ప్రభాస్ హీరోగా మారుతీ దర్శకత్వంలో రూపొందుతున్న ‘ది రాజా సాబ్’ విడుదల ఏప్రిల్ 10 నుంచి వాయిదా వేశాక ఇప్పటిదాకా కొత్త డేట్ నిర్ణయం జరగలేదు. ఫౌజీ షూటింగ్ లో డార్లింగ్ బిజీ కావడంతో దీనికి బ్రేక్ ఇవ్వక తప్పలేదు. అయితే సాంకేతిక కారణాలతో పాటు కొందరు ఆర్టిస్టుల డేట్లు దొరకడంలో కలిగిన ఇబ్బంది వల్ల ఈ అడ్జస్ట్ మెంట్ జరిగిందనే టాక్ ఉంది కానీ అధికారికంగా ఎలాంటి సమాచారం లేదు. ప్రస్తుతం పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ ది రాజా సాబ్ కోసం అక్టోబర్ రిలీజ్ ఆప్షన్ ని సీరియస్ గా పరిశీలిస్తోందని తెలిసింది. రెండో తేదీ గాంధీ జయంతి గురువారంతో మొదలయ్యే వీకెండ్ బెస్టని భావిస్తోందట.
ముఖ్యంగా అదే రోజు దసరా పండగ రావడం సెలవుల పరంగా కీలకం కానుంది. కానీ ‘కాంతార చాప్టర్ 1’ ఆల్రెడీ ఆ డేట్ అనౌన్స్ చేసుకుంది కనక క్లాష్ తప్పకపోవచ్చు. అదే నెలలో బుచ్చిబాబు డైరెక్షన్లో రూపొందుతున్న ‘రామ్ చరణ్ 16’ రిలీజ్ చేసే అవకాశాల గురించి మెగా కాంపౌండ్ లో గట్టి టాకే వినిపిస్తోంది. షూటింగ్ వేగం చూస్తుంటే సాధ్యమయ్యేలా ఉందట. జాన్వీ కపూర్, శివరాజ్ కుమార్ కనక ఎక్కువ కాల్ షీట్లు ఇస్తే ఖచ్చితంగా చేస్తానని బుచ్చిబాబు అంటున్నట్టు సమాచారం. అలా జరిగినా కూడా ప్రభాస్ వర్సెస్ రామ్ చరణ్ ఉండకపోవచ్చు. పది రోజులు లేదా రెండు వారాలు గ్యాప్ వచ్చేలా అక్టోబర్ 16 అనుకుంటున్నారట.
ఇవన్నీ ప్రస్తుతం చర్చల దశలో ఉన్న డెసిషన్లే. ఎలా చూసినా ది రాజా సాబ్ వచ్చే ఛాన్స్ ఎక్కువగా ఉంది. అయితే సెప్టెంబర్ 25 ఇంతకు ముందే ప్రకటించుకున్న ‘అఖండ 2 తాండవం’ని తక్కువంచనా వేయడానికి లేదు. అదే రోజు సాయి ధరమ్ తేజ్ ‘సంబరాల ఏటిగట్టు’ కూడా ఉంది. వీటికి పాజిటివ్ టాక్ వస్తే దసరా తర్వాత కూడా థియేటర్లను హోల్డ్ చేస్తాయి. అప్పుడు ది రాజా సాబ్ కొంత రాజీ పడాల్సి ఉంటుంది. ఇదే జరిగితే పోటీ రసవత్తరంగా మారుతుంది. కేవలం ఇరవై రోజుల గ్యాప్ లో బాలకృష్ణ, సాయి ధరమ్ తేజ్, ప్రభాస్, రిషబ్ శెట్టి, రామ్ చరణ్ తేజ్ తలపడతారు. ఇంతకన్నా బాక్సాఫీస్ క్లాష్ ఏముంటుంది.
This post was last modified on February 20, 2025 3:29 pm
భర్త మహాశయులకు విజ్ఞప్తి ప్రీ రిలీజ్ ఈవెంట్ లో గెస్టుగా వచ్చిన దర్శకుడు బాబీ మాట్లాడుతూ రవితేజ రొటీన్ సినిమాలు…
వైసీపీ అధినేత జగన్పై ఏపీ సీఎం చంద్రబాబు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. అమరావతిపై జగన్ రెండు రోజుల కిందట…
తెలంగాణలో త్వరలో జరగనున్న మునిసిపల్ ఎన్నికల్లో జనసేన పార్టీ పోటీ చేయనున్నట్లు ఆ పార్టీ అధికారికంగా ప్రకటించింది.“త్వరలో జరగనున్న తెలంగాణ…
సినిమాల మీద మీమ్స్ క్రియేట్ చేయడంలో తెలుగు వాళ్లను మించిన వాళ్లు ఇంకెవ్వరూ ఉండరంటే అతిశయోక్తి కాదు. కొన్ని మీమ్స్…
అమరావతిని ఉద్దేశించి వైఎస్ జగన్ చేసిన వ్యాఖ్యలు రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర రాజకీయ దుమారాన్ని రేపాయి. రాజధానిని సో-కాల్డ్ నగరంగా అభివర్ణిస్తూ,…
సంక్రాంతి పండుగ వచ్చిందంటే చాలు…చిన్నా పెద్దా అని తేడా లేకుండా పతంగులు ఎగరేస్తుంటారు. పండుగ పూట కుటుంబ సభ్యులు, మిత్రులతో…