నందమూరి కళ్యాణ్ రామ్ తెర మీద కనిపించి ఏడాది దాటేసింది. 2023 డిసెంబర్ లో డెవిల్ రిలీజయ్యాక మళ్ళీ దర్శనం లేదు. దీంతో పాటు అదే ఏడాది అమిగోస్ రూపంలో మొత్తం రెండు ఫ్లాపులు చవి చూసి కొంత బ్రేక్ తీసుకున్నాడు. అయితే తన ఇరవై ఒకటవ సినిమా మీద మంచి అంచనాలే నెలకొన్నాయి. ప్రదీప్ చిలుకూరి దర్శకత్వంలో భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్న యాక్షన్ ఎంటర్ టైనర్ సంవత్సరానికి పైగానే నిర్మాణంలో ఉంది. పలు టైటిల్స్ ప్రచారంలోకి వచ్చాయి. మెరుపు, రుద్ర అంటూ ఫిలిం నగర్ లో మాట్లాడుకున్నారు కానీ ఫైనల్ గా ఏది ఫిక్స్ చేస్తారనేది ఇంకా నిర్ణయం తీసుకోలేదు.
షూట్ చివరి దశకు చేరుకుంది. మేజర్ ఫేమ్ సయీ మంజ్రేకర్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ మూవీలో మరో ప్రధాన ఆకర్షణ సీనియర్ హీరోయిన్ విజయశాంతి. సరిలేరు నీకెవ్వరు తర్వాత ఎట్టి పరిస్థితుల్లో నటించను అని చెప్పిన రాములమ్మ ఈ కళ్యాణ్ రామ్ కథ విపరీతంగా నచ్చడం వల్ల ఓకే చెప్పారు. పైగా కర్తవ్యం పోలీస్ ఆఫీసర్ వైజయంతి పాత్రని రీ క్రియేట్ చేయడంతో ప్రత్యేక అంచనాలు నెలకొన్నాయి. విరూపాక్ష, మంగళవారం ఫేమ్ అజనీష్ లోకనాథ్ సంగీతం సమకూర్చడం మరో అట్రాక్షన్. ఇన్ని ప్రత్యేకతలు ఉన్నప్పుడు సరైన రీతిలో ప్రమోషన్ చేసుకుంటే ఖచ్చితంగా అంచనాలు రేపొచ్చు.
ఆలస్యానికి పలు కారణాలు వినిపిస్తున్నాయి. ఓటిటి డీల్ తో పాటు వేసవి మొత్తం పెద్ద సినిమాలతో రిలీజ్ డేట్లు లాకైపోవడంతో సరైన తేదీ కోసం చూస్తున్నారట. దేవరతో తమ్ముడు జూనియర్ ఎన్టీఆర్ బ్లాక్ బస్టర్ అందుకున్నాక అన్న కళ్యాణ్ రామ్ హిట్ కొట్టాలని ఫ్యాన్స్ ఎదురు చూస్తున్నారు. చాలా ముఖ్యమైన సందర్భాల్లో తప్ప కళ్యాణ్ రామ్ బయట కనిపించడం కూడా తగ్గించేశాడు. బింబిసార 2 అనౌన్స్ చేసి నెలలు గడిచిపోయినా ఇప్పటిదాకా దానికి సంబంధించి ఎలాంటి అప్డేట్స్ ఇవ్వలేదు. ప్రధానంగా ఈ రెండే లైనప్ లో ఉన్నాయి. తారక్ వార్ 2 వచ్చేలోపే కళ్యాణ్ రామ్ ది రిలీజవ్వాలని ఫ్యాన్స్ కోరిక.
This post was last modified on February 28, 2025 8:42 am
హీరోల పారితోషకాలు అంతకంతకూ పెరిగిపోతుండడంపై నిర్మాతల్లో ఆందోళన వ్యక్తమవుతున్న మాట వాస్తవం. పైకి చెప్పకపోయినా ఈ విషయంలో అసంతృప్తితో ఉన్నారన్నది ఇండస్ట్రీలో…
అధికారంలో ఉన్న నాయకులు, అధికారంలో లేని నాయకులు ఇలా రెండు వర్గాలుగా విభజించినప్పుడు సాధారణంగా పదవులు పొందిన వారు సంతృప్తి…
మూడు రోజుల తెలుగు వారి పెద్ద పండుగ.. సంక్రాంతి. ఇళ్లకే కాదు.. గ్రామాలకు సైతం శోభను తీసుకువచ్చే సంక్రాంతికి.. కోడి…
ఈ సంక్రాంతికి ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’ చిత్రంతో ప్రేక్షకులను పలకరించబోతోంది డింపుల్ హయతి. కెరీర్లో ఆమెకు ఇంకా పెద్ద బ్రేక్ రాలేదు. ఇప్పటికే ఖిలాడి,…
బీజేపీ కురువృద్ధ నాయకుడు, దేశ మాజీ ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్యనాయుడు.. ప్రస్తుతం ప్రత్యక్ష రాజకీయాల నుంచి తప్పుకొన్నారు. అయితే.. ఆయన…
చుక్క పడందే నిద్ర పట్టని వారు చాలా మంది ఉన్నారు. వీరిలో చిన్న చితకా మందుబాబులను పక్కన పెడితే, మద్యం…