ఈ రోజుల్లో సినిమా తీయడం కంటే దాన్ని సరిగ్గా మార్కెట్ చేసి జనాల్లోకి తీసుకెళ్లడం పెద్ద సవాలుగా మారిపోయింది. థియేటర్లకు వచ్చే ప్రేక్షకుల సంఖ్య అంతకంతకూ తగ్గిపోతున్న నేపథ్యంలో పబ్లిసిటీ అన్నది చాలా కీలకం అయింది. ఈ నేపథ్యంలో ప్రేక్షకుల దృష్టిని ఆకర్షించడానికి కొత్త కొత్త ఐడియాలతో ముందుకు వెళ్తున్నారు ఫిలిం మేకర్స్. ఏదో ఒక కాంపిటీషన్ లాంటిది పెట్టి బహుమతులు ప్రకటించి ప్రేక్షకుల్లో సినిమా గురించి చర్చ జరిగేలా చేయడం అన్నది ఎప్పట్నుంచో ఉన్న స్ట్రాటజీనే.
ఇప్పటికీ దాన్ని అనుసరిస్తున్న వాళ్లు ఉన్నారు. ఈ నెలలోనే ప్రేక్షకుల ముందుకు రానున్న ‘దిల్ రుబా’ సినిమాను ప్రమోట్ చేసే క్రమంలో హీరో కిరణ్ అబ్బవరం ఇదే రూటును అనుసరిస్తున్నాడు. ‘ప్లాట్ గెస్ కొట్టు.. బైక్ పట్టు’ అంటూ అతను ఒక ఆసక్తికర ప్రమోషనల్ స్ట్రాటజీని అమలు చేస్తున్నాడు.
ఈ సినిమా కథ ఏంటన్నది ప్రమోషనల్ ఈవెంట్లు, ప్రోమోల ద్వారా తాము చెప్పకనే చెప్పేశామని.. ఈ నేపథ్యంలో ప్లాట్ పాయింట్ ఏంటన్నది ప్రేక్షకులు కని పెట్టి చెప్పాలని కిరణ్ పిలుపునిచ్చాడు. తమ క్రియేటివిటీకి ఆడియన్స్ పదును పెట్టాలని.. ఎవరు సృజనాత్మకంగా ఆలోచించి ప్లాట్ పాయింట్ చెబుతారో వారికి బైక్ గిఫ్టుగా ఇస్తామని కిరణ్ తెలిపాడు. ఐతే కిరణ్ ఇవ్వబోతున్నది మామూలు బైక్ కాదు. ఈ సినిమా కోసమే ఆర్ట్ డైరెక్టర్ ప్రత్యేకంగా డిజైన్ చేయించిన అల్ట్రా మోడర్న్ బైక్. దాన్ని వీడియోలో కిరణ్ చూపించాడు కూడా. అది చూస్తే ఎవరికైనా టెంప్టేషన్ రావడం గ్యారెంటీ.
కథ సరిగ్గా అంచనా వేసిన వారికి కేవలం ఈ బైక్ గిఫ్టుగా ఇవ్వడమే కాదు.. ఆ వ్యక్తితో కలిసి అదే బైక్ మీద ‘దిల్ రుబా’ థియేటర్‌కు వెళ్లి వారితో కలిసి సినిమా కూడా చూస్తానని కిరణ్ హామీ ఇచ్చాడు. విశ్వకరుణ్ అనే కొత్త దర్శకుడు రూపొందించిన ‘దిల్ రుబా’లో కిరణ్ సరసన రుక్సర్ థిల్లాన్ కథానాయికగా నటించింది. ఈ చిత్రం మార్చి 14న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.
This post was last modified on March 2, 2025 1:19 pm
ఏపీలో బీజేపీ-టీడీపీ-జనసేన పొత్తు పెట్టుకుని గత 2024 ఎన్నికల్లో అధికారంలోకి వచ్చిన విషయం తెలిసిందే. ఇప్పటికి 17 మాసాలుగా ఈ…
తెలుగు ప్రేక్షకులకు ఎంతో ఇష్టమైన తమిళ స్టార్ ద్వయం సూర్య, కార్తి చాలా ఏళ్లుగా పెద్ద కమర్షియల్ హిట్ లేక…
భారత ఆర్థిక వ్యవస్థను ప్రభావితం చేసేది.. `రూపాయి మారకం విలువ`. ప్రపంచ దేశాలన్నీ దాదాపు అమెరికా డాలరుతోనే తమతమ కరెన్సీ…
తిరుమలలో పరకామణి చోరీ వ్యవహారంపై రెండు రోజుల కిందట ప్రెస్ మీట్ లో మాజీ సీఎం జగన్ చేసిన వ్యాఖ్యలు…
ఎనభై తొంబై దశకంలో సినిమాలు చూసినవాళ్లకు బాగా పరిచయమున్న పేరు నందమూరి కళ్యాణ చక్రవర్తి. స్వర్గీయ ఎన్టీఆర్ సోదరుడు త్రివిక్రమరావు…
శుక్రవారం ఏదైనా థియేటర్ రిలీజ్ మిస్ అయితే మూవీ లవర్స్ బాధ పడకుండా ఓటిటిలు ఆ లోటు తీరుస్తున్నాయి. ఇంకా…