ఆర్థిక నేరాలకు పాల్పడి జైలులో ఉన్న సుకేశ్ చంద్రశేఖర్ మరోసారి సంచలనంగా మారాడు. ప్రతి సారి వివాదాలతో వార్తల్లో నిలిచే అతను, ఈసారి ఏకంగా టెస్లా అధినేత ఎలాన్ మస్క్‌కు లేఖ రాయడం ఆసక్తికరంగా మారింది. మస్క్ తనకు అభిమాన వ్యక్తి అని చెబుతూ, అతని సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ ‘ఎక్స్’ (ట్విట్టర్) లో 2 బిలియన్ డాలర్ల పెట్టుబడి పెట్టడానికి సిద్ధంగా ఉన్నట్లు లేఖలో పేర్కొన్నాడు.
ప్రస్తుతం ఢిల్లీలోని మండోలి జైలులో ఉన్న సుకేశ్, ‘ఎక్స్’ తనకు చాలా ప్రియమైన సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ అని పేర్కొన్నాడు. మస్క్‌ను ‘నా మనిషి’ అంటూ సంబోధిస్తూ, అతని వ్యాపార శైలి తనకు బాగా నచ్చిందని చెప్పాడు. అంతేకాకుండా, తన కంపెనీ ఎల్ఎస్ హోల్డింగ్స్ ఇప్పటికే టెస్లా స్టాక్స్‌లో పెట్టుబడి పెట్టిందని, మంచి లాభాలు కూడా సాధించిందని వివరించాడు. ట్రంప్ ప్రభుత్వం కొత్తగా సృష్టించిన ‘డిపార్ట్‌మెంట్ ఆఫ్ గవర్నమెంట్ ఎఫిషియన్సీ’ (డీఓజీఈ)కు మస్క్ నాయకత్వం వహించడాన్ని ప్రశంసించాడు.
ఇటీవలే తన ప్రియురాలు, బాలీవుడ్ నటి జాక్వెలిన్ ఫెర్నాండెజ్ పుట్టినరోజు సందర్భంగా లేఖ రాసిన సుకేశ్, ఇప్పుడు మస్క్‌కు రాసిన లేఖలో ఆమె గురించి ప్రస్తావించటం గమనార్హం. జాక్వెలిన్ కూడా ‘ఎక్స్’ను ఎక్కువగా ఉపయోగిస్తుందని, అందుకే ఈ సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌పై మరింత ఆసక్తి పెరిగిందని తెలిపాడు. సుకేశ్ చంద్రశేఖర్ జైలు నుంచే ఇలాంటి భారీ ఆఫర్ చేయడం అందరినీ ఆశ్చర్యపరిచింది. ఇక తరచు సెటైర్స్ వేసే మస్క్ దీనిపై అసలు స్పందిస్తారా అనే విషయంలో ఉత్కంఠ పెరుగుతోంది. మొత్తానికి, మరోసారి సుకేశ్ తన లేఖతో వార్తల్లో నిలిచాడు.
This post was last modified on February 26, 2025 3:01 pm
ఏడు పదుల వయసులో రకరకాల పాత్రలు చేస్తూ తనకు తాను ఛాలెంజ్ విసురుకుంటున్న మలయాళం స్టార్ మమ్ముట్టి కొత్త సినిమా…
ఒకరికి శాపం మరొకరికి వరం అయ్యిందన్న తరహాలో అఖండ 2 వాయిదా బాలీవుడ్ మూవీ దురంధర్ కు భలే కలిసి…
బాలయ్య కెరీర్ లోనే మొదటిసారి ఇలాంటి పరిస్థితి చూస్తున్నామా అన్నట్టుగా అఖండ 2 తాలూకు పరిణామాలు ఫ్యాన్స్ ని బాగా…
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(ఏఐ)లో ఏపీ దూకుడుగా ఉందని కేంద్ర ప్రభుత్వం తెలిపింది. ఏఐ ఆధారిత ఉత్పత్తులు, వృద్ధి వంటి అంశాల్లో ఏపీ…
అధికారంలో ఉన్నాం. అయినా మాకు పనులు జరగడం లేదు. అనే వ్యాఖ్యను అనంతపురం జిల్లాకు చెందిన ఒక సీనియర్ నాయకుడు…
డాలర్లు, మంచి లైఫ్ స్టైల్ కోసం విదేశాలకు వెళ్లాలని ప్రతి ఒక్కరూ కలలు కంటారు. కానీ అక్కడ కొన్నాళ్లు గడిపాక…