నాగార్జున షూటింగ్ నిమిత్తం హిమాలయాలకు వెళ్లడంతో సమంత ఆయనకు బదులుగా ఈ వీకెండ్ ఎపిసోడ్ హోస్ట్ చేసింది. మొదటి ఎపిసోడ్‍లోనే ఆమెతో కంటెస్టెంట్లను తిట్టించడం బాగోదు కనుక దసరా ఎపిసోడ్ ప్లాన్ చేసారు.
ఈ ఎపిసోడ్‍లో సమంత తన ఛార్మ్, హ్యూమర్ బాగానే చూపించింది కానీ తెలుగు భాషపై పట్టు లేకపోవడంతో కాస్త తడబడింది. అలాగే చాలా ఎమోషనల్ కూడా అని ఆమె రియాక్షన్స్లోనే తెలిసిపోయింది. కంటెస్టెంట్లు ఏడుస్తుంటే సమంత కళ్లు కూడా చెమర్చాయి. బిగ్‍బాస్ హోస్ట్ ఇంత ఎమోషనల్‍గా వుంటే కుదరదు. పైగా వారితో ఎంతసేపు ఆటపాటలు చెల్లవు. ఎప్పటికప్పుడు గట్టిగా క్లాసులు పీకుతుండాలి.
నాగ్ మరో రెండు వారాలు వుండరు కనుక ఆ రెండు వీకెండ్స్ కూడా సమంత హోస్ట్ చేస్తే కనుక ఆమెలోని సీరియస్ యాంగిల్ కూడా చూపించాలి. గత సీజన్లో రమ్యకృష్ణ ఒక ఎపిసోడ్ హోస్ట్ చేసి నాగార్జున కంటే సూపర్ అనిపించుకోగా, సమంత కేవలం సరదా కాలక్షేపంతో ఈ ఎపిసోడ్ ముగించేసింది.
పైగా ఆమెతో పాటు అఖిల్, హైపర్ ఆది, పాయల్ రాజ్‍పుట్, కార్తికేయ ఇలా పలువురు అతిథులు రావడం వల్ల సమంత పని సులువయింది. ఇంతవరకు తెలుగు బిగ్‍బాస్‍లో ముగ్గురు మగ హోస్టులు, ఇద్దరు లేడీ హోస్టులు కనిపించారు. వారిలో సమంత ర్యాంక్ ఏదని మీ అభిప్రాయం?
This post was last modified on October 26, 2020 10:28 am
విడుదల పార్ట్ 1 వచ్చినప్పుడు తెలుగులో మంచి ప్రశంసలు దక్కాయి. కమర్షియల్ గా సూపర్ హిట్ కాదు కానీ నష్టాలు…
పుష్ప-2 సినిమా బెనిఫిట్ షో సందర్భంగా జరిగిన తొక్కిసలాటలో ఓ మహిళ చనిపోవడం, ఆమె తనయుడు చావు బతుకుల మధ్య…
రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ ప్రభుత్వాలు మారాక బెనిఫిట్ షోలు, అదనపు రేట్లకు సులువుగానే అనుమతులు వచ్చేస్తుండడంతో టాలీవుడ్ నిర్మాతలు చాలా…
తెలంగాణలో కాంగ్రెస్ నేతలు వర్సెస్ అల్లు అర్జున్ వ్యవహారం ముదిరి పాకాన పడింది. అల్లు అర్జున్ పై అసెంబ్లీలో సీఎం…
మెగాస్టార్ చిరంజీవి, నందమూరి బాలకృష్ణల మధ్య సినిమాల పరంగా దశాబ్దాల నుంచి పోటీ నడుస్తోంది. వీరి అభిమానుల మధ్య ఉండే…
పెద్ద సినిమాలకు అర్ధరాత్రి అయినా, తెల్లవారుజామున అయినా స్పెషల్ షోలు వేసుకోవాలంటే సులువుగా అనుమతులు.. అలాగే రేట్లు ఎంత పెంచుకోవాలని…