Movie News

ఆర్థిక చిక్కుల్లో సమంత వెబ్ సిరీస్ ?

రెండేళ్ల క్రితం ఖుషి చేసిన తర్వాత మళ్ళీ స్క్రీన్ మీద సమంత దర్శనం జరగలేదు. ఆఫర్లు వస్తున్నాయి కానీ కథలు వినడం దగ్గరే ఆగిపోతోంది. స్వంత ప్రొడక్షన్ లో మా ఇంటి బంగారం ప్రకటించిన సామ్ అది ఏ దశలో ఉందో ఎలాంటి అప్డేట్స్ ఇవ్వకుండా దాచి పెడుతోంది. ఇటీవలే వచ్చిన అమెజాన్ ప్రైమ్ వెబ్ సిరీస్ సిటాడెల్ హానీ బన్నీకి ఫ్యామిలీ మ్యాన్ రేంజ్ లో స్పందన రాకపోవడం కొంత నిరాశ పరిచినా ప్రస్తుతం నిర్మాణంలో ఉన్న మరో సిరీస్ రక్త్ భ్రమండ్ మీద భారీ అంచనాలు నెలకొన్నాయి. తుంబాడ్ సృష్టికర్త క్రియేషన్ కావడంతో నెట్ ఫ్లిక్స్ కనివిని ఎరుగని బడ్జెట్ దీని మీద ఖర్చు పెడుతోంది.

లేటెస్ట్ ట్విస్ట్ ఏంటంటే రక్త్ భ్రమండ్ కి చిన్న బ్రేక్ పడిందట. కారణం ఆశ్చర్యం కలిగించే విధంగా ఉంది. సెప్టెంబర్ 2024 లో షూటింగ్ మొదలుపెట్టిన రక్త్ భ్రమండ్ ఇంకా కీలక దశకు చేరుకోకుండానే యాభై శాతం బడ్జెట్ ఖర్చైపోవడం చూసి టీమ్ షాక్ తిందట. కోట్ల రూపాయల స్కామ్ జరిగిందని, దాని వెనుక ఒక ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ ఉన్నాడని గుర్తించి విచారణ చేసే పనిలో పడింది. నెట్ ఫ్లిక్స్, డి2ఆర్ సంయుక్త నిర్మాణంలో రూపొందుతున్న ఈ హారర్ ఫాంటసీ ఇప్పటిదాకా కేవలం 26 రోజులు మాత్రమే చిత్రీకరణ జరుపుకుంది. ఇంకా బోలెడు బాలన్స్ ఉంది. ఆడిటింగ్ లో పైన చెప్పిన గుట్టు బయటపడిందని ముంబై టాక్.

ఈ సిరీస్ ని రాజ్ అండ్ డీకే పర్యవేక్షిస్తున్నారు. దర్శకుడు రహి అనిల్ బర్వే సెట్స్ లో అప్పటికప్పుడు చేస్తున్న మార్పులు చేర్పుల వల్ల కూడా నిర్మాణ వ్యయం పెరుగుతోందట. ఎంత ఖర్చు పెట్టడానికైనా నెట్ ఫ్లిక్స్ సిద్ధంగా ఉన్నప్పటికీ కనిపించని స్థాయిలో దుబారా అయ్యిందని యూనిట్ గుసగుస. త్వరగానే స్కామ్ ని గుర్తించడంతో ప్రస్తుతం దిద్దుబాటు చర్యలు మొదలుపెట్టారు. ఆదిత్య రాయ్ కపూర్, వామిక గబ్బి, అలీ ఫజల్ తదితరులు నటిస్తున్న రక్త్ భ్రమండ్ లో ఇప్పటిదాకా ఓటిటి స్క్రీన్ మీద రాని బ్యాక్ డ్రాప్ ఉంటుందట. తుంబాడ్ డైరెక్టర్ కావడంతో ట్రెండ్ సెట్టర్ అవుతుందనే రేంజ్ లో అంచనాలు నెలకొన్నాయి.

This post was last modified on February 18, 2025 10:08 am

Share

Recent Posts

రోమియో ఫిక్సయ్యాడు… ఓజి లేటవుతాడు

నాని ది ప్యారడైజ్ షూటింగ్ చివరి ఘట్టానికి వచ్చేసింది. ఇంకో వారం పది రోజుల్లో గుమ్మడికాయ కొట్టేలా ఉన్నారు. కీర్తి…

2 hours ago

ఉత్త‌రాదిన మోడీ ఇమేజ్‌కు యూత్ చెక్ పెడుతున్నారా?

దేశ‌వ్యాప్తంగా ప్ర‌స్తుతం ఉన్న ప‌రిణామాల‌ను గ‌మ‌నిస్తే.. ఉత్త‌రాది రాష్ట్రాల్లో ప్ర‌ధాన మంత్రి న‌రేంద్ర మోడీ ఇమేజ్‌కు యువ‌త పెద్ద ఎత్తున…

2 hours ago

మంగాపురం కుర్రాడికి మంగళవారం పాఠం

సూపర్ స్టార్ కృష్ణ మనవడు జయకృష్ణ డెబ్యూ ఫలితం తేలిపోయింది. కుర్రాడి నటనకు కాసిన్ని ప్రశంసలు దక్కినప్పటికీ కంటెంట్ పరంగా…

3 hours ago

అప్పుడు ఒప్పు.. ఇప్పుడు తప్పు.. ఇదేం న్యాయం జగన్?

త్వ‌ర‌లోనే ఏపీలో స్థానిక సంస్థ‌ల ఎన్నిక‌ల‌కు తెర‌దీయ‌నున్నారు. సెప్టెంబ‌రు-అక్టోబ‌రు మ‌ధ్య మునిసిపాలిటీ… న‌వంబ‌రు-డిసెంబ‌రు మ‌ధ్య కార్పోరేష‌న్లు, జ‌న‌వ‌రిలో పంచాయ‌తీ ఎన్నిక‌లు…

3 hours ago

సెలెక్టర్లకు షమీ కనపడడం లేదా?

శ్రీలంకతో జరగబోయే రెండు టెస్టుల సిరీస్ నుంచి బుమ్రా గాయం కారణంగా తప్పుకున్నాడు. అయితే అతని స్థానంలో సీనియర్ బౌలర్…

4 hours ago

మార్క్ మామా… మోదీజీకి సారీ చెప్పాల్సిందే

ప్రధాని నరేంద్ర మోదీ వీడియోను ఫేస్‌బుక్ నుంచి తొలగించిన వ్యవహారంపై కేంద్ర ప్రభుత్వం స్పందించింది. సోషల్ మీడియా దిగ్గజం మెటా…

5 hours ago