Movie News

పాతికేళ్ల తర్వాత కలుస్తున్న ‘వాలి’ జంట

అజిత్ కెరీర్ ని మలుపు తిప్పిన సినిమాల్లో వాలి ప్రధానమైంది. దర్శకుడు ఎస్జె సూర్య ప్రతిభను ప్రపంచానికి పరిచయం చేసిన బ్లాక్ బస్టర్ కూడా ఇదే. తమిళంలోనే కాక తెలుగులోనూ సూపర్ హిట్ కొట్టింది. అన్నదమ్ములుగా ఒక నెగటివ్ ఒక పాజిటివ్ షేడ్స్ ఉన్న క్యారెక్టర్స్ ని అజిత్ పోషించిన తీరు గురించి ఎంత చెప్పినా తక్కువే. బావ కళ్ళలో పడి నలిగిపోయే హీరోయిన్ గా సిమ్రాన్ కూడా మంచి పెర్ఫార్మన్స్ ఇచ్చింది. దేవా పాటలు మ్యూజిక్ లవర్స్ ని ఊపేశాయి. తర్వాత ఈ ఇద్దరు ఉన్నయ్ కోడు ఎన్నై చేశారు కానీ అది ఫ్లాప్ అయ్యింది. నవీన్ వడ్డే పెళ్లి రీమేక్ అవళ్ వరువాళా మంచి విజయం సాధించింది.

ఇదంతా పాతికేళ్ల క్రితం నాటి ముచ్చట. తర్వాత అజిత్, సిమ్రాన్ కలయికలో సినిమా రాలేదు. మళ్ళీ ఇన్ని సంవత్సరాల తర్వాత తెరమీద కలవబోతున్నట్టు చెన్నై అప్డేట్. ఆధిక్ రవిచంద్రన్ దర్శకత్వంలో మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తున్న గుడ్ బ్యాడ్ అగ్లీలో సిమ్రాన్ కో స్పెషల్ క్యామియో ఇచ్చారట. ఇంకా అధికారికంగా ప్రకటించలేదు కానీ దాదాపుగా లాకైనట్టే. అజిత్ కు వీరాభిమాని అయిన ఆధిక్ కు వాలి ఫేవరెట్ మూవీ. అందుకే ఆ కాంబోని ఈ రూపంలో అయినా రిపీట్ చేయాలనే ఉద్దేశంతో స్పెషల్ ఎపిసోడ్ డిజైన్ చేశాడట. సపోర్టింగ్ ఆర్టిస్టుగా మారిపోయిన సిమ్రాన్ తో అజిత్ కు ఎలాంటి సీన్లు ఉండబోతున్నాయో.

ఏప్రిల్ 10 విడుదల కాబోతున్న గుడ్ బ్యాడ్ అగ్లీ మీద అభిమానులు విపరీతమైన అంచనాలు పెట్టుకున్నారు. విడాముయార్చి (పట్టుదల) తీవ్రంగా నిరాశ పరచడంలో పుష్ప నిర్మాతలు బ్లాక్ బస్టర్ ఇస్తారనే నమ్మకంతో ఎదురు చూస్తున్నారు. దేవిశ్రీ ప్రసాద్ పాటలు సమకూర్చగా జివి ప్రకాష్ కుమార్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ అందిస్తున్నారు. త్రిష హీరోయిన్ కాగా ప్రభు, సునీల్, అర్జున్ దాస్, రాహుల్ దేవ్ తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. హిందీలో సన్నీ డియోల్ జాత్, తెలుగులో సిద్దు జొన్నలగడ్డ జాక్ తో పోటీ పడబోతున్న గుడ్ బ్యాడ్ అగ్లీ కనీసం వంద కోట్లతో ఓపెన్ అవ్వొచ్చని కోలీవుడ్ ట్రేడ్ టాక్.

This post was last modified on February 19, 2025 10:03 am

Share

Recent Posts

ఆదర్శ నిర్ణయాలు మంచి ఫలితాలు ఇవ్వాలి

ఈ మధ్య భారీ బడ్జెట్ సినిమాలకు ముందు రోజు వేస్తున్న ప్రీమియర్ షోలు పెద్ద సమస్యగా మారాయి. అసలు కంటెంట్…

12 minutes ago

హైదరాబాద్ తగలబెడతానంటోన్న దానం

ప్రధాని మోదీ, సీఈసీ జ్ఞానేశ్ కుమార్ లపై సీఎం రేవంత్ రెడ్డి సంచలన ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే. ఓట్ల…

20 minutes ago

జగన్ పిలిచినా సాయిరెడ్డి వెళ్ళరు

ఒకప్పుడు వైసీపీలో ఓ వెలుగు వెలిగిన విజయ సాయిరెడ్డి ఇప్పుడు ఆ పార్టీపై ఒంటికాలిపై లేస్తున్న వైనం పలువురిని ఆశ్చర్యపరుస్తోంది.…

35 minutes ago

సిగ్మా తీర్చాల్సిన బాకీ ఇద్దరిదే

దసరా నెల ప్రారంభంలో విడుదలవుతున్న మొదటి వారం సినిమాల్లో సిగ్మా మీద మంచి అంచనాలే నెలకొన్నాయి. తమిళనాడు సిఎం కొడుకు…

36 minutes ago

అభయం ఇస్తున్న సాయి అభ్యంక్కర్

దక్షిణాది సంగీత దర్శకుల్లో అత్యధిక డిమాండ్ ఎంజాయ్ చేస్తున్న వాళ్లలో మొదట వినిపించే పేరు అనిరుధ్ రవిచందర్. బ్యాక్ గ్రౌండ్…

3 hours ago

రాహుల్ ముందే పసిగడుతున్నారా?

కాంగ్రెస్ అగ్రనేత, ఎంపీ రాహుల్ గాంధీపై సోషల్ మీడియాలో రకరకాల ట్రోలింగ్స్ వస్తుంటాయి. గతంలో అయితే ఆయనను పప్పు అంటూ…

3 hours ago