బుచ్చిబాబు దర్శకత్వంలో ఆర్సి 16 తాలూకు అప్డేట్లే ఇంకా మొదలవ్వలేదు అప్పుడే ఆర్సి 17 గురించి సోషల్ మీడియాలో హంగామా జరగడం అభిమానులను అయోమయానికి గురి చేసింది. పుష్ప 2 తర్వాత సుకుమార్ చేయబోయేది రామ్ చరణ్ తోనే అయినప్పటికీ ఇంకా స్క్రిప్ట్ ఫైనల్ కాలేదు. కథను సిద్ధం చేసుకుని త్వరలో ఫైనల్ వెర్షన్ పూర్తి చేయబోతున్నారు. దీని మీద టీమ్ గత కొన్ని వారాలుగా పని చేస్తూనే ఉంది. అయితే చరణ్, సుకుమార్ ఇద్దరూ ఇటీవలే అబుదాబి వెళ్లడంతో అది స్టోరీ డిస్కషన్స్ గురించేననే వార్త ఒక్కసారిగా గుప్పుమంది. కానీ అసలు ట్విస్ట్ తెలిస్తే అంతేనా, హమ్మయ్య అనుకోవచ్చు.
మ్యాటర్ ఏంటంటే దుబాయ్ లో జరిగిన ఒక సెలబ్రిటీ ఫ్యామిలీ వివాహ వేడుకకు హాజరు కావడం కోసం రామ్ చరణ్, సుకుమార్ వేర్వేరు రోజుల్లో అక్కడికి చేరుకున్నారు తప్పించి ముందస్తు సినిమా కోసం ప్లాన్ చేసి కాదట. ఈ కారణంగానే ఆర్సి 16కి చిన్న బ్రేక్ ఇచ్చి మళ్ళీ కొనగిస్తున్నారు. ప్రస్తుతం మెగా పవర్ స్టార్ ఫోకస్ అంతా బుచ్చిబాబు సినిమా మీదే ఉంది. గేమ్ ఛేంజర్ మీద అతి నమ్మకంతో మూడేళ్లు వృధాగా పోవడంతో ఈసారి తప్పులు జరగకుండా ఆలస్యం కాకుండా వేగంగా షూట్ జరిగేందుకు సహకరిస్తున్నాడు. వీలైతే ఈ ఏడాది దసరా లేదా దీపావళి రిలీజ్ అనుకుంటున్నారు కానీ అంత సులభమైతే కాదు.
సో ఫ్యాన్స్ రిలాక్స్ కావొచ్చు. ఇక ఆర్సి 17 విషయానికి వస్తే రంగస్థలంని మించి కంటెంట్ ని ప్రేక్షకులు ఆశిస్తారు కాబట్టి దానికి తగ్గట్టే సుకుమార్ పవర్ ఫుల్ సబ్జెక్టుని సిద్ధం చేశారట. పుష్ప నేపధ్యానికి పూర్తి విభిన్నం అనిపించే బ్యాక్ డ్రాప్ ఎంచుకున్నట్టు సమాచారం. కథకు సంబంధించిన లీకులు రాలేదు కానీ అప్పుడెప్పుడో రాజమౌళి చెప్పినట్టు ఇంట్రోతో సహా కొన్ని ఎపిసోడ్స్ పేపర్ మీదే టెర్రిఫిక్ అనిపిస్తున్నాయట. ఆర్ఆర్ఆర్ హీరో, పుష్ప డైరెక్టర్ కాంబో దీని మీద మాములు క్రేజ్ నెలకొనదు. అయితే శిష్యుడి సినిమా రిలీజయ్యే దాకా సుకుమార్ తన ప్రాజెక్టుకు సంబంధించి ఎలాంటి సమాచారం ఇవ్వొద్దని టీమ్ కి చెప్పినట్టు వినికిడి.
This post was last modified on February 19, 2025 12:58 pm
భర్త మహాశయులకు విజ్ఞప్తి ప్రీ రిలీజ్ ఈవెంట్ లో గెస్టుగా వచ్చిన దర్శకుడు బాబీ మాట్లాడుతూ రవితేజ రొటీన్ సినిమాలు…
వైసీపీ అధినేత జగన్పై ఏపీ సీఎం చంద్రబాబు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. అమరావతిపై జగన్ రెండు రోజుల కిందట…
తెలంగాణలో త్వరలో జరగనున్న మునిసిపల్ ఎన్నికల్లో జనసేన పార్టీ పోటీ చేయనున్నట్లు ఆ పార్టీ అధికారికంగా ప్రకటించింది.“త్వరలో జరగనున్న తెలంగాణ…
సినిమాల మీద మీమ్స్ క్రియేట్ చేయడంలో తెలుగు వాళ్లను మించిన వాళ్లు ఇంకెవ్వరూ ఉండరంటే అతిశయోక్తి కాదు. కొన్ని మీమ్స్…
అమరావతిని ఉద్దేశించి వైఎస్ జగన్ చేసిన వ్యాఖ్యలు రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర రాజకీయ దుమారాన్ని రేపాయి. రాజధానిని సో-కాల్డ్ నగరంగా అభివర్ణిస్తూ,…
సంక్రాంతి పండుగ వచ్చిందంటే చాలు…చిన్నా పెద్దా అని తేడా లేకుండా పతంగులు ఎగరేస్తుంటారు. పండుగ పూట కుటుంబ సభ్యులు, మిత్రులతో…