ఎప్పుడు ఏ సినిమా ఎవరికి ఎలా కనెక్ట్ అవుతుందో ఊహించలేం. ఓటీటీల పుణ్యమా అని ప్రాంతం, భాషల మధ్య అంతరాలు చెరిగిపోయాయి. ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకులు ఎక్కడెక్కడి సినిమాలు, సిరీస్‌లనో చూసి ఆస్వాదిస్తున్నారు. మన సినిమాలకు కూడా రీచ్ బాగా పెరుగుతోంది. ‘ఆర్ఆర్ఆర్’ సినిమాను హాలీవుడ్ ప్రేక్షకులు చూసి వెర్రెత్తిపోయారు. ఇటీవల ‘పుష్ప-2’ సైతం అలాంటి స్పందనే తెచ్చుకుంది. ఐతే మన సినిమాలు మలయాళంలో స్పందన తెచ్చుకోవడం అరుదు. అక్కడ బాగా ఆడతాయని పేరున్నది అల్లు అర్జున్ మూవీస్‌కే.
‘హ్యాపి’తో మొదలు.. చాలా బన్నీ సినిమాలు కేరళలో థియేటర్లలో బాగా ఆడాయి. డిజిటల్‌గానూ మంచి స్పందన తెచ్చుకున్నాయి. ఐతే ఎంతో హైప్ తెచ్చుకున్న బన్నీ చివరి చిత్రం ‘పుష్ప-2’ మాత్రం మలయాళంలో ఫ్లాప్ అయింది. ఓటీటీలో కూడా పెద్దగా స్పందన కనిపించలేదు. ఐతే మలయాళంలో ఇప్పటిదాకా అంతగా గుర్తింపు లేని నందమూరి బాలకృష్ణ.. ఇప్పుడు ‘డాకు మహారాజ్’ మూవీతో అక్కడి ప్రేక్షకులను కట్టి పడేస్తున్నాడు. నాలుగు రోజుల కిందటే నెట్ ఫ్లిక్స్ ద్వారా స్ట్రీమింగ్‌కు వచ్చిన ‘డాకు మహారాజ్’ను ఎగబడి చూస్తున్న వాళ్లలో మలయాళీలు ముందు వరుసలో ఉన్నారు.
థియేటర్లతో పోలిస్తే డిజిటల్ రిలీజ్‌లో ఈ సినిమాకు స్పందన చాలా బాగుంది. సర్వత్రా ప్రశంసలు కురుస్తున్నాయి. ఇంకా పెద్ద హిట్ కావాల్సిన సినిమా అని అభిప్రాయపడుతున్నారు. ఐతే పర్టికులర్‌గా మలయాళీలు ఈ సినిమా చూసి వెర్రెత్తిపోతున్నట్లు సోషల్ మీడియా ట్రెండ్స్ చూస్తే అర్థమవుతోంది. వేలమంది మలయాళ నెటిజన్లు ఈ సినిమా గురించి పోస్టులు పెడుతున్నారు. ఈ సినిమాలో ఎలివేషన్ సీన్లు.. విజువల్స్.. మ్యూజిక్.. బాలయ్య పెర్ఫామెన్స్.. డైరెక్షన్ గురించి మాట్లాడుతున్నారు. బాలయ్యలో ఇంత పవర్ ఉందని తమకు తెలియదని కామెంట్లు చేస్తుండడం విశేషం. ఎక్కువగా క్లాస్ సినిమాలను ఇష్టపడే మలయాళీస్.. బాలయ్య నటించిన ఓ మాస్ మూవీ చూసి ఇలా స్పందించడం అరుదైన విషయమే.
This post was last modified on February 24, 2025 5:00 pm
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తెలుగులో ఎన్నో విజయవంతమైన చిత్రాలు వచ్చాయి. తొలినాళ్లలో తీసిన చాలా సినిమాలు బ్లాక్ బస్టర్…
ప్రపంచమంతా ఉత్కంఠగా ఎదురుచూస్తున్న సమావేశం ఢిల్లీలోని హైదరాబాద్ హౌస్లో జరిగింది. రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్, భారత ప్రధాని నరేంద్ర…
`సారీ మైలార్డ్.. ఇకపై అలాంటి తప్పులు జరగవు`` - అని తెలంగాణ హైకోర్టుకు హైడ్రా కమిషనర్, ఐపీఎస్ అధికారి రంగనాథ్…
పార్వతీపురం మన్యం జిల్లాలో నిర్వహించిన మెగా పేరెంట్ టీచర్ మీటింగ్ లో సీఎం చంద్రబాబు, మంత్రి లోకేష్ పాల్గొన్నారు. ఈ…
నందమూరి బాలకృష్ణ, బోయపాటి శ్రీనుల బ్లాక్ బస్టర్ కాంబినేషన్లో తెరకెక్కిన సినిమా.. అఖండ-2. అంతా అనుకున్నట్లు జరిగితే.. ఈపాటికి ఈ…
సినీ రంగంలో మహిళలకు లైంగిక వేధింపులు ఎదురవడం గురించి దశాబ్దాలుగా ఎన్నో అనుభవాలు వింటూనే ఉన్నాం. ఐతే ఒకప్పటితో పోలిస్తే…