చావా.. ఇప్పుడు ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీలో ఎక్కడ చూసినా ఈ సినిమా గురించే చర్చ. లెజెండరీ కింగ్ ఛత్రపతి శివాజీ తనయుడు శంబాజీ మహరాజ్ జీవిత కథ ఆధారంగా తెరకెక్కిన చిత్రమిది. బాలీవుడ్లో ఇలాంటి భారీ ప్రయత్నాలు చాలానే జరిగాయి కానీ.. దీన్ని చాలా ప్రత్యేకంగా చెప్పుకోవాలి. ఈ సినిమా చూసి ప్రేక్షకులు తీవ్ర భావోద్వేగానికి గురవుతూ.. థియేటర్లలో స్పందిస్తున్న తీరు చర్చనీయాంశంగా మారింది. ముఖ్యంగా మరాఠీలైతే సినిమా చూసి కదిలిపోతున్నారు. వారి కన్నీళ్లతో థియేటర్లు తడిసి ముద్దవుతున్నాయి. నినాదాలతో హోరెత్తిపోతున్నాయి.
ఇక ఈ చిత్రంలో శంబాజీ మహరాజ్‌గా విక్కీ కౌశల్ పెర్ఫామెన్స్ గురించి ఎంత చెప్పినా తక్కువే. ఇప్పటికే విక్కీ మంచి నటుడిగా గుర్తింపు తెచ్చుకున్నాడు కానీ.. ఇందులో తన నటన వేరే లెవెల్ అనే చెప్పాలి. ఈ సినిమా చూసి విక్కీని ప్రశంసల్లో ముంచెత్తని వారు లేరు. ‘చావా’ చూసిన వాళ్లంతా ముక్తకంఠంతో చెబుతున్న మాట.. 2025 సంవత్సరానికి జాతీయ ఉత్తమ నటుడుగా నిలవబోయేది విక్కీనే అని.
నిజానికి ‘సర్దార్ ఉద్దమ్’, ‘శ్యామ్ బహద్దూర్’ చిత్రాలకే విక్కీకి నేషనల్ అవార్డు వస్తుందని ఆయా సినిమాలు రిలీజైనపుడు అంచనాలు ఏర్పడ్డాయి. కానీ చివరికి నిరాశే మిగిలింది. కానీ ఈ ఏడాది అతడికి నేషనల్ అవార్డు రాకుండా ఎవ్వరూ ఆపలేరనే అభిప్రాయాలు బలంగా వినిపిస్తున్నాయి. పెర్ఫామెన్స్ పరంగా విక్కీని బీట్ చేయడం అంత తేలిక కాదు. ఒకవేళ చేసినా.. కూడా జ్యూరీ అతడికే పురస్కారాన్ని కట్టబెట్టే అవకాశాలున్నాయి.
‘చావా’ హిందూ సంస్కృతి గురించి గొప్పగా చూపించిన సినిమా. శంబాజీ ఆ సంస్కృతి కోసం ముఘల్ రాజులతో పోరాడిన యోధుడు. ఇక కేంద్రంలో అధికారంలో ఉన్నదేమో ఎన్డీయే ప్రభుత్వం. మోడీ సర్కారు కొన్నేళ్ల నుంచి హిందు ప్రో చిత్రాలకు జాతీయ అవార్డుల్లో పెద్ద పీట వేస్తున్న విషయం తెలిసిందే. మరీ ఏకపక్షంగా ఏమీ అవార్డులు ఇవ్వట్లేదు కానీ.. ఈ తరహా చిత్రాలకు అదనపు ప్రోత్సాహం లభిస్తోంది. అందులోనూ విక్కీ నటన విషయంలో సర్వత్రా ప్రశంసలు కురుస్తున్నాయి. కాబట్టి అతడికి అవార్డును ప్రకటిస్తే వ్యతిరేకత కూడా ఉండదు. ఉత్తమ నటుడి పురస్కారంతో పాటు పలు అవార్డులు ‘చావా’ ఖాతాలో పడితే ఆశ్చర్యమేమీ లేదు.
This post was last modified on February 18, 2025 2:11 pm
ఒకప్పుడు కన్నడ సినిమా అంటే రొటీన్ మాస్ సినిమాలకు కేరాఫ్ అడ్రస్. ఆ మాస్ సినిమాలు కూడా ఎక్కువగా తెలుగు, తమిళం…
నవ్యాంధ్రప్రదేశ్ నూతన రాజధాని అమరావతిలో పునర్నిర్మాణ పనులకు త్వరలోనే అడుగు పడనుంది. మే 2న అమరావతి రానున్న భారత ప్రదాన మంత్రి నరేంద్ర మోదీ…
ప్రస్తుతం ఉన్న బిజీ లైఫ్ స్టైల్, స్ట్రెస్ కారణంగా చాలామంది ఊబకాయం ,బెల్లీ ఫ్యాట్ తో భాద పడుతున్నారు. మరీ…
ఏపీ మంత్రి వర్గంలో సీఎం చంద్రబాబు గీస్తున్న లక్ష్మణ రేఖలకు.. ఆయన ఆదేశాలకు కూడా.. పెద్దగా రెస్పాన్స్ ఉండడం లేదని…
సంగీత దర్శకుడిగా ఏఆర్ ప్రస్థానం, గొప్పదనం గురించి మళ్ళీ కొత్తగా చెప్పడానికేం లేదు కానీ గత కొంత కాలంగా ఆయన…
యావత్తు దేశం ఆసక్తిగా ఎదురు చూస్తున్న వక్ఫ్ సవరణ చట్టంపై సర్వోన్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు బుధవారం విచారణ చేపట్టింది. భారత…