ఇప్పటి తరం కుర్రాళ్లకు ఐడియా ఉండకపోవచ్చేమో కానీ పాత సినిమాలు చూసే అలవాటు ఉంటే మాత్రం రంభ పేరు సుపరిచితమే. ఆమెకు కల్ట్ ఫ్యాన్స్ చాలా ఉన్నారు. ఆ మధ్య దర్శకుడు అజయ్ భూపతి తన మహా సముద్రంలో ఆమె కటవుట్ పెట్టి ఒక పాటను రాయించారంటే ఎంత ఫాలోయింగో అర్థం చేసుకోవచ్చు. 1992 రాజేంద్రప్రసాద్ ఆ ఒక్కటి అడక్కుతో పరిశ్రమకు వచ్చిన రంభ తక్కువ టైంలోనే అగ్ర హీరోల సరసన ఛాన్స్ కొట్టేసింది. డెబ్యూ సూపర్ హిట్ తో పాటు ఏవండీ ఆవిడ వచ్చింది ఘనవిజయం సాధించడం అవకాశాలను తెచ్చి పెట్టింది. కెరీర్ ప్రారంభంలోనే కృష్ణ రౌడీ అన్నయ్యలో నటించింది.
అటుపై సుమన్ చిన్నల్లుడు, చిరంజీవి అల్లుడా మజాకా – హిట్లర్ – బావగారు బాగున్నారా, బాలకృష్ణ మాతో పెట్టుకోకు, వెంకటేష్ ముద్దుల ప్రియుడు – గణేష్ , జగపతిబాబు అల్లరి ప్రేమికుడు – చూసొద్దాం రండి, ఇలా ఎన్నో సూపర్ హిట్స్ తన ఖాతాలో చేరాయి. పవన్ కళ్యాణ్ తొలి చిత్రం అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి స్పెషల్ సాంగ్ కోసం ఈవివి సత్యనారాయణ రంభనే తీసుకున్నారంటే అప్పట్లో క్రేజ్ అలా ఉండేది. 1999 నుంచి రంభకు ఫ్లాపులు పడ్డాక కొంత గ్యాప్ తీసుకుని పెళ్లి చేసుకుని వెళ్ళిపోయింది. దేశముదురు అల్లు అర్జున్, జూనియర్ ఎన్టీఆర్ యమదొంగలో అలా తళుక్కున మెరిసి మాయమైపోయింది.
2008 దొంగసచ్చినోళ్ళు తర్వాత రంభ పూర్తిగా పరిశ్రమకు దూరంగా ఉంటూ వచ్చింది. కుటుంబానికి అంకితమై ఆఫర్లు వచ్చినా నో చెబుతూ వచ్చింది. తిరిగి ఇప్పుడు రీ ఎంట్రీకి రెడీ అవుతోంది. ఇంద్రజ, ఆమని, మధుబాల, రమ్యకృష్ణ, మీనా, ఖుష్బూ లాంటి తన సమకాలీకులు సెకండ్ ఇన్నింగ్స్ లో దూసుకుపోతున్న తీరు రంభలోనూ ఆశలు రేపినట్టు ఉంది. ఇది సరైన సమయమని, సినిమాల మీద దృష్టి పెడతానని చెప్పడం చూస్తే త్వరలోనే ఆ ఘడియ వచ్చేలా ఉంది. హీరోయిన్ గా కాదు కానీ మంచి వెయిట్ ఉన్న క్యారెక్టర్ ఆర్టిస్టుగా పవర్ ఫుల్ పాత్రలు ఇస్తే టాలీవుడ్ కు మరో సీనియర్ నటి దొరికినట్టే.
This post was last modified on March 1, 2025 2:33 pm
ఏపీలో బీజేపీ-టీడీపీ-జనసేన పొత్తు పెట్టుకుని గత 2024 ఎన్నికల్లో అధికారంలోకి వచ్చిన విషయం తెలిసిందే. ఇప్పటికి 17 మాసాలుగా ఈ…
తెలుగు ప్రేక్షకులకు ఎంతో ఇష్టమైన తమిళ స్టార్ ద్వయం సూర్య, కార్తి చాలా ఏళ్లుగా పెద్ద కమర్షియల్ హిట్ లేక…
భారత ఆర్థిక వ్యవస్థను ప్రభావితం చేసేది.. `రూపాయి మారకం విలువ`. ప్రపంచ దేశాలన్నీ దాదాపు అమెరికా డాలరుతోనే తమతమ కరెన్సీ…
తిరుమలలో పరకామణి చోరీ వ్యవహారంపై రెండు రోజుల కిందట ప్రెస్ మీట్ లో మాజీ సీఎం జగన్ చేసిన వ్యాఖ్యలు…
ఎనభై తొంబై దశకంలో సినిమాలు చూసినవాళ్లకు బాగా పరిచయమున్న పేరు నందమూరి కళ్యాణ చక్రవర్తి. స్వర్గీయ ఎన్టీఆర్ సోదరుడు త్రివిక్రమరావు…
శుక్రవారం ఏదైనా థియేటర్ రిలీజ్ మిస్ అయితే మూవీ లవర్స్ బాధ పడకుండా ఓటిటిలు ఆ లోటు తీరుస్తున్నాయి. ఇంకా…