గతంలో జరిగిన కొన్ని షాకింగ్ సంఘటనలు దర్శకులు, హీరోలు వాళ్ళుగా పంచుకుంటేనే తప్ప బయట ప్రపంచానికి తెలిసి రావు. అలాంటి వాటిలో ఇదొకటి. మార్చి 7 సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు రీ రిలీజ్ కాబోతున్న సందర్భం పురస్కరించుకుని కొన్ని పాత వీడియోలు ప్రచారంలోకి వచ్చి ఫ్యాన్స్ ని ఆశ్చర్యపరుస్తున్నాయి. దర్శకుడు శ్రీకాంత్ అడ్డాల అలాంటి సీక్రెట్ ఒకటి పంచుకున్నారు. ఇద్దరు అగ్ర హీరోలతో ఒక ఫ్యామిలీ మూవీని ప్లాన్ చేశాక, కీలకమైన రేలంగి మావయ్య క్యారెక్టర్ ని అంతకంటే ఎక్కువ ఇమేజ్ ఉన్న స్టార్ అయితే బాగుంటుందనే ఉద్దేశంతో శ్రీకాంత్ నిర్మాత దిల్ రాజుగారినో కోరిక కోరారు.
అదే సూపర్ స్టార్ రజనీకాంత్ ని కలవడం. మంచికి ప్రతిరూపంగా ఉండే రేలంగి మావయ్యగా రజని అయితే బాగుంటుందని అడిగారు. శంకర్ రికమండేషన్ ద్వారా అపాయింట్ మెంట్ దొరికింది. రాఘవేంద్ర కళ్యాణ మండపంలో ఆయన్నుకలవడానికి శ్రీకాంత్ అడ్డాల చెన్నై వెళ్లిపోయారు. ముందు మేకప్ లేకుండా వచ్చిన రజని చూసి ఠక్కున గుర్తుపట్టలేదు. కొన్ని క్షణాల్లో తేరుకుని సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు ముప్పావు గంట నరేషన్ ఇచ్చారు. బాగా నచ్చేసింది. నన్నే ఎందుకు అనుకుంటున్నారని కారణాలు అడిగి తెలుసుకున్నారు. కాని ఆ టైంలో అనారోగ్యం కారణంగా చేయలేనని రజని నిస్సహాయత వ్యక్తం చేయడం అసలు క్లైమాక్స్.
తర్వాత ప్రకాష్ రాజ్ రావడం, రేలంగి మావయ్యగా జీవించడం జరిగిపోయాయి. ఒకవేళ టైం బాగుండి నిజంగానే వెంకటేష్, మహేష్ బాబులకు తండ్రిగా రజనీకాంత్ నటించి ఉంటే ఎలా ఉండేదని ఊహించుకుంటేనే మతి పోతోంది కదూ. అయితే ఇప్పుడు మనం చూసిన వెర్షన్ కాకుండా ఆయన ఇమేజ్ కు తగ్గట్టు కొన్ని మార్పులైతే చేసి ఉండేవాళ్ళు. ఏదైతేనేం తెరమీద ఒక అరుదైన ట్రిపుల్ కలయికని ఆడియన్స్ మిస్సయ్యారు. ఇదంతా అప్పుడెప్పుడో ఒక న్యూస్ ఛానల్ ఇంటర్వ్యూలో శ్రీకాంత్ అడ్డాల పంచుకున్నారు. ఇంకో పది రోజుల్లో ఇలాంటి కబుర్లు ఇంకెన్ని వస్తాయోనని అభిమానులు వెయిట్ చేస్తున్నారు.
This post was last modified on February 27, 2025 11:16 am
మన దగ్గర అయిదు టాలీవుడ్ స్ట్రెయిట్ సినిమాలు సంక్రాంతికి తలపడుతున్నా సరే పెద్దగా టెన్షన్ వాతావరణం లేదు కానీ తమిళంలో…
గత కొన్నేళ్లుగా ప్రయోగాలు, రొటీన్ మాస్ మసాలాలతో అభిమానులే నీరసపడేలా చేసిన రవితేజ ఫైనల్ గా గేరు మార్చేశాడు. సంక్రాంతికి…
కంటి ముందు కెమెరా, యూట్యూబ్ ఫాలోయర్స్ ఉంటే చాలు కొందరు ఏం మాట్లాడినా చెల్లిపోతుందని అనుకుంటున్నారు. వీళ్ళ వల్ల సోషల్…
బీఆర్ ఎస్ కీలక నాయకుడు, మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీష్‌రావు.. తన ఇంటిని తాకట్టు పెట్టారు. బ్యాంకు అధికారుల వద్దుకు…
పార్టీ పటిష్టంగా ఉండాలన్నా, ప్రజలకు పారదర్శకంగా సంక్షేమ పథకాలు అందాలన్నా ఆ పార్టీ ప్రజా ప్రతినిధులే కీలకం. రాజకీయాల్లో ఈ…
దేశంలో అత్యధిక సినీ అభిమానం ఉన్న ప్రేక్షకులుగా తెలుగు ఆడియన్సుకి పేరుంది. తెలుగు రాష్ట్రాలు రెంటినీ కలిపి ఒక యూనిట్…