జూనియర్ ఎన్టీఆర్ అభిమానులు ఎప్పుడెప్పుడాని ఎదురు చూసిన ప్రశాంత్ నీల్ ప్యాన్ ఇండియా మూవీ షూటింగ్ నిన్న మొదలైపోయింది. మూడు వేల జూనియర్ ఆర్టిస్టులతో కీలక ఘట్టం షూట్ చేశారు. తారక్ లేకపోయినా ఒక ముఖ్యమైన ఎపిసోడ్ తాలూకు లీడ్ గా దీని గురించి చెబుతున్నారు. ఇది కాసేపు పక్కనపెడితే అసలు నీల్ ఏ బ్యాక్ డ్రాప్ తో ఈ సినిమా రూపొందిస్తున్నాడనే సస్పెన్స్ అందరిలోనూ ఉంది. దీనికి సంబంధించిన కొన్ని ఇంటరెస్టింగ్ లీక్స్ అంచనాలు ఎక్కడికో తీసుకెళ్లేలా ఉన్నాయి. ఇన్ సైడ్ టాక్ ప్రకారం కథా నేపధ్యం గోల్డెన్ ట్రయాంగిల్ అంటే స్వర్ణ త్రిభుజం చుట్టూ తిరుగుతుంది.
ఈశాన్య మయన్మార్, వాయువ్య థాయ్ లాండ్, ఉత్తర లావోస్ లను కలుపుతూ ఏర్పడిన అతి పెద్ద కొండ ప్రాంతమే గోల్డెన్ ట్రయాంగిల్. ఒకప్పుడు అంటే 1950 ప్రాంతంలో నల్ల మందు తయారీకి ప్రసిద్ధి చెందింది. ప్రపంచంలోకెల్లా అత్యధిక ఉత్పత్తి ఇక్కడే జరిగేది. ప్రమాదకరమైన డ్రగ్ హెరాయిన్ సైతం పండేది. పది పదిహేను సంవత్సరాల క్రితం వరకు మాఫియా సామ్రాజ్యాలకు ఇది అడ్డాగా నిలిచింది. ఇండియాకు సరఫరా అయ్యేది. 1970 సమయంలో ఈ దందా వందల వేల కోట్ల వ్యాపారానికి దారి తీసినప్పుడు ఏర్పడిన విపరీత పరిస్థితులను ఆధారం చేసుకుని వాటి మధ్య పుట్టిన నాయకుడిగా తారక్ పాత్రను డిజైన్ చేశారట.
అంటే కెజిఎఫ్, సలార్ లని మించి డార్క్ వరల్డ్ ని ఎన్టీఆర్ నీల్ సినిమాలో చూడబోతున్నాం. నిన్న వదిలిన ఫోటోలో పాత అంబాసడర్ కార్లు, సైకిళ్ళు పైన చెప్పిన దానికి మ్యాచ్ అవుతుండటాన్ని లింక్ చేసుకోవచ్చు. నల్లమందు, హెరాయిన్, ఓపియుమ్ ఈ మూడు మాదకద్రవ్యాల బిజినెస్ ని సమూలంగా నాశనం చేసి తనవాళ్లను కాపాడుకునే లీడర్ గా జూనియర్ విశ్వరూపం చూడొచ్చట. నిర్ధారణగా ఇదంతా చెప్పలేం కానీ లీకైన సోర్స్ ప్రకారం ఇది కేవలం శాంపిల్ మాత్రమే. ఎలివేషన్లతో గూస్ బంప్స్ తెప్పించడంలో నేర్పరి అయిన ప్రశాంత్ నీల్ ఏ స్థాయిలో యంగ్ టైగర్ ని ప్రెజెంట్ చేస్తాడో ఊహించుకోవడం కష్టమే.
This post was last modified on February 21, 2025 2:05 pm
సంక్రాంతి సినిమాల హడావుడి మరో లెవెల్ కు చేరుకుంది. ఇప్పటికే రాజాసాబ్ థియేటర్లలో సందడి చేస్తుండగా రేపు మెగాస్టార్ చిరంజీవి…
ఒకప్పుడు సౌత్ ఇండియన్ టాప్ హీరోయిన్లలో ఒకరిగా ఒక వెలుగు వెలిగింది సమంత. ఇటు తెలుగులో, అటు తమిళంలో అగ్ర…
రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పడి 19 నెలలు అయిన నేపథ్యంలో, అన్ని వర్గాల ప్రజల సంతృప్తిపై మరోసారి ప్రభుత్వం ఐవీఆర్ఎస్…
ప్రముఖ ప్రకృతి వైద్య నిపుణులు మంతెన సత్యనారాయణ రాజు గారు సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్‌గా ఉంటూ ఆరోగ్య సూత్రాలు…
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్‌కు వరుసగా లభిస్తున్న గౌరవాలు ఆయన వ్యక్తిత్వానికి మరో కొత్త కోణాన్ని ఆవిష్కరిస్తున్నాయి. భారతీయ సంస్కృతి,…
మెగాస్టార్ చిరంజీవి.. పోస్టర్ మీద ఈ పేరు చూస్తే చాలు.. కళ్లు మూసుకుని థియేటర్లకు వెళ్లిపోయేవాళ్లు ఒకప్పుడు. ఆయన ఫ్లాప్…