గత వారం టాలీవుడ్ బాక్సాఫీస్ కు నిరాశే మిగిలింది. చెప్పుకోదగ్గ అంచనాల మధ్య వచ్చిన మజాకా యావరేజ్ అనిపించుకోవడానికే కష్టపడుతుండగా డబ్బింగ్ సినిమాలు శబ్దం, అగత్యా నిరాశ కలిగించాయి. ఇప్పుడు కొత్త ఫ్రైడే వైపు మూవీ లవర్స్ దృష్టి మళ్లుతోంది. ఒకటి రెండు కాదు ఏకంగా పది దాకా రిలీజులు రంగం సిద్ధం చేసుకోవడం ఉత్సాహం కలిగించేదే అయినా దేని మీద విపరీతమైన అంచనాలు లేకపోవడం గమనార్షం. బాలీవుడ్ సెన్సేషనల్ బ్లాక్ బస్టర్ ‘ఛావా’ మూడు వారాలు ఆలస్యంగా తెలుగు డబ్బింగ్ రావడం ఏ మేరకు ఫలితం ఇస్తుందనే దాని మీద ట్రేడ్ వర్గాలు ఆసక్తిగా ఎదురు చూస్తున్నాయి.
మలయాళంలో ఇటీవలే విడుదలై విజయం సాధించిన ‘ఆఫీసర్ ఆన్ డ్యూటీ’ని అదే పేరుతో అనువదించి థియేటర్లకు తీసుకొస్తున్నారు. కుంచకో బోబన్, ప్రియమణి ప్రధాన తారాగణం. జివి ప్రకాష్ కుమార్ హీరోగా రూపొందిన ‘కింగ్స్టన్’ కోసం భారీ ప్రీ రిలీజ్ ఈవెంట్ చేస్తున్నారు. అతను సంగీతం అందిస్తున్న రాబిన్ హుడ్ నితిన్ తో పాటు పలువురు సినీ ప్రముఖులు హాజరు కాబోతున్నారు. సముద్రపు హారర్ బ్యాక్ డ్రాప్ లో కొత్త కాన్సెప్ట్ తీసుకున్నారు. కన్నడ డబ్బింగ్ ‘రాక్షస’తో పాటు ఇతర చిన్న సినిమాలు నారి, రారాజు, పౌరుషం, వైఫ్ అఫ్ అనిర్వేష్, శివంగి, నీకుకుళ్ళ, 14 డేస్ గర్ల్ ఫ్రెండ్ ఇంట్లో వస్తున్నాయి.
ప్రమోషన్ల పరంగా ఎవరికి వారు పబ్లిసిటీ చేసుకుంటున్నారు కానీ మొదటి రోజు టికెట్లు కొనిపించేలా ఎవరు చేయగలరనేది మాత్రం సస్పెన్సే. వీటికి తోడు మహేష్ బాబు – వెంకటేష్ రీ రిలీజ్ ‘సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు’కు భారీ స్పందన కనిపిస్తోంది. బుకింగ్స్ కూడా వేగంగా జరుగుతున్నాయి. కొత్త సినిమాల కంటే దీని డామినేషన్ ఎక్కువగా ఉన్నా ఏ మాత్రం ఆశ్చర్యపోనక్కర్లేదు. డ్రైగా ఉన్న టైంలో ఇన్నేసి సినిమాలు రావడం మంచిదే కానీ అంతో ఇంతో బజ్ ఉంటే తప్ప జనాలు కదిలే పరిస్థితి ఇప్పుడు లేదు. సో పాజిటివ్ టాక్ తెచ్చుకోవడం వీటికి కీలకం. వారం పది రోజులు నిలబడాలంటే కావాల్సింది అదే.
This post was last modified on March 3, 2025 12:34 pm
ఉమ్మడి అనంతపురం జిల్లాలోని ధర్మవరం నియోజకవర్గం ఒక్కసారిగా రాజకీయ చర్చకు వేదికగా మారింది. ప్రస్తుతం ఈ నియోజకవర్గం నుంచి మంత్రి…
ఇప్పుడు దేశమంతా ఇండియన్ హీరో కెప్టెన్ స్మిత్ మచ్చర్ గురించే మాట్లాడుతోంది. దేశమే కాదు యావత్ ప్రపంచంలోనూ ఇదే చర్చ…
యువ మంత్రి, కర్నూలు జిల్లాకు చెందిన టీజీ భరత్.. దూకుడు మామూలుగా లేదనే టాక్ వినిపిస్తోంది. టీడీపీ నాయకుడిగా.. యువ…
ఈ నెల విడుదలవుతున్న సినిమాల్లో అత్యధిక బడ్జెట్ తో రూపొందిన ప్యాన్ ఇండియా మూవీ రణబాలినే. విజయ్ దేవరకొండ, రష్మిక…
కొన్ని నెలల క్రితం మోహన్ లాల్ దృశ్యం 3 మీద చాలా విమర్శలొచ్చాయి. మలయాళం వెర్షన్ డబ్బులు తెచ్చి ఉండొచ్చేమో…
గత సంవత్సరం తండేల్ తర్వాత హీరోయిన్ సాయిపల్లవి దర్శనం బొత్తిగా లేకుండా పోయింది. ఈ ఏడాది ఏక్ దిన్ తో…