టాలీవుడ్ సెన్సేషన్ శ్రీలీల బాలీవుడ్ లో అడుగు పెట్టడం నిన్న అఫీషియలైన సంగతి తెలిసిందే. కార్తీక్ ఆర్యన్ సరసన నటించిన టైటిల్ పెట్టని సినిమా టీజర్ నిన్న రిలీజ్ చేశారు. గాయకుడి ప్రేమలో పడ్డ అమ్మాయిగా శ్రీలీలకు పెద్ద స్కోప్ దొరికినట్టు ఉంది. అయితే ఇలాంటి తెరంగేట్రంకి ఆఫర్లు దక్కించుకోవడంలో విశేషం లేదు కానీ సరైన దర్శకుడి చేతిలో పడితే చాలా ప్రయోజనాలు ఉంటాయి.
అనురాగ్ బసు అలాంటి వ్యక్తే. 2003లో ఇండస్ట్రీకి వచ్చిన ఆయన డెబ్యూ సాయతో అంతగా మెప్పించలేదు లేదు రెండో సినిమా మర్డర్ తో బోల్డ్, క్రైమ్ రెండు మిక్స్ చేసి సూపర్ హిట్ కొట్టడం అప్పట్లో సంచలనం.
ఇమ్రాన్ హష్మీకి స్టార్ ఇమేజ్ తీసుకొచ్చింది ఇదే. గ్యాంగ్ స్టర్ కూడా ఇదే స్థాయిలో ఆడింది. లైఫ్ ఇన్ ఏ మెట్రో విమర్శకుల ప్రశంసలు అందుకుంది. హృతిక్ రోషన్ కైట్స్ డిజాస్టరైనా బర్ఫీ పేరు తీసుకొచ్చింది. రన్బీర్ కపూర్ లోని బెస్ట్ యాక్టర్ ని చూపించడమే కాక టాలీవుడ్ టాప్ ప్లేస్ లో ఉన్న ఇలియానాకు గొప్ప రోల్ ఇచ్చింది.
జగ్గా జాసూస్ పర్వాలేదనిపించుకుంది. చాలా గ్యాప్ తీసుకున్న అనురాగ్ బసు ఆ మధ్య నెట్ ఫ్లిక్స్ ఓటిటి మూవీ లూడోతో రీ ఎంట్రీ ఇచ్చారు. మెట్రో ఇన్ డైనో ఇంకా రిలీజ్ కాలేదు. ప్రస్తుతం కార్తీక్ ఆర్యన్ తో చేస్తున్నది ఆషీకీ 3 అనే టాక్ ఉంది కానీ నిర్మాతలు మాత్రం కాదంటున్నారు.
ఇక్కడ శ్రీలీలకు సరైన దర్శకుడు దొరికాడని చెప్పడానికి రీజన్ ఉంది. అనురాగ్ బసు సినిమాల్లో హీరోయిన్ కి చాలా ప్రాధాన్యం ఉంటుంది. కంగనా రౌనత్, మల్లికా శెరావత్ లు స్టార్ డం చూశారంటే దానికాయనే మూలం. ఏదో మొక్కుబడిగా డాన్సులు, లవ్ ట్రాక్స్ కోసం కథానాయకలను తీసుకోరు.
శ్రీలీలకు సైతం అలాంటి ఛాలెంజింగ్ రోల్ దక్కిందని ముంబై టాక్. కాకపోతే ఒకప్పటి మర్డర్ లాగా రొమాన్స్ ఎక్కువగా చూపిస్తారా లేక బర్ఫీలా ఎమోషనల్ జర్నీ చేయిస్తారా అనేది వేచి చూడాలి. ఈ సంవత్సరం దీపావళికి విడుదల కాబోతున్న ఈ లవ్ ఎంటర్ టైనర్ షూటింగ్ ని వేసవిలోగానే పూర్తి చేస్తారని బాలీవుడ్ రిపోర్ట్.
This post was last modified on February 16, 2025 5:47 pm
భర్త మహాశయులకు విజ్ఞప్తి ప్రీ రిలీజ్ ఈవెంట్ లో గెస్టుగా వచ్చిన దర్శకుడు బాబీ మాట్లాడుతూ రవితేజ రొటీన్ సినిమాలు…
వైసీపీ అధినేత జగన్పై ఏపీ సీఎం చంద్రబాబు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. అమరావతిపై జగన్ రెండు రోజుల కిందట…
తెలంగాణలో త్వరలో జరగనున్న మునిసిపల్ ఎన్నికల్లో జనసేన పార్టీ పోటీ చేయనున్నట్లు ఆ పార్టీ అధికారికంగా ప్రకటించింది.“త్వరలో జరగనున్న తెలంగాణ…
సినిమాల మీద మీమ్స్ క్రియేట్ చేయడంలో తెలుగు వాళ్లను మించిన వాళ్లు ఇంకెవ్వరూ ఉండరంటే అతిశయోక్తి కాదు. కొన్ని మీమ్స్…
అమరావతిని ఉద్దేశించి వైఎస్ జగన్ చేసిన వ్యాఖ్యలు రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర రాజకీయ దుమారాన్ని రేపాయి. రాజధానిని సో-కాల్డ్ నగరంగా అభివర్ణిస్తూ,…
సంక్రాంతి పండుగ వచ్చిందంటే చాలు…చిన్నా పెద్దా అని తేడా లేకుండా పతంగులు ఎగరేస్తుంటారు. పండుగ పూట కుటుంబ సభ్యులు, మిత్రులతో…