Movie News

ఫ్లాప్ సినిమాతో అన్ని డబ్బులొచ్చాయా…

‘ది కశ్మీర్ ఫైల్స్’ చిత్రంతో సెన్సేషన్ క్రియేట్ చేసిన దర్శకుడు వివేక్ అగ్నిహోత్రి. కేవలం 15 కోట్ల స్వల్ప బడ్జెట్లో తెరకెక్కిన ఆ చిత్రం.. అప్పట్లో రూ.300 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టి సంచలనం రేపింది. పెద్దగా అంచనాలు లేకుండా విడుదలైన ఆ సినిమా.. బాక్సాఫీస్ దగ్గర ఒక యుఫోరియా క్రియేట్ చేసి, ఎవ్వరూ ఊహించని స్థాయికి వెళ్లిపోయింది. ఐతే ఈ ఊపులో వివేక్ తీసిన ‘ది వ్యాక్సిన్ వార్’ మాత్రం ప్రేక్షకులను మెప్పించలేకపోయింది. కొవిడ్ తర్వాత వ్యాక్సిన్ల తయారీ కోసం ఫార్మా కంపెనీలు పోటీపడడం.. ఇందులోని రాజకీయాల చుట్టూ తిరిగే ఆ సినిమాకు టాక్ బాగున్నా కూడా బాక్సాఫీస్ దగ్గర విజయం దక్కలేదు. ప్రేక్షకుల దృష్టిలో పడకుండానే సినిమా వెళ్లిపోయింది.

అందరూ దీన్ని డిజాస్టర్ అనే అనుకుంటుండగా.. వివేక్ మాత్రం ఆ చిత్రంతో భారీ లాభాలు ఆర్జించినట్లు చెబుతుండడం విశేషం. వివేక్ నుంచి రాబోతున్న కొత్త చిత్రం.. ది ఢిల్లీ ఫైల్స్: బెంగాల్ చాప్టర్’. ప్రస్తుతం మేకింగ్ దశలో ఉన్న ఈ సినిమా గురించి ఒక నెటిజన్ నెగెటివ్ కామెంట్ చేయడంతో వివేక్ అగ్నిహోత్రికి కోపం వచ్చింది. ‘ది వ్యాక్సిన్ వార్’ సక్సెస్ కాదని.. దీనికి కూడా ‘ది వ్యాక్సిన్ వార్’కు కూడా పట్టిన గతే పడుతుందని సదరు నెటిజన్ వ్యాఖ్యానించాడు.

దీనికి వివేక్ బదులిస్తూ.. ‘‘వావ్.. మీరు అద్భుతమైన విషయం చెప్పారు. ‘ది వ్యాక్సిన్ వార్’తో మేం పెద్ద ఎత్తున డబ్బులు సంపాదించాం. ఆ డబ్బులనే పెట్టుబడిగా పెట్టి ‘ది ఢిల్లీ ఫైల్స్’ తీశాం’’ అంటూ కౌంటర్ ఇచ్చాడు వివేక్. పదేళ్లకు పైగా కేంద్రంలో అధికారంలో ఉన్న ఎన్డీయే సర్కారుకు అనుకూలంగా ప్రాపగండా సినిమాలు తీస్తాడని వివేక్ మీద ఒక ముద్ర ఉంది. ‘ది కశ్మీర్ ఫైల్స్’ పెద్ద హిట్టయినా.. దాన్ని ప్రాపగండా మూవీ అనే అన్నారు చాలామంది. ‘ది వ్యాక్సిన్ వార్’ విషయంలోనూ అలాంటి విమర్శలే వచ్చాయి. ఈ క్రమంలోనే ఓ నెటిజన్ కౌంటర్ వేయగా.. బాక్సాఫీస్ దగ్గర పెద్దగా ప్రభావం చూపని ‘ది వ్యాక్సిన్ వార్’ ద్వారా తాను పెద్ద మొత్తంలో లాభాలు అందుకున్నట్లు చెప్పి ఆశ్చర్యపరిచాడు వివేక్.

This post was last modified on February 19, 2025 9:35 pm

Share

Recent Posts

రిజర్వేషన్ లెక్కలు… ఎవరెవరికి ఎన్ని? ఎక్కడ?

ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికల నోటిఫికేషన్ మరో రెండు, మూడు రోజుల్లో వెలువడే అవకాశముంది. ఈ క్రమంలోనే రాష్ట్రంలోని 106…

49 minutes ago

ఈవీఎంల వల్లే జగన్ ఓడారు: తెలంగాణ మంత్రి

2024 ఎన్నికల ఫలితాలపై ఈవీఎంల పనితీరుపై వైసీపీ నేతలు కొందరు అనుమానాలు వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. ఈవీఎంల వల్లే…

2 hours ago

లోక‌ల్ వార్‌.. వైసీపీ వాటిని వ‌దులుకోవాల్సిందే భ‌య్యా.. !

స్థానిక సంస్థలు ఎన్నికల్లో ఏకగ్రీవాలు చేసుకునేందుకు కూటమి ప్రయత్నాలు ముమ్మరం చేస్తోంది. ఈ క్రమంలో రాష్ట్రవ్యాప్తంగా సుమారు 70% స్థానిక…

4 hours ago

బాబాయ్ గొడ్డలి జపమైపోయింది

రాష్ట్రంలో గొడ్డలి పార్టీ అనగానే ప్రతి ఒక్కరికీ వైసీపీ పార్టీ గుర్తుకు వస్తుంది. మాజీ మంత్రి వైయస్ వివేకానంద రెడ్డి…

6 hours ago

సుకుమార్ ఏం మార్పు కోరుకుంటున్నట్లు?

పెద్ద దర్శకులు కొందరు తమ టెక్నీషియన్ల విషయంలో చాలా పర్టికులర్‌గా ఉంటారు. తమ‌తో బాగా సింక్ అయ్యే, కోరుకున్న ఔట్…

7 hours ago

రేట్లు కావాలి కానీ రజినీ రాడు

సూపర్ స్టార్ రజినీకాంత్‌కు తెలుగులో ఉన్న ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఇక్కడి పెద్ద హీరోలకు ఏమాత్రం…

7 hours ago