అక్కినేని అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తున్న సినిమా ‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్’. తొలి మూడు సినిమాలతో చేదు అనుభవాలు ఎదుర్కొన్న అఖిల్ ఈ చిత్రంతో బౌన్స్ బ్యాక్ అవుతాడని ఆశిస్తున్నారు వాళ్లు. ఈ సినిమాతో బౌన్స్ బ్యాక్ అవ్వాల్సింది హీరో మాత్రమే కాదు.. దర్శకుడు బొమ్మరిల్లు భాస్కర్ కూడా.
తొలి సినిమా ‘బొమ్మరిల్లు’తో తిరుగులేని విజయాన్నందుకుని.. రెండో సినిమా ‘పరుగు’తోనూ సక్సెస్ చూసిన భాస్కర్ మూడో సినిమా ‘ఆరెంజ్’తో మాత్రం దారుణమైన అనుభవాన్ని ఎదుర్కొన్నాడు. ఆ సినిమా డిజాస్టర్ అయి నిర్మాత నాగబాబును ముంచేసింది. దీంతో భాస్కర్ కెరీర్ తల్లకిందులైంది. ఒంగోలు గిత్త, ‘బెంగళూరు డేస్’ తమిళ రీమేక్‌లతో ఇంకా గట్టి ఎదురు దెబ్బలు తిన్నాడు. ఇంత కాలానికి మళ్లీ గీతా ఆర్ట్స్ లాంటి పెద్ద బేనర్లో అఖిల్ హీరోగా సినిమా చేసే అవకాశం దక్కించుకున్నాడు.
ఇప్పటిదాకా రిలీజైన ‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్’ ప్రోమోలు పాజిటివ్ ఫీల్‌నే ఇచ్చాయి. తాజాగా టీజర్ రిలీజ్ చేయగా అది కూడా బాగానే అనిపించింది. కానీ ఆ టీజర్ చూసిన జనాలకు ‘ఆరెంజ్’ గుర్తు వచ్చి ఉంటే ఆశ్చర్యమేమీ లేదు. అందులో ప్రేమ, పెళ్లి మీద చాలా పెద్ద డిస్కషనే ఉంటుంది. కానీ అది ఆశించినంత వినోదాత్మకంగా లేకపోవడం, చర్చ మరీ లోతుల్లోకి వెళ్లిపోయి విసుగు తెప్పించేయడంతో సినిమాకు దారుణమైన ఫలితం వచ్చింది.
ఇప్పుడు ‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్’లోనూ పెళ్లి మీద పెద్ద డిస్కషనే పెట్టినట్లున్నాడు భాస్కర్. పెళ్లి మీద యువతీ యువకుల అభిప్రాయాల చుట్టూనే ఈ టీజర్ నడిచింది. హీరో హీరోయిన్లిద్దరూ విరుద్ధమైన భావాలతో కనిపించారు. టీజర్లో ఇంకేమీ చూపించకుండా ఈ అభిప్రాయాలు, భావాల చుట్టూనే తిప్పడంతో భాస్కర్ మళ్లీ లోతైన డిస్కషన్లోకి వెళ్లిపోతాడా అన్న సందేహాలు కలిగాయి. కానీ ఒకసారి దెబ్బ తిన్నాక అతను మళ్లీ ఆ తప్పు చేస్తాడని అనుకోలేం. పైగా ఇక్కడ అరవింద్ ఉన్నాడు. అందులోనూ అఖిల్ కెరీర్‌కు ఇది చాలా ముఖ్యమైన సినిమా. కాబట్టి ‘ఆరెంజ్’ తరహా కథనే వినోదాత్మకంగా చెప్పి మెప్పిస్తాడేమో చూడాలి భాస్కర్.
This post was last modified on October 26, 2020 5:25 pm
మలయాళ లెజెండరీ ఆర్టిస్ట్ మోహన్ లాల్ ఎంత గొప్ప నటుడో కొత్తగా చెప్పాల్సిన పని లేదు. నాలుగు దశాబ్దాల కెరీర్లో…
సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటన ఇప్పుడు ఎంతగా చర్చనీయాంశం అవుతోందో తెలిసిందే. గత కొన్ని రోజుల నుంచి రెండు తెలుగు…
క్రిస్మస్ కి రావాలని ముందు డిసెంబర్ 20 ఆ తర్వాత 25 డేట్ లాక్ చేసుకుని ఆ మేరకు అధికారిక…
అక్కినేని అభిమానులు ఇది గుర్తుకురాకపోతే మంచిదనేంత పెద్ద డిజాస్టర్ కస్టడీ. అజిత్ గ్యాంబ్లర్ లాంటి బ్లాక్ బస్టర్స్ ఇచ్చిన దర్శకుడు…
హైదరాబాద్ లోని ట్రాఫిక్ సిగ్నల్స్, చౌరస్తాల దగ్గర ట్రాన్స్ జెండర్లను విధుల్లో పెట్టాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించిన సంగతి తెలిసిందే.…
ఏపీ సీఎం చంద్రబాబు అంటేనే..'టెక్నాలజీ గురు' అన్న పేరు వినిపిస్తుంది. ఐటీ రంగంలో ఆయన సాధించిన ప్రగతి ఇప్పటికీ ఘన…