కారణం ఏదైనా ఒక చిన్న సినిమా విడుదల వాయిదా పడిందంటే దానికి మళ్ళీ సరైన డేట్ ని వెతుక్కోవడం నిర్మాతలకు కంటి మీద కునుకు రానంత సమస్యగా మారిపోయింది. ప్రస్తుతం సారంగపాణి జాతకం పరిస్థితి అచ్చం ఇలాగే ఉంది. ప్రియదర్శి హీరోగా ఇంద్రగంటి మోహనకృష్ణ దర్శకత్వంలో రూపొందిన ఈ కామెడీ ఎంటర్ టైనర్ ఎప్పుడో షూటింగ్ పూర్తి చేసుకుంది. గత ఏడాది డిసెంబర్ 20 లాక్ చేసుకుని ఆ మేరకు కొన్నిరోజులు ప్రమోషన్లు చేసుకున్నారు. పుష్ప 2 జోరు విపరీతంగా ఉండటం, నితిన్ రాబిన్ హుడ్ అదే తేదీకి వస్తుందనే ప్రచారం నేపథ్యంలో సారంగపాణి టీమ్ పోస్ట్ పోన్ చేసుకున్నారు.
తీరా చూస్తే ఇప్పుడదే సమస్యయ్యింది. స్లాట్లన్నీ బుక్ అయిపోతున్నాయి. ఫిబ్రవరిలో తెద్దామంటే అదంతా సేఫ్ సీజన్ కాదని వెనుకడుగు వేశారు. ఎలాగూ తండేల్ ఉంది కదా దానికి ఎదురెళ్ళడం ఎందుకని ఆగారు. ప్రేమికుల రోజున లైలా, బ్రహ్మ ఆనందం ఉన్నాయి. తొలుత దిల్ రుబా కూడా ఉండేది కానీ తర్వాత తప్పుకుంది. ఇప్పుడు మజాకాతో మంత్ ఎండింగ్ ముగిసిపోనుంది. పోనీ మార్చి మొదటి వారం చూద్దామా అంటే ఓటిటి డీల్ కు సంబంధించి ఏదో వ్యవహారం పెండింగ్ ఉందట. ఇది త్వరగా తేలకపోతే ఇంకొంత ఆలస్యం తప్పదు. మార్చి నెలాఖరులో తీవ్రమైన పోటీ ఉంది.
అలాని సారంగపాణి జాతకం ఏదో ఆషామాషీ క్యాస్టింగ్ తో తీసింది కాదు. టైటిల్ రోల్ ప్రియదర్శి పోషించాడు. వెన్నెల కిషోర్, వైవా హర్ష, నరేష్, అవసరాల శ్రీనివాస్, తనికెళ్ళ భరణి లాంటి సీనియర్ తారాగణం ఉంది. వివేక్ సాగర్ సంగీతం అందించగా టాప్ కెమెరామెన్ పిజి విందా ఛాయాగ్రహణం సమకూర్చారు. ఇంద్రగంటి గత కొన్ని సినిమాలు ఫ్లాప్ ఏమో కానీ ఇంతకు ముందు అష్టాచెమ్మా, జెంటిల్ మెన్, గోల్కొండ హైస్కూల్, సమ్మోహనం లాంటి ఫ్యామిలీ సెక్షన్ ఫేవరెట్స్ చాలా ఉన్నాయి. పైగా సారంగపాణి నిర్మాత శ్రీదేవి మూవీస్ అధినేత శివలెంక కృష్ణప్రసాద్. మరి జాతకం ఎప్పుడు సెట్టై ఇది బయటికి వస్తుందో.
This post was last modified on February 18, 2025 7:39 pm
మెగా కంబ్యాక్ గా అభిమానులు మురిసిపోతున్న మన శంకరవరప్రసాద్ గారు థియేటర్లు ప్రీమియర్ల నుంచి రెగ్యులర్ షోల దాకా చాలా…
బాహుబలి, బాహుబలి-2 చిత్రాలతో దేశవ్యాప్తంగా తిరుగులేని ఫ్యాన్ ఫాలోయింగ్, మార్కెట్ సంపాదంచుకున్నాడు ప్రభాస్. ఇదంతా రాజమౌళి పుణ్యం అంటూ కొందరు…
చాలా గ్యాప్ తర్వాత చిరంజీవి సినిమాకు సోషల్ మీడియాలో విపరీతమైన పాజిటివ్ వైబ్స్ కనిపిస్తున్నాయి. ప్రీమియర్లతో విడుదలైన మన శంకరవరప్రసాద్…
సంక్రాంతి అంటేనే సినిమాల పండగ. ఈసారి బాక్సాఫీస్ వద్ద రద్దీ మామూలుగా లేదు. ప్రభాస్ 'రాజా సాబ్', మెగాస్టార్ 'MSG'…
వరద భయం లేకుండా ప్రపంచ స్థాయి ప్రమాణాలతో అమరావతి నగరాన్ని నిర్మిస్తున్నట్లు కూటమి ప్రభుత్వం హామీ ఇస్తోంది. మరోవైపు అమరావతి…
మూడేళ్లకు పైగా టైం తీసుకుని, 400 కోట్లకు పైగా బడ్జెట్ పెట్టి తీసిన సినిమా.. రాజాసాబ్. కానీ ఏం లాభం?…