టాలీవుడ్లో ఒక హీరోయిన్ వరుసగా రెండు మూడు హిట్లు కొట్టిందంటే ఆమె రేంజే మారిపోతుంది. పెద్ద హీరోల సరసన అవకాశాలు వచ్చి పడిపోతాయి. రష్మిక మందన్నా సైతం ఇలాగే టాలీవుడ్లో శుభారంభం చేసి పెద్ద రేంజికి వెళ్లిపోయింది. ‘ఛలో’ లాంటి చిన్న సినిమాతో పరిచయం అయినప్పటికీ చాలా త్వరగా ఆమె స్టార్ హీరోయిన్ అయిపోయింది.
విజయ్ దేవరకొండతో రష్మిక చేసిన ‘గీత గోవిందం’ బ్లాక్ బస్టర్ కావడంతో ఆమెకు భారీ సినిమాల్లో అవకాశాలు వచ్చాయి. మహేష్ బాబు సరసన ‘సరిలేరు నీకెవ్వరు’లో నటించిన ఆమె.. అల్లు అర్జున్‌కు జోడీగా ‘పుష్ప’లోనూ నటిస్తున్న సంగతి తెలిసిందే. ఇక రష్మిక వరుసగా ఆ రేంజ్ హీరోలతోనే చేస్తుందని అంతా అనుకున్నారు. కానీ ఆమె మీడియం రేంజ్ సినిమాల్లోనూ నటించడానికి రెడీగా ఉండటం విశేషమే.
‘సరిలేరు..’ చేస్తున్న సమయంలోనే నితిన్ సరసన ‘భీష్మ’లో నటించిన రష్మిక.. బన్నీతో ‘పుష్ప’కు రెడీ అవుతున్న సమయంలోనే మరో మీడియం రేంజ్ సినిమాకు ఓకే చెప్పింది. ఆమె శర్వానంద్ సరసన ఓ సినిమాలో నటించబోతోంది. ‘నేను శైలజ’ ఫేమ్ కిషోర్ తిరుమల ఈ చిత్రానికి దర్శకత్వం వహించనున్నాడు. దసరా రోజున ఈ సినిమా ప్రారంభోత్సవం జరుపుకోనుంది. ఇంతకుముందు వెంకటేష్‌తో కిషోర్ చేయాలనుకున్న ‘ఆడాళ్లూ మీకు జోహార్లు’ సినిమానే శర్వాతో చేయబోతున్నట్లుగా ప్రచారం జరుగుతోంది. ఇదెంత వరకు నిజమో చూడాలి.
‘పడి పడి లేచె మనసు’ చిత్ర నిర్మాత సుధాకర్ చెరుకూరి శ్రీ వేంకటేశ్వర సినిమాస్ బేనర్ మీద ఈ చిత్రాన్ని నిర్మించనున్నారు. ఒకప్పుడు వరుస హిట్లతో జోరుమీదున్న శర్వాకు ఈ మధ్య బ్యాడ్ టైం నడుస్తోంది. ప్రస్తుతం అతను ‘శ్రీకారం’ అనే సినిమా చేస్తున్నాడు. ‘మహాసముద్రం’ సినిమాకు కమిటయ్యాడు. దాంతో పాటే ‘ఆడాళ్లూ మీకు జోహార్లు’లోనూ నటించనున్నాడు. ఈ టైటిల్‌ను బట్టి చూస్తే సినిమాలో రష్మిక పాత్రకు బాగానే ప్రాధాన్యం ఉండేలా కనిపిస్తోంది.
This post was last modified on October 24, 2020 3:37 pm
https://www.youtube.com/watch?v=V0ARlFc_ndE సంక్రాంతి పందెం కోళ్ళలో మొదటిది గేమ్ ఛేంజర్ ప్రేక్షకుల ముందుకు వచ్చేసింది. తుది తీర్పు ఏంటనేది తేలడానికి ఇంకొంచెం…
బ్రాండ్ ఏపీ ప్రారంభమైందని సీఎం చంద్రబాబు తెలిపారు. వైసీపీ విధ్వంసంతో అతలాకుతలమైన రాష్ట్రాన్ని అన్ని విధాలా బాగు చేస్తున్నామని చెప్పారు.…
తిరుమల తొక్కిసలాట ఘటనపై శుక్రవారం సాయంత్రం టీటీడీ అత్యవసరంగా భేటీ అయి సమీక్షించింది. ఈ సమావేశంలో భాగంగా మృతుల కుటుంబాలకు…
ఏపీలోని కూటమి సర్కారు సంక్రాంతి సంబరాల ముంగిట ఓ కీలక నిర్ణయం తీసుకుంది. గత వైసీపీ పాలనలో రాష్ట్రంలోని దాదాపుగా…
ఇప్పుడంటే సోషల్ మీడియా ఓ రేంజిలో ప్రతాపం చూపుతోంది. చేతిలో స్మార్ట్ ఫోన్ ఉన్న ప్రతి వ్యక్తి తాను కూడా…
ఏపీలో ఇప్పుడు కామేపల్లి తులసి బాబుపై హాట్ హాట్ చర్చ నడుస్తోంది. వైసీపీ అదికారంలో ఉండగా… సీఐడీ ఛీఫ్ గా…