Movie News

వంగ ఇంటర్వ్యూ ఇస్తే… బాలీవుడ్ షేకే

సందీప్ రెడ్డి వంగ.. ఈ పేరు చెబితే చాలు కొంతమంది బాలీవుడ్ జనాలు షేకైపోతారు. అతను తీసే సినిమాలు మాత్రమే కాదు.. తన ఇంటర్వ్యూలు సైతం బాలీవుడ్ వాళ్లకు నిద్ర పట్టనివ్వవు. తెలుగులో ‘అర్జున్ రెడ్డి’లో ప్రకంపనలు సృష్టించాక.. ఆ చిత్రాన్ని ‘కబీర్ సింగ్’గా హిందీలో రీమేక్ చేస్తే అక్కడా బ్లాక్ బస్టర్ అయింది. కానీ ఇందులో పురుషాధిక్యతను గ్లోరిఫై చేశాడని.. సమాజాన్ని తప్పుదోవ పట్టించేశాడని ఇటు బాలీవుడ్ జనాలు, అటు క్రిటిక్స్ లబోదిబోమన్నారు. బాలీవుడ్లో దీన్ని మించిన చెడు పోకడలు ఎన్నో సినిమాల్లో చూసినప్పటికీ.. ‘కబీర్ సింగ్’ను మాత్రమే టార్గెట్ చేయడం విడ్డూరం.

ఇక తన తర్వాతి చిత్రం ‘యానిమల్’ను బాలీవుడ్ ఎలా టార్గెట్ చేసిందో తెలిసిందే. లెజెండరీ లిరిసిస్ట్, రైటర్ జావెద్ అక్తర్ సహా చాలామంది ఆ సినిమాను తీవ్రంగా విమర్శించారు. ఇక క్రిిటిక్స్ సంగతైతే చెప్పాల్సిన పనే లేదు. కానీ వాళ్లందరికీ కేవలం తన సినిమా వసూళ్లతోనే కాదు.. తన ఇంటర్వ్యూలతోనూ ఘాటుగానే సమాధానం చెప్పాడు సందీప్. తన సినిమాలను తప్పుబట్టే వాళ్లకు ఇంటర్వ్యూల్లో సందీప్ వేసే ప్రశ్నలు.. చాలా గట్టిగానే తగులుతుంటాయి. వాటికి అవతలి వైపు నుంచి సమాధానమే ఉండదు. బాలీవుడ్ జనాల హిపోక్రసీని అతను భలేగా బయటపెడుతుంటాడు.

తాజాగా సందీప్.. కోమల్ నహతా అనే క్రిటిక్ కమ్ ట్రేడ్ అనలిస్ట్‌కు ఒక ఇంటర్వ్యూ ఇచ్చాడు. అది కేవలం ప్రోమోతోనే సోషల్ మీడియాలో సెన్సేషన్ క్రియేట్ చేసింది. ‘కబీర్ సింగ్’ సినిమాలో నటించాడనే ఏకైక కారణంతో ఒక పెద్ద సంస్థలో ఒక నటుడికి రోల్ ఇవ్వలేదనే విషయాన్ని సందీప్ బయటపెట్టాడు. ఆ ప్రొడక్షన్ హౌస్ కరణ్ జోహార్‌దని, అక్కడ రిజెక్షన్‌కు గురైంది సోహమ్ మజుందార్ అని సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది.

ఇక ‘యానిమల్’ సినిమా విషయంలో తనను అంతగా తప్పుబట్టిన వాళ్లందరూ.. రణబీర్‌ను మాత్రం కొనియాడడం హిపోక్రసీ కాదా అంటూ సందీప్ ప్రశ్నించాడు. ఈ రెండు అంశాలకు సంబంధించి బాలీవుడ్ జనాలకు ఆల్రెడీ సోషల్ మీడియాలో కౌంటర్లు మొదలైపోయాయి. ప్రోమోతోనే బాలీవుడ్‌ను షేక్ చేస్తున్న సందీప్.. ఫుల్ ఇంటర్వ్యూతో వాళ్లకు మరెంతగా చుక్కలు చూపిస్తాడో అనే చర్చ జరుగుతోంది.

This post was last modified on February 26, 2025 12:09 pm

Share

Recent Posts

కార్తీ రేంజు ఇంత పడిపోయిందా

యుగానికి ఒక్కడు, నా పేరు శివ, ఖైదీ, ఊపిరి లాంటి సూపర్ హిట్స్ తో కార్తీకి తెలుగులోనూ సాలిడ్ మార్కెట్…

2 hours ago

జడల్ జమానాకు ఇంకో కీలక ఛాన్స్

నైజాంలో డీసెంట్ గా నెట్టుకొస్తున్న ప్యారడైజ్ రెండో వారంలోకి అడుగు పెట్టడానికి ముందే ఆంధ్ర, సీడెడ్ సైడ్ బాగా నెమ్మదించిపోవడం…

2 hours ago

ఖైరతాబాద్ నుంచి జనసేన పోటీ

ఏ నిముషంలో దానం నాగేందర్ పార్టీ మారి ఎమ్మెల్యే పదవి కోల్పోయాడో కానీ తెలంగాణా రాజకీయాలు మరింత సందడిగా మారిపోయాయి.…

3 hours ago

రాజమౌళి చెప్పిన ఈ ఫార్ములా ఫాలో అయితే?

రాజమౌళి తన సినిమాల మేకింగ్ కోసం ఎక్కువ టైం తీసుకుంటాడన్న మాటే కానీ.. ఔట్ పుట్ మాత్రం వేరే లెవెల్లో…

3 hours ago

ఫోన్ కోసం పుట్టిన పసికందునే అమ్మేశారు

ప్రపంచీకరణ నేపథ్యంలో మానవ సంబంధాలన్ని అంగడిలో సరుకులుగా మారిపోతున్నాయి. బంధాలు, అనుబంధాలు ఖరీదైన వస్తువులుగా మారిపోయాయి. పాపాయి కంటే రూపాయికే…

4 hours ago

జూనియర్ ఇచ్చిన జోష్ సరిపోతుందా

ఎల్లుండి విడుదల కాబోతున్న 'డోంట్ ట్రబుల్ ది ట్రబుల్' ప్రమోషన్ల ఘట్టం చివరి అంకాన్ని నిన్న దిగ్విజయంగా పూర్తి చేశారు.…

4 hours ago