ఒక కొత్త సినిమా టీవీ ప్రీమియర్ కోసం ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురు చూసే రోజులు ఏనాడో పోయాయి కానీ జీ ఛానల్ వేసిన తెలివైన ఎత్తుగడ వల్ల నిన్న సంక్రాంతికి వస్తున్నాంకి భారీ స్పందన వచ్చింది. శాటిలైట్ టెలికాస్ట్, ఓటిటి రెండూ ఒకే రోజు ఒకే సమయంలో మొదలుపెట్టాలనే ఆలోచన బ్రహ్మాండమైన ఫలితం ఇచ్చిందని ప్రాధమిక సమాచారం. టిఆర్పి రేటింగులు గట్రా ఇంకో వారం ఆగితే తెలుస్తాయి కానీ గత రెండు మూడేళ్ళలో రాని నెంబర్లు వెంకటేష్ నమోదు చేయడం ఖాయమని అంటున్నారు. బాక్సాఫీస్ దగ్గర మూడు వందల కోట్లు కొల్లగొట్టినట్టే టీవీ అంకెల్లోనూ సంచలనాలు అందుకోవడం పక్కా.
ఇదిలా ఉండగా ఓటిటి వెర్షన్ లో సంక్రాంతికి వస్తున్నాం నిడివి 2 గంటల 16 నిముషాలు ఉంది. థియేట్రికల్ ప్లస్ టీవీ వెర్షన్ లెన్త్ 2 గంటల 24 నిముషాలు. అంటే ఎనిమిది నిముషాలు కట్ అయ్యిందని ఫ్యాన్స్ ఖంగారు పడ్డారు. పాటలు పోలేదు కానీ ఏ సీన్లు పోయాయోనని టెన్షన్ పడ్డారు. వాస్తవం ఏంటంటే అసలు ఎలాంటి కట్స్ లేవు. అయినా తేడా రావడానికి కారణముంది. ఓటిటిలో స్ట్రీమింగ్ చేసిన వెర్షన్ 24 FPS (ఫ్రేమ్స్ పర్ సెకండ్) ఉంది. కానీ ఉండాల్సింది 25 FPS. అంటే ఒక్క సెకనుకు ఎంత కదలిక ఉండాలనేది సెట్ చేయడాన్నే ఎఫ్పిఎస్ అంటారు. దాని వల్ల మూమెంట్ లో వ్యత్యాసం వచ్చి నిడివి మారిపోతుంది.
సో సంక్రాంతికి వస్తున్నాంలో ఏవో కట్స్ జరిగాయనే టెన్షన్ అక్కర్లేదు. 2025 తొలి బ్లాక్ బస్టర్ గా నిలిచిన ఈ సినిమా నిర్మాత దిల్ రాజు బ్యానర్ కు కంబ్యాక్ ఇచ్చింది. ఎన్నో వరస ఫ్లాపులతో పాటు పండక్కు గేమ్ ఛేంజర్ డిజాస్టర్ గాయాన్ని కూడా ఇదే మాన్పింది. ఎల్లుండి యాభై రోజుల పండగ చేయబోతున్నారు. సుమారు 40కి పైగా సెంటర్లలో ఫిఫ్టీ డేస్ నమోదైనట్టుగా సమాచారం. ఇప్పుడున్న పరిస్థితుల్లో ఒక ఫ్యామిలీ మూవీకి ఇంత రికార్డులు రావడం చిన్న విషయం కాదు. ఈ విజయం చూశాకే వెంకటేష్ తన తదుపరి సినిమాల ఎంపికలో మరింత జాగ్రత్తగా ఉంటూ వినోదానికి పెద్ద పీఠ వేయాలని నిర్ణయించుకున్నారు.
This post was last modified on March 2, 2025 1:14 pm
ఆదర్శ కుటుంబం టీజర్ వచ్చాక అందులో కంటెంట్ ఎలా ఉంటుందో ప్రేక్షకులకు ఐడియా వచ్చేసింది. అభిమానులు హ్యాపీగానే ఉన్నారు. వెంకీ…
ఫిలిం ఇండస్ట్రీలో చాలా ఏళ్ల పాటు నంబర్ స్థానానికి పోటీ పడ్డ ఇద్దరు టాప్ హీరోల మధ్య మంచి స్నేహం…
ఏంటో టాలీవుడ్ లో ఏదీ మాట మీద అనుకున్నది అనుకున్నట్టు జరుగుతుందన్న గ్యారెంటీ లేకుండా పోతోంది. వాయిదాల పర్వంలో నలిగిపోతున్న…
ఏపీ సీఎం చంద్రబాబు గతానికి భిన్నంగా ఏపీలో పాలన సాగిస్తున్నారు. గతంలో ఆయన మూడు సార్లు ముఖ్యమంత్రిగా పనిచేసిన సమయంలో…
అదేంటో పోలీస్, క్రైమ్ మీద మలయాళంలో ఎన్ని సినిమాలు వచ్చినా వాటికి కేరళ ప్రేక్షకులు ఆదరణ అందిస్తూనే ఉంటారు. తాజాగా…
టాలీవుడ్ మూవీ లవర్స్ ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్న కాంబినేషన్ హీరో వెంకటేష్, దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ జంటది. రచయితగా…