డిజాస్టర్లు ఏ హీరోకైనా సహజం. ఏదో అనుకుంటే ఇంకేదో జరగడం ప్రతి ఒక్కరికి అనుభవమే. కాకపోతే ఫలానా సినిమా చేయకపోతే బాగుండని ప్రేక్షకులతో అనిపించుకోవడం కొంతైనా బాధ కలిగిస్తుంది. పైగా ఈ సోషల్ మీడియా కాలంలో అది కేవలం విమర్శల దగ్గరే ఆగిపోదు. ట్రోలింగ్ అనే భూతం రూపంలో విరుచుకుపడుతుంది. అప్పటికే ఉన్న నెగటివ్ నెస్ మరికాస్త పెంచుతుంది. దీనికి చిన్నా పెద్ద తేడా ఉండదు. భోళా శంకర్, లాల్ సలామ్, రూలర్, బ్రహ్మోత్సవం, ఏజెంట్ లాంటి చాలా చిత్రాలు వీటిని రుచి చూసి ఆయా స్టార్లు మర్చిపోలేని గాయాలుగా మిగిలిపోయాయి. ఇప్పుడు విశ్వక్ వంతు వచ్చింది.
లైలా థియేటర్లో సూపర్ ఫ్లాపయ్యింది. హీరో ఓపెన్ గా సారీ లెటర్ పెట్టేశాడు. ఓటమిని ఒప్పుకున్నాడు. ఇకపై అసభ్యత లేని సినిమాలే చేస్తానని హామీ ఇచ్చాడు. ఇక్కడిదాకా బాగానే ఉంది కానీ లైలా వచ్చే వారం మార్చి 7 నుంచి అమెజాన్ ప్రైమ్ లో స్ట్రీమింగ్ కావొచ్చని సమాచారం. ఇంకా అధికారికంగా చెప్పలేదు కానీ దాదాపు ఖరారేనట. టాక్ విని థియేటర్ కు వెళ్లని వాళ్ళు ఇది విశ్వక్ మూవీ కదానే ఉద్దేశంతో ఒక లుక్ వేద్దామని ఖచ్చితంగా ప్రయత్నిస్తారు. అప్పుడు అసలైన డ్యామేజ్ ఉంటుంది. కొందరు ఒక అడుగు ముందుకేసి వీడియోలు కట్ చేసి మరీ ట్రోలింగ్ తో విరుచుకుపడతారు.
ఇదంతా ఇబ్బంది కలిగించక తప్పదు. కానీ కొంత కాలం భరించడం తప్ప వేరే ఆప్షన్ ఏముంది. తొందరపడి కథలు ఒప్పేసుకుంటే దాని పరిణామాలు ఎలా ఉంటాయో లైలా మరో ఉదాహరణగా నిలిచింది. నిన్నటి దాకా డిఫరెంట్ జానర్స్ ట్రై చేస్తూ విభిన్నమైన సబ్జెక్టులనే ఎంచుకుంటున్న విశ్వక్ సేన్ ఎందుకు టెంప్ట్ అయ్యాడో కానీ ఆడవేషం వేసి అల్లరిపాలు కావాల్సి వచ్చింది. సరే ఇదంతా ఎవరు ఆపేది కాదు కానీ ప్రస్తుతమీ యూత్ హీరో ఫంకీ మీదే దృష్టి పెడుతున్నాడు. కెవి అనుదీప్ దర్శకత్వంలో సితార ఎంటర్ టైన్మెంట్స్ నిర్మిస్తున్న ఈ ఫన్ మూవీలో చాలా క్లీన్ కామెడీ ఉంటుందని ఇన్ సైడ్ టాక్.
This post was last modified on February 25, 2025 5:06 pm
టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, మంత్రి నారా లోకేష్ వైసీపీ నేతలను ఉద్దేశించి సంచలన వ్యాఖ్యలు చేశారు. ``అన్నీ గుర్తుంచుకున్నా.…
దసరా తర్వాత న్యాచురల్ స్టార్ నాని, దర్శకుడు శ్రీకాంత్ ఓదెల కలయికలో తెరకెక్కుతున్న ది ప్యారడైజ్ షూటింగ్ నిర్విరామంగా జరుగుతోంది.…
రాజకీయాల్లో మార్పులు జరుగుతూనే ఉంటాయి. ప్రత్యర్థులు కూడా మిత్రులుగా మారుతారు. ఇలాంటి పరిణామమే ఉమ్మడి కృష్నాజిల్లాలో కూడా చోటు చేసుకుంటోంది.…
ప్రస్తుతం ఇండియాలో తెరకెక్కుతున్న చిత్రాల్లో అత్యంత హైప్ ఉన్న వాటిలో అల్లు అర్జున్, అట్లీ సినిమా ఒకటి. ఏకంగా రూ.800…
భారీ అంచనాల మధ్య అవతార్ ఫైర్ అండ్ యాష్ విడుదలయ్యింది. ఇవాళ రిలీజులు ఎన్ని ఉన్నా థియేటర్లలో జనం నిండుగా…
మన దగ్గర అయిదు టాలీవుడ్ స్ట్రెయిట్ సినిమాలు సంక్రాంతికి తలపడుతున్నా సరే పెద్దగా టెన్షన్ వాతావరణం లేదు కానీ తమిళంలో…