సంక్రాంతి సందర్భంగా రెండు మూడు వారాలు టాలీవుడ్ బాక్సాఫీస్ కళకళలాడింది. కానీ నెలాఖరు నుంచి జోరు తగ్గింది. అంతలో ఫిబ్రవరి తొలి వారంలో ‘తండేల్’ సినిమా వచ్చింది. మళ్లీ బాక్సాఫీస్ పుంజుకుంది. వీకెండ్లో ఆ చిత్రం మంచి వసూళ్లు సాధించింది. కానీ వారాంతం తర్వాత ‘తండేల్’ సైతం డల్ అయింది. పోస్ట్ రిలీజ్ ప్రమోషన్లు బాగానే చేసినా సరే.. ‘తండేల్’ సోమవారం వసూళ్లు బాగా డ్రాప్ అయ్యాయి.
వీకెండ్ తర్వాత డ్రాప్ మామూలే కానీ.. రోజులు గడిచేకొద్దీ వసూళ్లు తగ్గుతూ వస్తున్నాయి. ఐతే మళ్లీ వీకెండ్ వస్తోంది కాబట్టి బాక్సాఫీస్ పుంజుకుంటుందని అనుకున్నారు. కానీ ఈ వారం వచ్చిన కొత్త చిత్రాలేవీ ప్రేక్షకుల దృష్టిని ఆకర్షించలేకపోతున్నాయి. ‘లైలా’ డిజాస్టర్ టాక్ తెచ్చుకుంది. దానికి సరైన ఓపెనింగ్స్ కూడా లేవు. దీంతో పోలిస్తే ‘బ్రహ్మానందం’ సినిమా బెటర్ అనే టాక్ వచ్చింది కానీ.. దానికి ఓపెనింగ్స్ లేవు.
‘తండేల్’ ఈ అడ్వాంటేజీని ఏమేర ఉపయోగించుకుంటుందన్నది చూడాలి. శుక్రవారం అయితే ఈ సినిమాకు కూడా వసూళ్లు గొప్పగా ఏమీ లేవు. కొత్త చిత్రాలతో సమానంగా ఆక్యుపెన్సీలు కనిపించాయి. థియేటర్లలో ఉన్న కొత్త చిత్రాలతో పోలిస్తే.. వేలంటైన్స్ డే వీకెండ్‌ను పురస్కరించుకుని చేసిన రీ రిలీజ్‌ల పనే బాగుంది. ‘ఇట్స్ కాంప్లికేటెడ్’గా వచ్చిన సిద్ధు జొన్నలగడ్డ చిత్రం ‘కృష్ణ అండ్ హిజ్ లీల’ బాగా పెర్ఫామ్ చేస్తోంది.
అలాగే రామ్ చరణ్ లవ్ స్టోరీ ‘ఆరెంజ్’ కూడా థియేటర్లలో కళకళలాడిస్తోంది. ఈ రెండు చిత్రాలకు వీకెండ్ బుకింగ్స్ కూడా బాగున్నాయి. ఇంకా కొన్ని లవ్ స్టోరీలేవో రీ రిలీజ్ అయ్యాయి. వాటికి స్పందన అంతగా లేదు. మొత్తంగా చూస్తే వేలంటైన్స్ డే వీకెండ్లో కొత్త చిత్రాల పరిస్థితి మాత్రం ఆశాజనకంగా లేవు. వచ్చే వారం కూడా చెప్పుకోదగ్గ రిలీజ్‌లు లేవు కాబట్టి బాక్సాఫీస్ స్లంప్ కొనసాగబోతోంది. నెలాఖర్లో ‘మజాకా’ వస్తే మళ్లీ కొంచెం సందడి చూడొచ్చేమో.
This post was last modified on February 15, 2025 6:58 pm
మొన్న అక్టోబర్ రెండు గాంధీ జయంతికి చాలా సినిమాలొచ్చాయి. వాటిలో తమిళ డబ్బింగ్ డోరతీ కూడా ఉంది. సున్నితమైన అంశం…
నిన్న రాత్రంతా ప్రచారం జరిగినట్టే ఆదర్శ కుటుంబం ఏకె 47 వాయిదా అఫీషియలయ్యింది. నిర్మాత నాగవంశీ ప్రెస్ మీట్ పెట్టి…
జయలలిత, కరుణానిధి ఒకరి తర్వాత ఒకరు మరణించడంతో తమిళ రాజకీయాల్లో చాలా ఏళ్ల కిందటే ఒక పెద్ద ఖాళీ ఏర్పడింది.…
ఈ మధ్య సినిమాల్లో ఛార్ట్ బస్టర్ సాంగ్స్ కు కరువొచ్చి పడింది. ఆల్బమ్ మొత్తంలో ఒకటి రెండు పాటలు బాగుంటే…
కేంద్ర ఎన్నికల సంఘం కమిషనర్ జ్ఞానేష్ కుమార్‌ను ఉద్దేశించి సుప్రీంకోర్టు హెచ్చరిక చేసింది. ఆయన తప్పు చేసినట్టు నిరూపితమైతే.. కచ్చితంగా…
తిరువూరు ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాస రావు నిత్యం వివాదాల్లో ఉంటున్న సంగతి తెలిసిందే. అమరావతి రైతు ఉద్యమం ద్వారా వెలుగులోకి…