ఈ ఏడాది బాలీవుడ్ బిగ్గెస్ట్ వెయిటెడ్ మూవీగా రూపొందుతున్న సికందర్ టీజర్ ఈ రోజు విడుదల చేశారు. ఏఆర్ మురుగదాస్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ యాక్షన్ ఎంటర్ టైనర్ లో లక్కీ ఛార్మ్ రష్మీక మందన్న హీరోయిన్ గా నటిస్తోంది. షూటింగ్ దాదాపు పూర్తి కావొస్తోంది. ఎట్టి పరిస్థితుల్లో రంజాన్ పండక్కు రిలీజ్ చేయాలనే లక్ష్యంతో ఆఘమేఘాల మీద పనులు పూర్తి చేస్తున్నారు. అయితే టీజర్ చూశాక గతంలో మురుగదాసే తీసిన విజయ్ సర్కార్ తో పాటు ఇటీవలే వచ్చిన గేమ్ ఛేంజర్ వైబ్స్ కనిపించడం అనుమానాలు రేపుతున్నాయి. కొంచెం తేడాగా ఉందని ఒప్పుకోక తప్పదు.
నిమిషంన్నర వీడియోకే తీర్పులు ఇచ్చేయలేం కానీ ఏ సినిమాకైనా మొదటి ప్రమోషనల్ టూల్ టీజర్ లేదా ట్రైలరే కాబట్టి అంచనాల బరువు వీటి మీద ఎక్కువగా ఉంటుంది. కథేంటో రివీల్ చేయలేదు కానీ సల్మాన్ ఖాన్ రౌడీలను మట్టుబెట్టడం, సత్యరాజ్ పాత్ర రూపంలో ఒక రాజకీయ పార్టీ సెటప్ చూపించడం, సూటు బూటు వేసుకుని హీరో యాక్షన్ లోకి దిగడం ఇవన్నీ రెగ్యులర్ గా చూసినట్టే అనిపిస్తున్నాయి. మురుగదాస్ డైరెక్షన్ కాబట్టి ఎంత వద్దనుకున్నా సౌత్ ఫ్లేవర్ బాగా కనిపించింది. ఇటీవలే వచ్చిన మదరాసి టీజర్ దర్శకుడు ఈయనేనా అనిపించేంతగా వ్యత్యాసం ఉంది.
ఇప్పటికి ఏదో సర్దుకున్నా అసలైన అంచనాలు ట్రైలర్ తో మొదలవుతాయి. వచ్చే నెలాఖరున విడుదల కాబోతున్న సికందర్ సల్మాన్ ఖాన్ కు చాలా కీలకం. గత కొన్నేళ్లుగా ఆయన స్థాయి హిట్టు పడలేదు. షారుఖ్ ఖాన్ బ్యాక్ టు బ్యాక్ బ్లాక్ బస్టర్లు జవాన్, పఠాన్ తో కంబ్యాక్ ఇచ్చాక కండలవీరుడు నుంచి అలాంటి హిట్స్ కోసం ఫ్యాన్స్ ఎదురు చూస్తున్నారు. దాని కోసమే సల్మాన్ ముందు ఒప్పుకున్న విష్ణువర్ధన్ (పంజా దర్శకుడు) సినిమాని క్యాన్సిల్ చేసుకుని మరీ సికందర్ ని ఒప్పుకున్నాడు. నిర్మాత సాజిద్ నడియాడ్ వాలా భారీగా ఖర్చు పెట్టారు. రిలీజ్ డేట్ మార్చ్ 28 అయ్యే ఛాన్స్ ఎక్కువగా ఉంది.
This post was last modified on February 27, 2025 5:02 pm
చిన్న లేదు.. పెద్ద లేదు.. ఇప్పుడు చాలా సినిమాలకు ముందు రోజే ప్రిమియర్స్ వేసేస్తున్నారు. చిన్న సినిమాలకు సెలెక్టివ్‌గా కొన్ని…
ఏపీలో త్వరలో జరగాల్సి ఉన్న స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు కల్పించేలా జారీ అయిన జీవోలను…
ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికల కోసం అన్ని పార్టీలు అస్త్రశస్త్రాలు సిద్ధం చేసుకుంటున్న సంగతి తెలిసిందే. అందులోనూ, ఈ సారి…
కొత్త నెల వచ్చేసింది. చూస్తుండగానే నెలలు హారతి కర్పూరంలా కరిగిపోతున్నాయి. సంక్రాంతి తర్వాత రెండు మూడు నెలలు టాలీవుడ్ బాక్సాఫీస్…
గ్లోబల్ బాక్సాఫీస్ ఫోకస్ మొత్తం ఇప్పుడు మహేష్ బాబు, రాజమౌళిల ‘వారణాసి’ పైనే ఉంది. అయితే ఆ భారీ చిత్రం…
బాహుబలి, కెజిఎఫ్ లాంటి విజువల్ గ్రాండియర్ సీక్వెల్స్ కి క్రేజ్ ఉండటంలో ఆశ్చర్యం లేదు. వందల కోట్ల బడ్జెట్, విఎఫ్ఎక్స్…