దేశవ్యాప్తంగా సంచలనాత్మక వసూళ్లతో దూసుకుపోతున్న చావా విషయంలో కొంత అసంతృప్తి రేగుతున్న అంశాల్లో ఏఆర్ రెహమాన్ సంగీతం ఒకటి. చాలా ముఖ్యమైన ఎపిసోడ్స్ సరైన రీతిలో ఎలివేట్ అయ్యేలా బిజిఎం ఇవ్వలేకపోయారని మ్యూజిక్ లవర్స్ అభిప్రాయపడుతున్నారు. మెచ్చుకుంటున్న వాళ్ళు లేకపోలేదు కానీ ఆయన స్థాయి ఇందులో లేదన్నది ప్రధానంగా వినిపిస్తున్న కామెంట్. హిస్టారికల్ బ్యాక్ డ్రాప్ ఉన్న సినిమాలకు రెహమాన్ బెస్ట్ ఏదని చెప్పుకోవాల్సి వస్తే ముందుగా గుర్తొచ్చేది జోధా అక్బర్. పాటలు, బ్యాక్ గ్రౌండ్ స్కోర్ దేనికవే సాటి అనేలా దర్శకుడు అశుతోష్ గోవరికర్ విజన్ ని నిలబెట్టాయి.
అంతకు ముందు జుబేదా, కొచ్చాడయన్, మంగళ్ సింగ్, పొన్నియిన్ సెల్వన్, మోహెన్జదారో లాంటి చారిత్రాత్మక సినిమాలకు సంగీతం అందించిన రెహమాన్ దేనికీ అవుట్ స్టాండింగ్ ఆల్బమ్ ఇవ్వలేదనేది ఒక వర్గం వాదన. ది లెజెండ్ అఫ్ భగత్ సింగ్ లాంటి ఒకటి రెండు మాత్రమే కొంత వర్కౌట్ అయ్యాయి. అయినా వింటేజ్ రెహమాన్ మనకు వినిపించి సంవత్సరాలు గడిచిపోతున్న టైంలో చావాకు ఇచ్చింది డీసెంట్ వర్కనే చెప్పాలి. కాకపోతే మళ్ళీ మళ్ళీ వినాలనిపించేలా పాటలు లేకపోవడం కొంత నిజమే అయినా మూడు దశాబ్దాల తర్వాత కూడా లెజెండరీ మ్యుజిషియన్ నుంచి ఇంతకన్నా ఆశించడం కరెక్ట్ కాదు.
ఇదంతా పక్కనపెడితే ఏఆర్ రెహమాన్ నెక్స్ట్ చేయబోయే సినిమా రామ్ చరణ్ 16. మూడు సాంగ్స్ రికార్డింగ్ కూడా అయిపోయింది. అసలే టాలీవుడ్ స్ట్రెయిట్ సినిమాలకు హిట్ ఇవ్వలేదనే నింద రెహమాన్ మీద ఎప్పటి నుంచో ఉంది. సూపర్ పోలీస్, గ్యాంగ్ మాస్టర్, నాని, నీ మనసు నాకు తెలుసు, కొమరం పులి, సాహసం శ్వాసగా సాగిపో లాంటివన్నీ సోసోగా ఆడాయి. ఏ మాయ చేశావే మాత్రమే హిట్ అయ్యింది. కెరీర్ ప్రారంభంలో బిజిఎం ఇచ్చిన నిప్పురవ్వ సైతం ఫ్లాపే. సో చరణ్ ఫ్యాన్స్ కొంత టెన్షన్ పడటం న్యాయమే కానీ దర్శకుడు బుచ్చిబాబు వీలైనంత బెస్ట్ రాబట్టుకునే టైపు కాబట్టి నిశ్చింతగానే ఉంటున్నారు.
This post was last modified on February 20, 2025 10:14 am
సినీ పరిశ్రమలో కాస్టింగ్ కౌచ్ లేదు అని చెప్పలేమని సీనియర్ దర్శక నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ స్పష్టం చేశారు. ఇటీవల…
బరామతి విమాన ప్రమాదంలో దుర్మరణం చెందిన మహారాష్ట్ర డిప్యూటీ ముఖ్యమంత్రి అజిత్ పవార్ స్థానాన్ని ఇప్పుడు ఆయన భార్య సునేత్ర…
తన సొంత నియోజకవర్గం కుప్పాన్ని ప్రయోగశాలగా మార్చనున్నట్టు సీఎం చంద్రబాబు తెలిపారు. తాజాగా శుక్రవారం రాత్రి తన నియోజకవర్గానికి వచ్చిన…
ఫోన్ ట్యాపింగ్ కేసు విచారణ విషయంలో తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ పంతం నెగ్గలేదు. తనను ఎర్రవెల్లిలోని తన ఫామ్…
రామ్ చరణ్ కొత్త సినిమా ‘పెద్ది’కి సెట్స్ మీదికి వెళ్లే సమయంలో రిలీజ్ డేట్ ఖరారు చేశారు. ఈ ఏడాది…
వీణవంకలో సమ్మక్క-సారలమ్మ జాతరలో మొక్కులు చెల్లించుకునేందుకు బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి తన కుటుంబ సభ్యులు, మహిళా సర్పంచ్…