నిన్న రెండు డబ్బింగ్ సినిమాలు విడుదలయ్యాయి. మొదటిది రిటర్న్ అఫ్ ది డ్రాగన్. లవ్ టుడేతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరైన తమిళ హీరో ప్రదీప్ రంగనాథన్ ఈసారి కూడా యూత్ ఎంటర్ టైనర్ తోనే వచ్చాడు. ఇంజనీరింగ్ చదువు అబ్బక, ప్రేమించిన అమ్మాయి దూరమై, ఫేక్ సర్టిఫికెట్ తో ఉద్యోగం తెచ్చుకుంటే ఏమవుతుందనే పాయింట్ మీద దర్శకుడు అశ్వత్ మారిముత్తు వేసుకున్న ట్రీట్ మెంట్ టైం పాస్ అయితే చేయించింది కానీ దీనికంటూ బలాలతో పాటు బలహీనతలూ ఉన్నాయి. కాకపోతే ఫక్తు యూత్ నే టార్గెట్ చేసుకున్నారు కాబట్టి వాళ్ళను సంతృప్తి పరచడంలో టీమ్ ఓ మోస్తరుగా సక్సెసయ్యిందని చెప్పాలి.
జాబిలమ్మ నీకు అంత కోపమా విషయానికి వస్తే దర్శకుడు ధనుష్ తీసుకున్న కథలో ఎలాంటి కొత్తదనం లేకపోయినా ట్రీట్ మెంట్, ఎంటర్ టైన్మెంట్ రెండూ కుర్రకారుకు కనెక్ట్ అయ్యేలా ఉండటంతో మరీ విసుగు రాకుండా చూసుకున్నాడు. అమ్మాయి అబ్బాయి ప్రేమ కథ, ఇద్దరి మధ్య బ్రేకప్, తిరిగి కలుసుకునేలా పరిస్థితులు ఏర్పడటం ఇదంతా ఒక ఫార్ములా ప్రకారం సాగిపోతుంది. గత ఏడాది వచ్చిన మలయాళం సూపర్ హిట్ ప్రేమలు అంత ఫ్రెష్ గా అనిపించకపోయినా మరీ చికాకు పుట్టించేలా లేకపోవడం జాబిలమ్మని సేవ్ చేసింది. ప్రేమికులు ఎంజాయ్ చేయొచ్చేమో కానీ ఫ్యామిలీస్ కి అంతగా ఎక్కక పోవచ్చు.
ఇక పైచేయి ఎవరిదనే విషయానికి వస్తే ప్రదీప్ డామినేషన్ స్పష్టంగా కనిపిస్తోంది. ముఖ్యంగా బుక్ మై షో అమ్మకాల్లో రెండింటి మధ్య యాభై శాతానికి పైగానే వ్యత్యాసం ఉంది. డ్రాగన్ లో ఉన్న మాస్ స్టూడెంట్ అప్పీల్ ఎక్కువగా వసూళ్లను తెస్తుండగా జాబిలమ్మలో ఉన్న సాఫ్ట్ టోన్ వెనుకబడేలా చేస్తోంది. ఇదింకా రెండో రోజే కనక వీకెండ్ అయ్యాక పూర్తి క్లారిటీ వస్తుంది. తెలుగు వర్షన్ల వరకు చూసుకుంటే ఓపెనింగ్స్ పరంగా డీసెంట్ గా మొదలయ్యాయి కానీ ఏది స్ట్రాంగ్ గా నిలబడుతుందనేది వేచి చూడాలి. యునానిమస్ కాకపోయినా డ్రాగన్ ఆధిపత్యం మన దగ్గరా ఉంది. హిట్టేమో కానీ మనదగ్గర రెండింటికీ బ్లాక్ బస్టర్ అయ్యే ఛాన్స్ లేనట్టే.
This post was last modified on February 22, 2025 11:53 am
అమెరికా వీసా (H-1B, H-4) కోసం అప్లై చేసేవారికి కొత్త టెన్షన్ మొదలైంది. ఇకపై ఇంటర్వ్యూకి వెళ్లేముందు సర్టిఫికెట్లు సరిచూసుకోవడమే…
దేశ ఆర్థిక వ్యవస్థలో ఒక ఆసక్తికరమైన పరిణామం చోటుచేసుకుంది. ఒకపక్క రూపాయి విలువ డాలర్తో పోలిస్తే 90 దాటి పాతాళానికి…
కూటమిలో మూడు పార్టీలు.. విభిన్నమైన భావజాలం.. అయినా ఏకతాటిపై నడుస్తున్నాయి. దానికి కారణం రాష్ట్రం బాగుండాలనే సదుద్దేశమే అని పార్టీల…
రివ్యూస్, పబ్లిక్ టాక్ బాగున్నప్పటికీ ఆశించిన స్థాయిలో వసూళ్లు రాబట్టలేకపోయిన ఆంధ్రకింగ్ తాలూకా రెండో వారం నుంచి పికప్ ఆశిస్తున్నామని…
బహుశా బాలకృష్ణ కెరీర్ లోనే ఇది మొదటిసారని చెప్పొచ్చు. ఇంకో రెండు మూడు గంటల్లో షోలు ప్రారంభమవుతాయని అభిమానులు ఎదురు…
నిర్మాతలకు వచ్చే ఆర్థిక చిక్కులు పెద్ద రిలీజులను ఎంత ఇబ్బంది పెడతాయో అఖండ 2 విషయంలో చూస్తున్నాం. అయితే ఇలాంటి…