ఓటీటీ విప్లవం ఇండియాలో కొంచెం ఆలస్యంగానే మొదలైందని చెప్పొచ్చు. గత కొన్నేళ్లలో ఓటీటీలకు ఇండియాలో ఆదరణ కొంచెం కొంచెం పెరుగుతూ వస్తుండగా.. కరోనా వల్ల అమలైన లాక్‌డౌన్‌తో ఒక్కసారిగా అది ఊపందుకుంది. గత కొన్ని నెలల్లో అన్ని ఓటీటీలకూ ఇండియాలో డిమాండ్ పెరిగింది. కోట్లల్లో కొత్త సబ్‌స్క్రైబర్లు తయారయ్యారు. కేవలం తెలుగులో మాత్రమే, పరిమితంగా కంటెంట్ అందించే ‘ఆహా’ లాంటి ఓటీటీకి కూడా మంచి డిమాండే ఏర్పడింది.
ఐతే ఇప్పుడు చూస్తున్నది కొంతే అని.. రాబోయే కొన్నేళ్లలో ఇండియాలో ఓటీటీ స్థాయి మరింతగా పెరగనుందని నిపుణులు అంటున్నారు. ఓటీటీ వీక్షకుల పరంగా భారత్ ప్రపంచంలోనే అతి పెద్ద సినిమా మార్కెట్‌లో ఒకటి కాబోతోందని ఒక అధ్యయనంలో తేలింది.
ప్రస్తుతం అత్యధిక ఓటీటీ వీక్షకులున్న దేశాల జాబితాలో దక్షిణ కొరియా, జర్మనీ, ఆస్ట్రేలియా ముందు వరుసలో ఉండగా.. 2024 నాటికి ఆ దేశాల్ని అధిగమించి ఇండియా నంబర్ వన్ అవుతుందని పీడబ్ల్యూసీ ఇండియా నివేదక అంచనా వేసింది. ఫిలిం ఇండస్ట్రీ ఆదాయాన్ని సబ్‌స్క్రిప్షన్ వీడియో ఆన్ డిమాండ్ నడిపించనుందని.. 2019లో దీని ద్వారా 708 మిలియన్ డాలర్ల (దాదాపు రూ.5200 కోట్లు) ఆదాయం రాగా.. ఏటా 30.7 శాతం వృద్ధితో 2024 నాటికి ఈ మొత్తం 2.7 బిలియన్ డాలర్లకు (దాదాపు రూ.20 వేల కోట్లు) చేరబోతోందని ఈ నివేదికలో పేర్కొన్నారు.
భారత్‌లో మీడియా, వినోద రంగం ఏటా పది శాతానికి పైగా వృద్ధితో సాగి 2024 నాటికి 54 బిలియన్ డాలర్లకు (దాదాపు రూ.4.1 లక్షల కోట్లే) చేరబోతుండగా.. అందులో ఓటీటీ వీడియో విభాగం వాటా 5.2 శాతం, అంటే రూ.20 వేల కోట్ల దాకా ఉంటుందని ఈ అధ్యయనంలో తేలింది. థియేటర్లు భారీగా మూతపడబోతుండటం, స్టూడియోలు ఓటీటీలే లక్ష్యంగా సినిమాలు, వెబ్ సిరీస్‌లు తీసే ఒరవడి పెరగనున్న నేపథ్యంలో ఓటీటీల జోరు భవిష్యత్తులో మరింత పెరుగుతుందని ఈ నివేదిక అంచనా వేసింది.
This post was last modified on October 23, 2020 2:33 pm
బాహుబలి-2 తర్వాత వరుసగా మూడు డిజాస్టర్లు ఎదుర్కొన్న ప్రభాస్‌కు సలార్ మూవీ గొప్ప ఉపశమనాన్నే అందించింది. వరల్డ్ వైడ్ ఆ…
ఐకాన్ స్టార్.. అల్లు అర్జున్ ఇంటిపై ఆదివారం సాయంత్రం కొందరు వ్యక్తులు దాడికి దిగిన విషయం తెలిసిందే. భారీ ఎత్తున…
ఏపీ సీఎం చంద్రబాబు మనవడు, మంత్రి నారా లోకేష్, బ్రాహ్మణి దంపతుల కుమారుడు నారా దేవాన్ష్.. రికార్డు సృష్టించారు. ఇటీవల…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఇంటిపై రాళ్ల దాడి జరిగింది. ఈ ఘటనలో కొందరు ఆందోళన కారులను పోలీసులు అరెస్టు…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ చుట్టూ మరింత ఉచ్చు బిగుస్తోంది. సంధ్య ధియేటర్ ఘటనపై ఇప్పటికే ఏ11గా కేసు నమోదు…
తన సినిమాల ప్రమోషన్లలో రామ్ చరణ్ చాలా తక్కువగా మాట్లాడుతుంటాడు. బేసిగ్గా బిడియస్తుడిలా కనిపిస్తాడు కాబట్టి మైక్ అందుకుంటే చాలా…