంకల్పించాడు. అంటే వచ్చే రెండేళ్లలో పవన్‍నుంచి అయిదు సినిమాలయితే పక్కా అన్నమాట.