‘బిగ్‍బాస్’ షోకి వెళ్లిన వారిలో చాలా మంది ఒక విషయం విస్మరిస్తుంటారు. ఈ షోలో ఫైనల్‍గా విజేత అయ్యేది ఒకరే. అందుకే ఎవరితోను ఓవర్‍గా అనుబంధం పెట్టుకోవడం, డిపెండ్ అవడం లేదా ఒకరిని గుడ్డిగా నమ్మేయడం చేయకూడదు. అందరినీ సరిగ్గా స్టడీ చేసిన దివి తన పక్కనే వున్న అమ్మ రాజశేఖర్‍ను స్టడీ చేయలేకపోయింది.
తనకు అతను మంచి చేస్తున్నాడనుకుని ప్రతి విషయంలో అతనిపై డిపెండ్ అవడం మొదలు పెట్టింది. అతడేమో ఆమె తన సపోర్ట్ తీసుకోవడాన్ని అలుసుగా తీసుకుని ‘గాళ్‍ఫ్రెండ్’, ‘ఫిగర్’ అంటూ వెనక మాట్లాడేవాడు. దాంతో ఎడిటర్లు దివి కనిపించిన ప్రతిసారీ అమ్మ రాజశేఖర్‍ని చూపించడం లేదా కపుల్ డాన్సులున్నపుడు ఇద్దరినీ కలిపి పంపించడం చేసారు. ఇది బయటకు ఎలా కనిపిస్తోందనేది దివికి తన ఎలిమినేషన్ ఎపిసోడ్ వరకు అర్థం కాలేదు. అందుకే బయటకు వెళుతూ బయట ఎవరెలా అనుకున్నా హౌస్‍లో నాకు నిజంగా మీరు అమ్మలాంటి వారు అని చెప్పుకుంది.
ఇక తన జర్నీ వీడియో చూడగానే దివికి మేటర్ బోధ పడిపోయింది. వంట వచ్చిన మగాళ్లు ఇష్టమని తాను అన్నప్పుడు అమ్మ రాజశేఖర్ ఇచ్చిన ఎక్స్ప్రెషన్ టీవీలో చూసి… ‘ఏంటి ఇలాంటి ఎక్స్ప్రెషన్ ఇచ్చారా?’ అంటూ ఆశ్చర్యపోయింది. ఇక ఇప్పుడు ఛానల్స్కి ఇచ్చే ఇంటర్వ్యూలలో ఈ మేటర్ క్లియర్ చేసుకోవడానికి కృషి చేయాలి. ఇదిలా వుంటే ఏనాడో అవుట్ కావాల్సిన అమ్మ రాజశేఖర్ కంటెస్టెంట్లను ఎమోషనల్ బ్లాక్‍మెయిల్ చేస్తూ నామినేషన్లు తప్పించుకుని ఇంకా హౌస్‍లో వున్నాడు. ఇకమీదట అయినా అతడిని నామినేట్ చేసి కంటెస్టెంట్లు బుర్ర వాడతారో లేదో చూడాలి.
This post was last modified on October 26, 2020 7:02 am
హెల్దిగా ఉండడం కోసం మనం తీసుకునే ఆరోగ్యకరమైన డైట్ లో సూపర్ఫుడ్స్ను భాగం చేసుకోవడం చాలా అవసరం. అలాంటి ఆహారాలలో…
వైసీపీ ప్రధాన కార్యదర్శి, పార్లమెంటులో ఆ పార్టీ నేత వేణుంబాక విజయసాయిరెడ్డి శుక్రవారం సాయంత్రం సంచలన ప్రకటన చేశారు. రాజకీయాల నుంచి…
అసలే థియేటర్ కు ఓటిటి మధ్య గ్యాప్ తగ్గిపోవడం పట్ల ఒకపక్క డిస్ట్రిబ్యూటర్లు ఆందోళన వ్యక్తం చేయడం చూస్తూనే ఉన్నాం.…
వైసీపీ అధినేత, మాజీ సీఎం జగన్.. గత ఏడాది జరిగిన ఎన్నికల్లో అధికారం కోల్పోయిన విషయం తెలిసిందే. కేవలం 11…
ఏపీ సర్కారు తరఫున సీఎం చంద్రబాబు, మంత్రి నారాలోకేష్లు దావోస్లో పెట్టుబడులు దూసుకు వచ్చే ప్రయత్నం చేశారు. ఈ విషయంలో…
ఈ సంక్రాంతికి భారీ అంచనాల మధ్య విడుదలైన ‘గేమ్ చేంజర్’ మూవీ.. రిలీజై ఒక్క రోజు తిరక్కముందే ఆన్ లైన్లోకి…