Movie News

రాజమౌళి లవ్ ట్రాక్ వీడియో వైరల్

రాజమౌళి గొప్ప దర్శకుడే కాదు.. మంచి నటుడు కూడా. ఆయన కొన్ని చిత్రాల్లో చిన్న చిన్న క్యామియో రోల్స్ చేసిన సంగతి తెలిసిందే. మజ్ను, కల్కి లాంటి చిత్రాల్లో ఆయన పాత్రలకు మంచి రెస్పాన్సే వచ్చింది. దర్శకుడు కావడానికి ముందు, తర్వాత ఆయన కొన్ని సీరియల్స్‌లో కూడా చిన్న చిన్న పాత్రలు చేసిన విషయం చాలామందికి తెలియదు. తన బంధువైన గుణ్ణం గంగరాజు ప్రొడ్యూస్ చేసిన ‘అమృతం’ సీరియల్లో రాజమౌళి నటించిన ఎపిసోడ్ యూట్యూబ్‌లో చూడొచ్చు. దీంతో పాటు ‘మా’ టీవీ కోసం అక్కినేని నాగార్జున నిర్మించిన ‘యువ’ సీరియల్లోనూ రాజమౌళి క్యామియో రోల్‌తో అలరించాడు. అది చేసేటప్పటికి రాజమౌళి దర్శకుడిగా స్టార్ స్టేటస్ సంపాదించడం విశేషం.

అప్పటికే సింహాద్రి, యమదొంగ, విక్రమార్కుడు లాంటి బ్లాక్ బస్టర్లు కొట్టాడు జక్కన్న. ఐతే ఇప్పుడీ విషయాలన్నీ ఎందుకు ప్రస్తావించడం అంటే.. ‘యువ’ సీరియల్లో రాజమౌళి క్యామియోకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుండడం వల్లే. రష్మి గౌతమ్, కృష్ణుడు, కరుణశ్రీ, విశ్వ, వాసు తదితరులు ముఖ్యపాత్రలు పోషించిన ‘యువ’ సీరియల్ అప్పట్లో మంచి ఆదరణే దక్కించుకుంది. దీనికి ఉన్న పాపులారిటీ దృష్ట్యా కొందరు ప్రముఖులు క్యామియోలు చేశారు. అనుష్క సైతం ఒక ఎపిసోడ్లో నాగలక్ష్మి అనే పాత్రలో కనిపించింది. ఇక రాజమౌళి నిజ జీవిత పాత్రనే చేశాడిందులో.

రష్మికి, రాజమౌళికి మధ్య లవ్ ట్రాక్ కూడా పెట్టారు ఆ సీరియల్లో. ఆ ట్రాక్‌కు సంబంధించిన వీడియో ఇప్పుడు ఎందుకు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది. ప్రస్తుతం పాన్ వరల్డ్ డైరెక్టర్‌గా ఎదిగిన రాజమౌళి.. అప్పట్లో సీరియల్లో ఇలాంటి పాత్ర చేయడం చాలామందికి ఆశ్చర్యంగా అనిపిస్తోంది. చిన్న పాత్రే అయినా చక్కగా నటించి మెప్పించిన జక్కన్న మీద ప్రశంసలు కురుస్తున్నాయి. రాజమౌళి కెరీర్ తొలి నాళ్ల గురించి తెలియని ఇప్పటి యూత్.. ఈ వీడియో చూసి ఆశ్చర్యపోతూ కామెంట్లు పెడుతున్నారు.

This post was last modified on February 19, 2025 1:55 pm

Share

Recent Posts

ఫ్లైయింగ్ అతడికి భార్యలాంటిది

ఇప్పుడు దేశమంతా ఇండియన్ హీరో కెప్టెన్ స్మిత్ మచ్చర్ గురించే మాట్లాడుతోంది. దేశమే కాదు యావత్ ప్రపంచంలోనూ ఇదే చర్చ…

3 hours ago

ఆ యంగ్ మినిస్ట‌ర్ దూకుడు మామూలుగా లేదుగా…

యువ మంత్రి, క‌ర్నూలు జిల్లాకు చెందిన టీజీ భ‌ర‌త్‌.. దూకుడు మామూలుగా లేదనే టాక్ వినిపిస్తోంది. టీడీపీ నాయ‌కుడిగా.. యువ…

5 hours ago

రణబాలికి ఇంతకంటే ఏం కావాలి

ఈ నెల విడుదలవుతున్న సినిమాల్లో అత్యధిక బడ్జెట్ తో రూపొందిన ప్యాన్ ఇండియా మూవీ రణబాలినే. విజయ్ దేవరకొండ, రష్మిక…

10 hours ago

ఊహించని మార్పులతో దృశ్యం 3

కొన్ని నెలల క్రితం మోహన్ లాల్ దృశ్యం 3 మీద చాలా విమర్శలొచ్చాయి. మలయాళం వెర్షన్ డబ్బులు తెచ్చి ఉండొచ్చేమో…

11 hours ago

ఒకే నెలలో సాయిపల్లవి డబుల్ బొనాంజా

గత సంవత్సరం తండేల్ తర్వాత హీరోయిన్ సాయిపల్లవి దర్శనం బొత్తిగా లేకుండా పోయింది. ఈ ఏడాది ఏక్ దిన్ తో…

11 hours ago

40 సంవత్సరాల రాక్షసుడు… ఇది చిరంజీవి కెజిఎఫ్

కొన్ని సినిమాల ల్యాండ్ మార్క్ యానివర్సరీలు గుర్తు చేసుకోవడం అవసరం. ఎందుకంటే ఇప్పటి బ్లాక్ బస్టర్ల మూలాలు ఎంతో కొంత…

11 hours ago