గుంటూరు టాకీస్, కల్కి లాంటి సినిమాలతో ఆకట్టుకున్న యువ నటుడు సిద్ధు జొన్నలగడ్డ. ఐతే కొన్ని నెలల ముందు వరకు అతణ్ని ఒక మామూలు నటుడిగానే చూశారు. కానీ లాక్ డౌన్ టైంలో నెట్ ఫ్లిక్స్, ఆహా ఓటీటీ ఫ్లాట్ ఫామ్స్‌లో రిలీజై మంచి స్పందన రాబట్టుకున్న కృష్ణ అండ్ హిజ్ లీలతో సిద్ధులోని కొత్త కోణాలు అందరికీ తెలిశాయి. ఆ సినిమాలో హీరోగా మెప్పించడమే కాదు.. రచయితగానూ మెరిశాడు.
ఆ సినిమా మంచి విజయం సాధించడంతో సిద్ధుకు వరుసగా మంచి మంచి అవకాశాలు వస్తున్నాయి. సితార ఎంటర్టైన్మెంట్స్ లాంటి పెద్ద బేనర్లోనూ అతనో సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. అంతకంటే ముందు సిద్ధు హీరోగా చడీచప్పుడు లేకుండా సినిమా పూర్తయిపోవడం విశేషం. ఆ చిత్రమే.. మా వింత గాథ వినుమా.
ఆదిత్య మందాల అనే కొత్త దర్శకుడు రూపొందించిన చిత్రమిది. సంజయ్ రెడ్డి నిర్మించాడు. కృష్ణ అండ్ హిజ్ లీలలో సిద్ధుకు జోడీగా నటించిన సీరత్ కపూర్ ఇందులో కథానాయిక. ఈ చిత్రంలోనూ సిద్ధు రచనా సహకారం ఉండటం విశేషం. ఈ మధ్యే ఈ సినిమాను అనౌన్స్ చేయగా.. ఇంతలోనే రిలీజ్ డేట్ కూడా ఇచ్చేశారు.
నవంబరు 13న దీపావళి కానుకగా ఈ చిత్రాన్ని ఆహా ఓటీటీలో రిలీజ్ చేయబోతున్నారు. ఈ మధ్య ఒరేయ్ బుజ్జిగా, కలర్ ఫోటో.. ఇలా వరుసగా చిన్న సినిమాలను దించుతున్న ఆహా ఈ వరుసలోనే మా వింత గాథ వినుమా చిత్రాన్ని తమ ఓటీటీలో రిలీజ్ చేయబోతోంది. దీని ఫస్ట్ లుక్ పోస్టర్ చూస్తే ఫుల్ లెంగ్త్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ లాగా అనిపిస్తోంది. మరి సిద్ధు ఈసారి ప్రేక్షకులను ఎలా సర్ప్రైజ్ చేస్తాడో చూడాలి.
This post was last modified on October 25, 2020 8:21 am
ఏపీ మాజీ సీఎం వైఎస్ జగన్ చిన్నాన్న వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసు ఇంకా ఓ కొలిక్కి రాని…
పూనూరు గౌతం రెడ్డి. విజయవాడకు చెందిన వైసీపీ నాయకుడు. అయితే.. గతంలో ఆయన వంగవీటి మోహన్రంగాపై చేసిన వివాదాస్పద వ్యాఖ్యలతో…
సూర్య సినిమా ‘కంగువ’ మీద విడుదల ముంగిట ఏ స్థాయిలో అంచనాలున్నాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. వెయ్యి కోట్ల…
అసెంబ్లీ వేదికగా కూటమి పార్టీల ఎమ్మెల్యేలు, ఎంపీలు, వారి పీఏలకు, పార్టీల కార్యకర్తలకు సీఎం చంద్ర బాబు వార్నింగ్ ఇచ్చారు.…
టీడీపీ అధినేత, ఏపీ సీఎం చంద్రబాబు నేటి నుంచి మహారాష్ట్రలో రెండు పాటు పర్యటించనున్నారు. ఆయనతోపాటు డిప్యూటీ సీఎం పవన్…