Movie News

అఖండ-2… ఫేసాఫ్ పేలిపోతుందా??

ప్రతినాయకుడి పాత్ర, అందులో నటించే నటులను బట్టి హీరో పాత్ర, అందులో నటించే స్టార్ కూడా ఎలివేట్ అవుతాడనడంలో సందేహం లేదు. టాలీవుడ్లో బిగ్గెస్ట్ మాస్ హీరోల్లో ఒకడైన నందమూరి బాలకృష్ణకు అవతల ఒక పవర్ ఫుల్ విలన్ ఉంటే.. ఆ ఫేసాఫ్ ఎలా పండుతుందో చాలా సినిమాల్లో చూశాం. ‘లెజెండ్’ సినిమాలో బాలయ్యకు ఎదురుగా జగపతిబాబు ఉండడం వల్ల ఆ సినిమా లెవెల్ మారిపోయింది. ఆయన చివరి చిత్రాలు డాకు మహారాజ్, భగవంత్ కేసరి, వీరసింహారెడ్డిల్లో కూడా బాలయ్యకు దీటుగా బాబీ డియోల్, అర్జున్ రాంపాల్, దునియా విజయ్‌ల రూపంలో బలమైన విలన్లే కుదిరారు.

ఇప్పుడు వీరిని మించిన విలన్.. బాలయ్యను ఢీకొట్టబోతున్నట్లుగా వార్తలు వస్తున్నాయి. బాలయ్య నటిస్తున్న కొత్త చిత్రం ‘అఖండ-2’ మీద ఏ స్థాయిలో అంచనాలున్నాయో కొత్తగా చెప్పాల్సిన పని లేదు. ఈ అంచనాలను ఇంకా పెంచేలా ఇందులో బాలీవుడ్ సీనియర్ నటుడు సంజయ్ దత్ నటించబోతున్నట్లు జోరుగా ప్రచారం జరుగుతోంది. సంజయ్ దత్ ప్రతినాయక పాత్రలను అద్భుతంగా పండించగలడని కొత్తగా చెప్పాల్సిన పని లేదు. ఈ మధ్య ఆయన తరచుగా దక్షిణాది చిత్రాల్లో నటిస్తున్నాడు. ‘కేజీఎఫ్-2’ సినిమాకు ఆయన విలనీ హైలైట్ అయింది. డబుల్ ఇస్మార్ట్ లాంటి సినిమాలు సరిగా ఆడకపోయినా.. సంజు మాత్రం తన పాత్రలకు న్యాయం చేశాడు.ఆ సినిమాకు క్రేజ్ తీసుకొచ్చాడు.

ఇప్పుడు ‘అఖండ-2’లో ఆయన విలన్ పాత్రకు అంగీకారం తెలిపినట్లు తెలుస్తోంది. అసలే బాలయ్యకు విలన్‌గా, పైగా అఖండ-2లో అంటే వీరి ఫేసాఫ్ మీద ప్రేక్షకుల్లో అమితాసక్తి ఉంటుందనడంలో సందేహం లేదు. ‘అఖండ’ తెలుగులో మాత్రమే రిలీజైనప్పటికీ.. పాన్ ఇండియా స్థాయిలో ప్రేక్షకులు దానిపై ఆసక్తి ప్రదర్శించారు. ఈ కథాంశం జాతీయ స్థాయిలో ప్రేక్షకుల దృష్టిని ఆకర్షించేదే. దీంతో ‘అఖండ-2’ను పాన్ ఇండియా స్థాయిలో తెరకెక్కిస్తున్నారు. ఇందులో మహా కుంభమేళాకు సంబంధించిన అంశాలు కూడా ఉన్నాయి. ఇప్పుడు సంజయ్ కూడా యాడ్ అయినట్లు వార్తలొస్తున్న నేపథ్యంలో రిలీజ్ టైంకి ‘అఖండ-2’పై హైప్ వేరే లెవెల్లో ఉంటుందనడంలో సందహం లేదు.

This post was last modified on February 20, 2025 6:13 pm

Share
Show comments
Published by
Kumar

Recent Posts

హై కోర్టుకు సారీ చెప్పిన హైడ్రా, ఏం జరిగింది?

`సారీ మైలార్డ్‌.. ఇక‌పై అలాంటి త‌ప్పులు జ‌ర‌గ‌వు`` - అని తెలంగాణ హైకోర్టుకు హైడ్రా క‌మిష‌న‌ర్‌, ఐపీఎస్ అధికారి రంగ‌నాథ్…

4 minutes ago

నా పేరెంట్స్ మీటింగ్ కోసం మా నాన్న ఎప్పుడూ రాలేదు – లోకేష్

పార్వతీపురం మన్యం జిల్లాలో నిర్వహించిన మెగా పేరెంట్ టీచర్ మీటింగ్ లో సీఎం చంద్రబాబు, మంత్రి లోకేష్ పాల్గొన్నారు. ఈ…

15 minutes ago

అఖండ అనుభవం.. అలెర్ట్ అవ్వాలి

నందమూరి బాలకృష్ణ, బోయపాటి శ్రీనుల బ్లాక్ బస్టర్ కాంబినేషన్లో తెరకెక్కిన సినిమా.. అఖండ-2. అంతా అనుకున్నట్లు జరిగితే.. ఈపాటికి ఈ…

1 hour ago

ఐదుగురికి కమిట్మెంట్ అడిగారు.. నో చెప్పా

సినీ రంగంలో మహిళలకు లైంగిక వేధింపులు ఎదురవడం గురించి దశాబ్దాలుగా ఎన్నో అనుభవాలు వింటూనే ఉన్నాం. ఐతే ఒకప్పటితో పోలిస్తే…

1 hour ago

నందమూరి ఫ్యాన్స్ బాధ వర్ణనాతీతం

‘నరసింహనాయుడు’ తర్వాత చాలా ఏళ్ల పాటు పెద్ద స్లంప్ చూశాడు నందమూరి బాలకృష్ణ. కానీ ‘సింహా’తో తిరిగి హిట్ ట్రాక్…

1 hour ago

అమెరికా కొంటే తప్పులేదు.. భారత్ కొంటే తప్పా?

ఢిల్లీ గడ్డపై అడుగుపెట్టగానే రష్యా అధ్యక్షుడు పుతిన్ అమెరికాకు గట్టి కౌంటర్ ఇచ్చారు. ఉక్రెయిన్ యుద్ధం పేరుతో రష్యా నుంచి…

1 hour ago