ఇండస్ట్రీలో హీరో హీరోయిన్ ఎవరైనా వాళ్ళ కెరీర్ ని నిర్దేశించేది సక్సెసే. ఒక ఫ్లాప్ తో కనుమరుగైన వాళ్లున్నారు. ఒక హిట్టుతో ఎక్కడికో చేరుకున్న లిస్టు తక్కువేమి కాదు. మిస్టర్ బచ్చన్ తో పరిచయమైన భాగ్యశ్రీ బోర్సే మూడో క్యాటగిరీలోకి వస్తోంది. అంటే డిజాస్టర్ తో లాంచ్ అయినా అవకాశాలకు కొదవ లేకుండా చేతి నిండా సినిమాలతో బిజీగా ఉండటం. తన తెలుగు హిందీ డెబ్యూలు యారియాన్ 2, మిస్టర్ బచ్చన్ రెండూ ఎంత పెద్ద ఫ్లాపో చెప్పనక్కర్లేదు. కానీ ఇప్పుడు మోస్ట్ వాంటెడ్ హీరోయిన్ గా తన దూకుడు మాములుగా లేదు. ఒకటి రెండు కాదు ఏకంగా అయిదారు ప్యాన్ ఇండియా సినిమాలతో డేట్లు దొరకనంతగా రైజవుతోంది.
విజయ్ దేవరకొండతో గౌతమ్ తిన్ననూరి చేస్తున్న ‘కింగ్ డమ్’లో ముందు శ్రీలీల ఆ తర్వాత రష్మిక మందన్నని అనుకున్నారు. కానీ కుదరక ఆ ఛాన్స్ భాగ్యశ్రీని వరించింది. ఎనర్జిటిక్ స్టార్ రామ్ తో మహేష్ బాబు (మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి ఫేమ్) దర్శకత్వంలో రూపొందుతున్న ఎంటర్ టైనర్లో తనకు చాలా మంచి స్కోప్ దక్కిందట. షూట్ దాదాపు సగం దాకా పూర్తయిపోయింది. దుల్కర్ సల్మాన్ హీరోగా రానా నిర్మిస్తున్న ‘కాంతా’ ఒక విభిన్న ప్రయత్నం. దీంట్లోనూ పెర్ఫార్మన్స్ డిమాండ్ చేసే క్యారెక్టర్ ఇచ్చారట. సూర్య – వెంకీ అట్లూరి కలయికలో రూపొందే సినిమాలోనూ భాగ్యశ్రీ బోర్సేని లాక్ చేయడం దాదాపు ఫిక్స్.
ఇవన్నీ ఒక ఎత్తు అయితే ప్రభాస్ దర్శకుడు ప్రశాంత్ వర్మ కాంబోలో తీయబోయే భారీ చిత్రంలోనూ తనే ఉందట. ఇటీవలే తీసిన ఫోటో షూట్ సంతృప్తికరంగా రావడంతో అగ్రిమెంట్ అయిపోయిందని ఫిలిం నగర్ టాక్. ఇలా మొత్తం అయిదు క్రేజీ మూవీస్ లో ఛాన్స్ దక్కించుకోవడమంటే మాములు విషయం కాదు. మిస్టర్ బచ్చన్ పోయినా భాగ్యశ్రీ గ్లామర్ బాగా వర్కౌట్ అయ్యింది. యూత్ కి కనెక్ట్ అయిపోయింది. అసలే టాలీవుడ్ లో హీరోయిన్ల కొరత ఉంది. ఇదే తనకు అవకాశంగా మారింది. వీటిలో ఏ రెండు మూడు బ్లాక్ బస్టరైనా దశ తిరిగిపోయి రష్మిక, శ్రీలీలలాగా దూసుకోవడం ఖాయం. చూడాలి మరి.
This post was last modified on March 1, 2025 5:01 pm
చిన్న లేదు.. పెద్ద లేదు.. ఇప్పుడు చాలా సినిమాలకు ముందు రోజే ప్రిమియర్స్ వేసేస్తున్నారు. చిన్న సినిమాలకు సెలెక్టివ్‌గా కొన్ని…
ఏపీలో త్వరలో జరగాల్సి ఉన్న స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు కల్పించేలా జారీ అయిన జీవోలను…
ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికల కోసం అన్ని పార్టీలు అస్త్రశస్త్రాలు సిద్ధం చేసుకుంటున్న సంగతి తెలిసిందే. అందులోనూ, ఈ సారి…
కొత్త నెల వచ్చేసింది. చూస్తుండగానే నెలలు హారతి కర్పూరంలా కరిగిపోతున్నాయి. సంక్రాంతి తర్వాత రెండు మూడు నెలలు టాలీవుడ్ బాక్సాఫీస్…
గ్లోబల్ బాక్సాఫీస్ ఫోకస్ మొత్తం ఇప్పుడు మహేష్ బాబు, రాజమౌళిల ‘వారణాసి’ పైనే ఉంది. అయితే ఆ భారీ చిత్రం…
బాహుబలి, కెజిఎఫ్ లాంటి విజువల్ గ్రాండియర్ సీక్వెల్స్ కి క్రేజ్ ఉండటంలో ఆశ్చర్యం లేదు. వందల కోట్ల బడ్జెట్, విఎఫ్ఎక్స్…