Movie News

సందీప్ వంగ సినిమా.. ఓన్లీ లేడీస్

తీసింది మూడు సినిమాలే అయినా.. దేశ‌వ్యాప్తంగా భారీగా అభిమాన గ‌ణాన్ని సంపాదించుకున్నాడు టాలీవుడ్ యువ ద‌ర్శ‌కుడు సందీప్ రెడ్డి వంగ‌. ఐతే అత‌డికి అభిమానులు మాత్ర‌మే లేరు. త‌నను ఘాటుగా విమ‌ర్శించే, తీవ్రంగా ద్వేషించే వారి సంఖ్య కూడా పెద్ద‌దే.

అర్జున్ రెడ్డి, క‌బీర్ సింగ్, యానిమ‌ల్.. ఈ మూడు చిత్రాల విష‌యంలోనూ అత‌ను విమ‌ర్శ‌లు ఎదుర్కొన్న సంగ‌తి తెలిసిందే. ముఖ్యంగా పురుషాధిక్య‌త‌ను గ్లోరిఫై చేసేలా.. ఆడ‌వాళ్ల‌ను కించ‌ప‌రిచేలా స‌న్నివేశాలు ఉంటాయ‌ని అత‌డిని విమ‌ర్శిస్తుంటారు క్రిటిక్స్. అనుప‌మ చోప్రా స‌హా చాలామంది క‌బీర్ సింగ్ రిలీజైన‌పుడు సందీప్‌పై మండిప‌డ్డ సంగ‌తి తెలిసిందే. వివిధ సంద‌ర్భాల్లో సందీప్ వారికి దీటైన స‌మాధాన‌మే ఇచ్చాడు.

అలాంటి సందీప్ భ‌విష్య‌త్తులో ఒక ఫుల్ లెంగ్త్ లేడీ ఓరియెంటెడ్ మూవీ చేయ‌బోతున్నాన‌ని ప్ర‌క‌టించి ఆశ్చ‌ర్యానికి గురి చేశాడు. ఇంకా పెద్ద విశేషం ఏంటంట‌.. ఈ సినిమా మొత్తం లేడీ క్యారెక్ట‌ర్లు మాత్ర‌మే ఉంటాయని అత‌ను చెప్పాడు.

కేవ‌లం లేడీ ఆర్టిస్టుల‌ను మాత్ర‌మే ముఖ్య పాత్ర‌ల‌కు తీసుకుని ఒక సినిమా చేయ‌బోతున్నాన‌ని.. అదొక నాలుగైదేళ్ల త‌ర్వాత ఉండొచ్చ‌ని సందీప్ ఓ ఇంట‌ర్వ్యూలో వెల్ల‌డించాడు. మ‌రి మీ చిత్రాల్లో లేడీ క్యారెక్ట‌ర్ల గురించి విమ‌ర్శిస్తుంటారు క‌దా అని అడిగితే.. తాను ఇప్పుడు చెబుతున్న‌ సినిమా చేసినా స‌రే వాళ్ల‌కు సంతృప్తి ఉండ‌ద‌ని, త‌నను అప్పుడు కూడా త‌ప్పుబ‌డ‌తార‌ని సందీప్ వ్యాఖ్యానించాడు. సందీప్ లాంటి ద‌ర్శ‌కుడి నుంచి ఓన్లీ లేడీ క్యారెక్ట‌ర్ల‌తో సినిమా వ‌స్తే అది క‌చ్చితంగా ఓ సంచ‌ల‌న‌మే అవుతుంది. మ‌రి నిజంగా అత‌నీ సినిమా చేస్తాడేమో చూడాలి.

మ‌రోవైపు తాను మ‌హాన‌టి త‌ర‌హా బ‌యోగ్ర‌ఫీ కూడా చేయాల‌నుకుంటున్న‌ట్లు సందీప్ తెలిపాడు. ఆ సినిమాకు క‌థ కూడా సిద్ధ‌మ‌వుతోంద‌ని.. దానికి ఇప్పుడు కావాలన్నా బ‌డ్జెట్ ల‌భిస్తుంద‌ని.. కానీ ఆ సినిమా కోసం తాను ఇంకా టైం తీసుకోవాల‌నుకుంటున్నాన‌ని సందీప్ తెలిపాడు మొత్తం పాజిటివ్ క్యారెక్ట‌ర్ల‌తో సినిమాలు తీసే.రాజ్ కుమార్ హిరాని నుంచి తాను ఒక డార్క్ మూవీ ఆశిస్తున్న‌ట్లు చెప్పిన సందీప్.. రామ్ గోపాల్ వ‌ర్మ మ‌ళ్లీ అంద‌రినీ ఆశ్చ‌ర్య‌ప‌రిచే హిట్ మూవీ తీయాల‌ను కోరుకుంటున్న‌ట్లు తెలిపాడు.

This post was last modified on March 2, 2025 9:36 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

కూటమి పొత్తుపై ఉండవ‌ల్లికి డౌట‌ట‌… ఈ విష‌యాలు తెలీదా?

ఏపీలో బీజేపీ-టీడీపీ-జ‌న‌సేన పొత్తు పెట్టుకుని గ‌త 2024 ఎన్నిక‌ల్లో అధికారంలోకి వ‌చ్చిన విష‌యం తెలిసిందే. ఇప్ప‌టికి 17 మాసాలుగా ఈ…

1 hour ago

కార్తి… అన్న‌గారిని భ‌లే వాడుకున్నాడే

తెలుగు ప్రేక్ష‌కుల‌కు ఎంతో ఇష్ట‌మైన త‌మిళ స్టార్ ద్వ‌యం సూర్య‌, కార్తి చాలా ఏళ్లుగా పెద్ద క‌మ‌ర్షియ‌ల్ హిట్ లేక…

1 hour ago

రూపాయి పతనంపై నిర్మలమ్మ ఏం చెప్పారంటే…

భార‌త ఆర్థిక వ్య‌వ‌స్థ‌ను ప్ర‌భావితం చేసేది.. `రూపాయి మార‌కం విలువ‌`. ప్ర‌పంచ దేశాలన్నీ దాదాపు అమెరికా డాల‌రుతోనే త‌మ‌తమ క‌రెన్సీ…

2 hours ago

జగన్ ‘చిన్న చోరీ’ వ్యాఖ్యలపై సీఎం బాబు రియాక్షన్ ఏంటి?

తిరుమలలో పరకామణి చోరీ వ్యవహారంపై రెండు రోజుల కిందట ప్రెస్ మీట్ లో మాజీ సీఎం జగన్ చేసిన వ్యాఖ్యలు…

5 hours ago

మాయమైన నందమూరి హీరో రీ ఎంట్రీ

ఎనభై తొంబై దశకంలో సినిమాలు చూసినవాళ్లకు బాగా పరిచయమున్న పేరు నందమూరి కళ్యాణ చక్రవర్తి. స్వర్గీయ ఎన్టీఆర్ సోదరుడు త్రివిక్రమరావు…

6 hours ago

దృశ్యం పాయింటుతో సిరీస్ తీశారు

శుక్రవారం ఏదైనా థియేటర్ రిలీజ్ మిస్ అయితే మూవీ లవర్స్ బాధ పడకుండా ఓటిటిలు ఆ లోటు తీరుస్తున్నాయి. ఇంకా…

7 hours ago