గౌతమిపుత్ర శాతకర్ణి, మణికర్ణిక లాంటి పీరియడ్ వార్ డ్రామాలనే క్రిష్ చాలా వేగంగా పూర్తి చేసాడు. మామూలుగా అలాంటి సినిమాలు తీయడానికి రాజమౌళి లాంటి దర్శకులైతే మూడు, నాలుగేళ్లకు పైగా, వేరే దర్శకులయితే కనీసం ఏడాదిన్నర సమయం తీసుకుంటూ వుంటారు. కానీ క్రిష్ వర్కింగ్ స్టయిల్ చాలా డిఫరెంట్‍గా వుంటుంది. ఏమి చేయాలనేది ముందే షాట్ టు షాట్ ప్లాన్ చేసేసుకుని, రోజుకి ఎంత భాగం షూట్ చేయాలనేది కూడా ఖచ్చితంగా అనుకుని సెట్స్ మీదకు వెళతాడు. అందుకే ఎంతటి భారీ చిత్రమయినా కానీ క్రిష్ దర్శకత్వంలో ఇట్టే పూర్తయిపోతుంది.
అంతటి భారీ చిత్రాలనే అంత తక్కువ టైమ్‍లో తీసేసే క్రిష్ ఇక ఒక మామూలు చిన్న సినిమాకు ఎక్కువ సమయం ఎందుకు కేటాయిస్తాడు? వైష్ణవ్ తేజ్, రకుల్ ప్రీత్‍తో క్రిష్ రూపొందిస్తోన్న చిత్రం కోసం కేవలం ముప్పయ్ అయిదు రోజుల వర్కింగ్ డేస్ పెట్టుకున్నారు. అంత త్వరగా చిత్రీకరించడం, అది కూడా కరోనా కోరలు చాస్తోన్న సమయంలో పూర్తి చేయడం జరిగేది కాదని భావించారు. కానీ క్రిష్ అనుకున్నట్టుగా ముప్పయ్ అయిదు రోజుల్లో షూటింగ్ పనులు పూర్తి చేసేసాడు. ఇక పోస్ట్ ప్రొడక్షన్, గ్రాఫిక్స్ పనులు మాత్రం బ్యాలెన్స్ వున్నాయి. వాటిని కూడా పూర్తి చేసేసి థియేటర్లు మామూలుగా రన్ అయ్యే టైమ్‍కి రిలీజ్ ప్లాన్ చేసేసుకోవచ్చునట.
This post was last modified on October 24, 2020 2:35 pm
ఏపీ మాజీ సీఎం వైఎస్ జగన్ చిన్నాన్న వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసు ఇంకా ఓ కొలిక్కి రాని…
పూనూరు గౌతం రెడ్డి. విజయవాడకు చెందిన వైసీపీ నాయకుడు. అయితే.. గతంలో ఆయన వంగవీటి మోహన్‌రంగాపై చేసిన వివాదాస్పద వ్యాఖ్యలతో…
సూర్య సినిమా ‘కంగువ’ మీద విడుదల ముంగిట ఏ స్థాయిలో అంచనాలున్నాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. వెయ్యి కోట్ల…
అసెంబ్లీ వేదికగా కూటమి పార్టీల ఎమ్మెల్యేలు, ఎంపీలు, వారి పీఏలకు, పార్టీల కార్యకర్తలకు సీఎం చంద్ర బాబు వార్నింగ్ ఇచ్చారు.…
టీడీపీ అధినేత, ఏపీ సీఎం చంద్రబాబు నేటి నుంచి మహారాష్ట్రలో రెండు పాటు పర్యటించనున్నారు. ఆయనతోపాటు డిప్యూటీ సీఎం పవన్…