ఆ మధ్య ఛావా ఆడియో ఈవెంట్లో తనది హైదరాబాద్ గా చెప్పుకున్న రష్మిక మందన్న సోషల్ మీడియాలో కన్నడిగుల ఆగ్రహానికి గురైన సంగతి తెలిసిందే. మూలాలు మర్చిపోయి ఇతర భాషలకు అంకితమైపోయిందంటూ కొందరు ట్వీట్లు పోస్టులు చేశారు. దానికి శ్రీవల్లి స్పందించలేదు కానీ తాజాగా రాజకీయ నాయకులు ఈ లిస్టులో చేరిపోతున్నారు. తాజాగా కర్ణాటక రాష్ట్రం మండ్య ఎమ్మెల్యే రవికుమార్ గానిగ రష్మిక మీద ఆగ్రహం వ్యక్తం చేస్తారు. బెంగళూరులో జరుగుతున్న ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్ కు పిలిచినా రాలేదని, కిరిక్ పార్టీతో తొలి అడుగులు తమ రాష్ట్రం నుంచే పడ్డాయనే విషయం మర్చిపోయిందని కస్సుబుస్సుమన్నారు.
కమిటీ తరఫున కొందరు పదిసార్లు కలిసి ఆహ్వానించారని అయినా సరే కర్ణాటక వచ్చేందుకు సమయం లేదని చెప్పి తప్పించుకుంది కాబట్టి ఆమెకు గుణపాఠం నేర్పించాలని పిలుపు ఇచ్చారు. మార్చి 1 నుంచి 8 దాకా జరుగుతున్న ఈ చిత్రోత్సవానికి శాండల్ వుడ్ నుంచి పేరున్న నటీనటులు ఎవరూ పెద్దగా పాల్గొనడం లేదు. దీనిపై డిప్యూటీ సిఎం డీకే శివకుమార్ సైతం గుర్రుగా ఉన్నారు. వీళ్ళలో మార్పు రాకపోతే ఏ విధంగా సరిచేయాలో కూడా తనకు తెలుసంటూ చురకలు వేశారు. ఇప్పుడు జరుగుతున్నది 16వ ఫిలిం ఫెస్టివల్. ఎన్నో అవార్డు పొందిన గొప్ప సినిమాలు, డాక్యుమెంటరీలు ఇందులో ప్రదర్శిస్తున్నారు.
అయినా స్వంత ఇండస్ట్రీ నుంచే పెద్దగా సెలబ్రిటీలు రానప్పుడు ముంబై, హైదరాబాద్ షూటింగులతో బిజీగా ఉన్న రష్మిక మందన్న రాలేదని విమర్శించడం సబబు కాదని అభిమానుల వెర్షన్. మూడు బ్లాక్ బస్టర్ హిట్లు యానిమల్, పుష్ప 2, ఛావాతో దూసుకుపోతున్న ఛలో బ్యూటీకి ఈ ఏడాది ఇంకో మూడు నాలుగు రిలీజులు ఉండబోతున్నాయి. తెలుగు తమిళం కన్నా హిందీలో భారీ ఆఫర్లు దక్కించుకుంటున్న రష్మిక మందన్న మీద స్వరాష్ట్రంలో ఇలాంటి వ్యతిరేకతకు కారణం లేకపోలేదు. కన్నడ సినిమాలు చేసేంత టైం తనకు లేకపోవడమే. దీని గురించి ఏమైందా స్పందిస్తుందేమో చూడాలి.
This post was last modified on March 3, 2025 6:04 pm
కొందరు ఫిలిం మేకర్స్ తమ సినిమా కథేంటో చివరి వరకు దాచి పెట్టాలని ప్రయత్నిస్తారు. నేరుగా థియేటర్లలో ప్రేక్షకులను ఆశ్చర్యపరచాలనుకుంటారు.…
ఏపీ సీఎం చంద్రబాబుకు ప్రముఖ దినపత్రిక `ఎకనమిక్ టైమ్స్`.. ప్రతిష్టాత్మక వ్యాపార సంస్కర్త-2025 పురస్కారానికి ఎంపిక చేసిన విషయం తెలిసిందే.…
బంగ్లాదేశ్లో ప్రస్తుతం నెలకొన్న పరిస్థితులు భారత్కు పెద్ద తలనొప్పిగా మారాయి. 1971 విముక్తి యుద్ధం తర్వాత మన దేశానికి ఇదే…
ప్రేమ ఎప్పుడు ఎవరి మీద పుడుతుందో చెప్పలేం అంటారు. కానీ జపాన్ లో జరిగిన ఈ పెళ్లి చూస్తే టెక్నాలజీ…
ప్రభుత్వం తరఫున ఖర్చుచేసేది ప్రజాధనమని సీఎం చంద్రబాబు తెలిపారు. అందుకే ఖర్చు చేసే ప్రతి రూపాయికీ ఫలితాన్ని ఆశిస్తానని చెప్పారు.…
`వ్యాపార సంస్కర్త-2025` అవార్డును ఏపీ సీఎం చంద్రబాబు కైవసం చేసుకున్నారు. అయితే.. దేశవ్యాప్తంగా 28 రాష్ట్రాలు, 28 మంది ముఖ్యమంత్రులు…