టాలీవుడ్ డార్లింగ్ ప్రభాస్ కు శ్రీకాళహస్తిలోని శ్రీ మక్కంటి ఆలయ బ్రహ్మోత్సవాల ఆహ్వానం అందింది. ముక్కంటి ఆలయంలో ఏటా మహా శివరాత్రి సందర్భంగా బ్రహ్మోత్సవాలు వేడుకగా జరుగుతున్న సంగతి తెలిసిందే.
ఏపీలో టీడీపీ నేతృత్వంలోని కూటమి అధికారం చేపట్టిన తర్వాత తొలిసారి జరుగుతున్న బ్రహ్మోత్సవాలను ఘనంగా నిర్వహించేందుకు స్థానిక ఎమ్మెల్యే, టీడీపీ యువ నేత బొజ్జల సుధీర్ రెడ్డి నిర్ణయించుకున్నారు. ఈ క్రమంలోనే ఆయన కాళహస్తి బ్రహ్మోత్సవాల ఆహ్వాన పత్రికలను చేతబట్టుకుని ప్రముఖులను ఆహ్వానిస్తూ సాగుతున్నారు.
ఇప్పటికే ఏపీ సీఎం నారా చంద్రబాబునాయుడు, మంత్రి నారా లోకేశ్ లతో పాటుగా తెలంగాణ సీఎం ఎనుముల రేవంత్ రెడ్డి, లోక్ సభ స్పీకర్ ఓం బిర్లా, కేంద్ర మంత్రులు కింజరాపు రామ్మోహన్ నాయుడు, నితిన్ గడ్కరీ, పీయూష్ గోయల్, మాజీ ప్రధాని హెచ్ డీ దేవేగౌడ, హందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ, ఏపీ ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్…
తదితర కీలక రాజకీయ నేతలను కలిసిన సుధీర్ రెడ్డి… బ్రహ్మోత్సవాలకు హాజరు కావాలంటూ ఆహ్వానం పలికారు. సుధీర్ రెడ్డి ఆహ్వానం పలికిన వారిలో తమిళనాడు సీఎం ఎంకే స్టాలిన్ కూడా ఉన్నారు.
పనిలో పనిగా రాజకీయ నేతలను ఆహ్వానిస్తూ సాగుతున్న సుధీర్ రెడ్డి… సినీ ప్రముఖులను కూడా ఆహ్వానిస్తున్నారు. ఈ క్రమంలో ఇప్పటికే నందమూరి బాలకృష్ణ, మెగాస్టార్ చిరంజీవికి సుధీర్ రెడ్డి ముక్కంటీశుడి ఆహ్వానాన్ని అందజేశారు.
స్వామి వారి బ్రహ్మోత్సవాలకు హాజరు కావాలని చిరును ఆయన కోరారు. అనంతరం టాలీవుడ్ యంగ్ హీరో నితిన్ కూ ఆయన ఆహ్వానాన్ని అందించారు. ఈ క్రమంలోనే ఆదివారం సాయంత్రం ప్రభాస్ ను కలిసిన సుధీర్ రెడ్డి… శ్రీకాళహస్తి బ్రహ్మోత్సవాలకు హాజరు కావాలని కోరారు.
This post was last modified on February 16, 2025 9:36 pm
ఏపీలో బీజేపీ-టీడీపీ-జనసేన పొత్తు పెట్టుకుని గత 2024 ఎన్నికల్లో అధికారంలోకి వచ్చిన విషయం తెలిసిందే. ఇప్పటికి 17 మాసాలుగా ఈ…
తెలుగు ప్రేక్షకులకు ఎంతో ఇష్టమైన తమిళ స్టార్ ద్వయం సూర్య, కార్తి చాలా ఏళ్లుగా పెద్ద కమర్షియల్ హిట్ లేక…
భారత ఆర్థిక వ్యవస్థను ప్రభావితం చేసేది.. `రూపాయి మారకం విలువ`. ప్రపంచ దేశాలన్నీ దాదాపు అమెరికా డాలరుతోనే తమతమ కరెన్సీ…
తిరుమలలో పరకామణి చోరీ వ్యవహారంపై రెండు రోజుల కిందట ప్రెస్ మీట్ లో మాజీ సీఎం జగన్ చేసిన వ్యాఖ్యలు…
ఎనభై తొంబై దశకంలో సినిమాలు చూసినవాళ్లకు బాగా పరిచయమున్న పేరు నందమూరి కళ్యాణ చక్రవర్తి. స్వర్గీయ ఎన్టీఆర్ సోదరుడు త్రివిక్రమరావు…
శుక్రవారం ఏదైనా థియేటర్ రిలీజ్ మిస్ అయితే మూవీ లవర్స్ బాధ పడకుండా ఓటిటిలు ఆ లోటు తీరుస్తున్నాయి. ఇంకా…