గత కొంతకాలంగా ఫ్లాపులతో సతమతమవుతున్న బుట్టబుమ్మ పూజా హెగ్డే ఇటీవలే దేవా రూపంలో మరో బాలీవుడ్ డిజాస్టర్ ఖాతాలో వేసుకుంది. షాహిద్ కపూర్ హీరోగా రూపొందిన ఈ పోలీస్ డ్రామా ఎప్పుడో మళయాలంలో వచ్చిన ముంబై పోలీస్ (సుధీర్ బాబు హంట్) రీమేక్ కావడంతో కీలక మార్పులు చేసినా సరే ప్రేక్షకులు రిసీవ్ చేసుకోలేదు. ఇక తెలుగు విషయానికి వస్తే రాధే శ్యామ్, ఆచార్య తర్వాత పూజా హెగ్డే టాలీవుడ్ లో కనిపించడం బొత్తిగా మానేసింది. మధ్యలో ఎఫ్3 స్పెషల్ సాంగ్ చేసినా తనకు కలిగిన ప్రయోజనం ఏం లేదు. కానీ తమిళంలో మాత్రం సీరియస్ ఫోకస్ పెడుతూ వరుస ఆఫర్లు పట్టేస్తోంది.
సూర్య ‘రెట్రో’ మీద బజ్ చూస్తుంటే భారీ ఓపెనింగ్స్ తో పాటు హిట్ కళ కనిపిస్తోందని ఫ్యాన్స్ ముందస్తుగా ఫిక్స్ అయిపోతున్నారు. కాస్త డీ గ్లామర్ టచ్ తో పూజాని దర్శకుడు కార్తీక్ సుబ్బరాజ్ ఇందులో కొత్తగా చూపించాడని టీజర్ చూశాక అర్థమయ్యింది. తలపతి విజయ్ ‘జన నాయగన్’లోనూ తనే హీరోయిన్. బీస్ట్ లో ఆల్రెడీ జోడి కట్టినప్పటికీ మరోసారి కోరి మరీ తనను పిలిపించారు. లారెన్స్ ప్యాన్ ఇండియా లెవెల్ లో తీస్తున్న ‘కాంచన 4’లో ఇటీవలే లాకయ్యింది. రెగ్యులర్ హీరోయిన్ ఫార్మాట్ కాకుండా హారర్ టచ్ ఉన్న కొత్త తరహా పాత్రని ఇందులో పూజా హెగ్డేకి డిజైన్ చేసినట్టు చెన్నై అప్డేట్.
ఇవన్నీ ఒక ఎత్తు అయితే సూపర్ స్టార్ రజనీకాంత్ ‘కూలి’లో పూజా హెగ్డే ఉన్నట్టు ఇవాళ అధికారికంగా ప్రకటించారు. ఇది పది రోజుల క్రితమే లీకైనా ఈ రోజు అధికారిక ముద్ర పడింది. అయితే తను చేస్తోంది ఐటెం సాంగ్ ఉండే క్యామియో లాంటి క్యారెక్టరట. చిన్నదో పెద్దదో రజని – నాగార్జున – ఉపేంద్ర – అమీర్ ఖాన్ భాగమైన మల్టీస్టారర్ లో ఉండటం చిన్న విషయం కాదు. వాస్తవిక కోణంలో చూస్తే పూజా హెగ్డేకు మన దర్శకులు కథలు చెప్పక కాదు. తనే కోలీవుడ్ వైపు ఎక్కువ మొగ్గు చూపిస్తోందట. ఈ కారణంగానే రెండు మూడు తెలుగు ఆఫర్లకు నో చెప్పిందని వినికిడి. దీపం ఎక్కడ ఎక్కువ వెలిగితే అక్కడే ఉండాలి మరి.
This post was last modified on February 27, 2025 12:10 pm
దసరా తర్వాత న్యాచురల్ స్టార్ నాని, దర్శకుడు శ్రీకాంత్ ఓదెల కలయికలో తెరకెక్కుతున్న ది ప్యారడైజ్ షూటింగ్ నిర్విరామంగా జరుగుతోంది.…
రాజకీయాల్లో మార్పులు జరుగుతూనే ఉంటాయి. ప్రత్యర్థులు కూడా మిత్రులుగా మారుతారు. ఇలాంటి పరిణామమే ఉమ్మడి కృష్నాజిల్లాలో కూడా చోటు చేసుకుంటోంది.…
ప్రస్తుతం ఇండియాలో తెరకెక్కుతున్న చిత్రాల్లో అత్యంత హైప్ ఉన్న వాటిలో అల్లు అర్జున్, అట్లీ సినిమా ఒకటి. ఏకంగా రూ.800…
భారీ అంచనాల మధ్య అవతార్ ఫైర్ అండ్ యాష్ విడుదలయ్యింది. ఇవాళ రిలీజులు ఎన్ని ఉన్నా థియేటర్లలో జనం నిండుగా…
మన దగ్గర అయిదు టాలీవుడ్ స్ట్రెయిట్ సినిమాలు సంక్రాంతికి తలపడుతున్నా సరే పెద్దగా టెన్షన్ వాతావరణం లేదు కానీ తమిళంలో…
గత కొన్నేళ్లుగా ప్రయోగాలు, రొటీన్ మాస్ మసాలాలతో అభిమానులే నీరసపడేలా చేసిన రవితేజ ఫైనల్ గా గేరు మార్చేశాడు. సంక్రాంతికి…