సహజంగా సౌత్ హీరోలకు ఉండాల్సిన అందం పెద్దగా లేకపోయినా అచ్చమైన మాస్ యూత్ లా కనిపించే ప్రదీప్ రంగనాథన్ కు డ్రాగన్ రూపంలో మరో హిట్టు దొరికేసింది. తెలుగులో పర్వాలేదనిపించుకుంటున్నా తమిళంలో మాత్రం భారీ వసూళ్లతో దూసుకుపోతోంది. ధనుష్ డైరెక్ట్ చేసిన జాబిలమ్మ నీకు అంత కోపమాని పూర్తిగా సైడ్ చేసి ఆధిపత్యం చెలాయిస్తోంది. లవ్ టుడేని దాటే సూచనలు ఉన్నాయంటూ కోలీవుడ్ ట్రేడ్ అంచనా వేస్తోంది. నిన్న తమిళనాడు మెయిన్ సెంటర్స్ అన్నింటిలో అధిక శాతం హౌస్ ఫుల్స్ పడ్డాయి. ఏపీ, తెలంగాణలో చావా తర్వాత వీకెండ్ డామినేషన్ రిటర్న్ అఫ్ ది డ్రాగన్ దే.
అభిమానులు ఇతన్ని జూనియర్ ధనుష్ గా పిలుచుకుంటున్నారు. ఇప్పటిదాకా తను రెండు సినిమాలు డైరెక్ట్ చేశాడు. రవి మోహన్ తో తీసిన కోమలి కమర్షియల్ గానూ సక్సెసయ్యింది. ఆ తర్వాత ప్రదీప్ తనే హీరోగా నటిస్తూ దర్శకత్వం వహించిన లవ్ టుడే ఏకంగా బ్లాక్బ్ బస్టర్ కొట్టింది. ఇప్పుడు హీరోగా అశ్వత్ మారిముత్తు దర్శకత్వంలో డ్రాగన్ రూపంలో ఇంకో విజయం అందుకున్నాడు. దెబ్బకు నిర్మాణంలో ఉన్న లవ్ ఇన్సురెన్స్ కార్పొరేషన్ కు క్రేజీ బిజినెస్ ఆఫర్లు వస్తున్నాయట. ఉప్పెన ఫేమ్ కృతి శెట్టి హీరోయిన్ గా నటిస్తున్న ఈ లవ్ డ్రామాకు నయనతార భర్త విగ్నేష్ శివన్ దర్శకత్వం వహిస్తున్న సంగతి తెలిసిందే.
మొత్తానికి విజయ్ సేతుపతి, ధనుష్ దారిలో వెళ్తున్న ప్రదీప్ రంగనాథన్ క్రమంగా హీరోగా సెటిలైపోయేలా ఉన్నాడు. దర్శకత్వం విడిచిపెట్టనని చెబుతున్నప్పటికీ ఆఫర్లు తనను ఉక్కికిరి బిక్కిరి చేస్తున్నాయి. అధిక శాతం యువత తమలో అతన్ని చూసుకుంటూ కనెక్ట్ అయిపోతున్నారు. ప్రమోషన్ల కోసం తెలుగు నేర్చుకుని వచ్చి మరీ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో మాట్లాడిన ఇతని కమిట్ మెంట్ గురించి ప్రత్యేకంగా చెప్పాలా. లవ్ టుడే వరల్డ్ వైడ్ కలెక్షన్స్ ని డ్రాగన్ రెండో వారం లోపే దాటేస్తుందని ఒక అంచనా. దగ్గర్లో ఎలాంటి పోటీ లేకపోవడం ప్లస్ అయ్యేలా ఉంది. ముఖ్యంగా ఈ ఆదివారం టాప్ ప్లేస్ దీనిదే.
This post was last modified on February 23, 2025 11:15 am
టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఏపీ మంత్రి నారా లోకేశ్ మాట ఇచ్చారంటే.. అది క్షణాల్లో అమలు కావాల్సిందే. ఇదేదో……
ఓ వైపేమో టీడీపీ అధినేత, ఏపీ సీఎం నారా చంద్రబాబునాయుడు అధికారంలో ఉంటే… విపక్షాలు సైతం తమ కార్యక్రమాలను ఘనంగా…
టీడీపీకి మహానాడు అనేది ప్రాణ ప్రదం. ఈ విషయంలో ఎలాంటి తేడా లేదు. పార్టీ ఆవిర్భావం నుంచి ఇప్పటి వరకు…
ఈ రోజుల్లో స్టార్ హీరోల పక్కన సరైన హీరోయిన్లను సెట్ చేయడమే కష్టమవుతోంది. మన దగ్గర బోలెడంతమంది హీరోలున్నారు. కానీ…
టీడీపీ అధినేత, ఏపీ సీఎం నారా చంద్రబాబునాయుడు ఈ నెల 18న (మంగళవారం) దేశ రాజధాని ఢిల్లీ పర్యటనకు వెళ్లనున్నారు.…
ఏపీ మహిళలకు రాష్ట్రంలోని కూటమి సర్కారు ఓ అదిరిపోయే బహుమానాన్ని అందించింది. రాష్ట్రంలోని డ్వాక్రా మహిళలు పండించిన వ్యవసాయ, వ్యవసాయేతర…