డీజే టిల్లుతో సిద్ధు జొన్నలగడ్డ రేపిన సంచలనం అంతా ఇంతా కాదు. చిన్న సినిమాలా మొదలై పెద్ద రేంజికి వెళ్లిపోయిందది. ఇక దీని సీక్వెల్ ‘టిల్లు స్క్వేర్’ గత ఏడాది వేసవిలో విడుదలై ఏకంగా వంద కోట్లకు పైగా వసూళ్లు రాబట్టింది. దీనికి కొనసాగింపుగా టిల్లు క్యూబ్ కూడా రాబోతున్నట్లు అప్పుడే చిత్ర బృందం ప్రకటించిన సంగతి తెలిసిందే. ఐతే ఈ చిత్రాన్ని ఎవరు డైరెక్ట్ చేస్తారనే విషయంలో కొంత సస్పెన్స్ ఉండేది. ఇప్పుడా విషయంలో క్లారిటీ వచ్చేసింది. టిల్లు క్యూబ్‌ను ‘మ్యాడ్’, ‘మ్యాడ్ స్క్వేర్’ చిత్రాల దర్శకుడు కళ్యాణ్ శంకర్ రూపొందించబోతున్నట్లు నిర్మాత సూర్యదేవర నాగవంశీ అధికారికంగా ప్రకటించాడు. ఇది టిల్లు అభిమానులను బాగా ఎగ్జైట్ చేసే విషయమే.
డీజే టిల్లు మూవీని విమల్ కృష్ణ డైరెక్ట్ చేయగా.. సీక్వెల్‌కు వచ్చేసరికి దర్శకుడు మారిపోయాడు. మల్లిక్ రామ్ ఈ చిత్రాన్ని రూపొందించాడు. ఇప్పుడు మూడో పార్ట్ కళ్యాణ్ శంకర్ చేతికి వచ్చింది. ఇంతకుముందు ఇద్దరు దర్శకులకు పెద్దగా గుర్తింపు లేదు. అంతా సిద్ధు జొన్నలగడ్డనే చూసుకున్నాడనే పేరొచ్చింది. రైటింగ్, మేకింగ్‌లో అతడి ఇన్వాల్వ్‌మెంట్ గురించి అందరికీ తెలిసిందే. ఐతే కళ్యాణ్ తక్కువవాడేమీ కాదని ‘మ్యాడ్’ సినిమాతోనే రుజువైంది.
తన సెన్సాఫ్ హ్యూమరే వేరు. మ్యాడ్ స్క్వేర్ టీజర్లోనూ అది కనిపించింది. సిద్ధు రైటింగ్ టాలెంట్‌కి కళ్యాణ్ ప్రతిభ కూడా తోడైతే ఔట్ పుట్ వేరే లెవెల్లో ఉంటుందని ఆశించవచ్చు. కామెడీ పీక్స్‌కు వెళ్లడం గ్యారెంటీ. కాబట్టి ఈ సినిమాకు హైప్ కూడా మామూలుగా ఉండబోదు. ప్రస్తుతం ‘జాక్’, ‘తెలుసు కదా’ చిత్రాల్లో నటిస్తున్న సిద్ధు.. ఈ ఏడాది ద్వితీయార్ధంలో ‘టిల్లు క్యూబ్’ను పట్టాలెక్కించాలని చూస్తున్నాడు. ఈలోపు కళ్యాణ్, అతను కలిసి స్క్రిప్టు రెడీ చేయబోతున్నారు.
This post was last modified on March 1, 2025 3:03 pm
కన్నడ కి అతి దగ్గర గా ఉండే లిపి తెలుగే. బళ్లారి ఆంధ్ర సరిహద్దు పట్టణం తెలుగు కూడా మాట్లాడుతారు.…
వెల్లులి బెట్టి పొగిచిన పుల్లని గోంగూర రుచిని బొగడగ వశమా? అంటూ గోంగూర రుచిని పొగిడారో తెలుగు కవి. గోంగూరకు…
ఏడు పదుల వయసులో రకరకాల పాత్రలు చేస్తూ తనకు తాను ఛాలెంజ్ విసురుకుంటున్న మలయాళం స్టార్ మమ్ముట్టి కొత్త సినిమా…
ఒకరికి శాపం మరొకరికి వరం అయ్యిందన్న తరహాలో అఖండ 2 వాయిదా బాలీవుడ్ మూవీ దురంధర్ కు భలే కలిసి…
బాలయ్య కెరీర్ లోనే మొదటిసారి ఇలాంటి పరిస్థితి చూస్తున్నామా అన్నట్టుగా అఖండ 2 తాలూకు పరిణామాలు ఫ్యాన్స్ ని బాగా…
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(ఏఐ)లో ఏపీ దూకుడుగా ఉందని కేంద్ర ప్రభుత్వం తెలిపింది. ఏఐ ఆధారిత ఉత్పత్తులు, వృద్ధి వంటి అంశాల్లో ఏపీ…