రెండు దశాబ్దాల తర్వాత ఒక ఇండస్ట్రీ హిట్టుకి సీక్వెల్ తీస్తే అది బ్లాక్ బస్టర్ కావడం అరుదు. కానీ గదర్ 2 ఆ ఘనత సాధించింది. షెడ్డుకి వెళ్లిపోయాడని భావించిన సీనియర్ హీరో సన్నీడియోల్ ని ఒక్కసారిగా ఫామ్ లోకి తీసుకొచ్చి అవకాశాలను పెంచింది. దెబ్బకు బోర్డర్ 2, జాత్ లాంటివి ఆఘమేఘాల మీద తెరకెక్కుతున్నాయి.
ఆయన మీద కనీసం రెండు నుంచి మూడు వందల కోట్ల దాకా బడ్జెట్ లు పెట్టేందుకు నిర్మాతలు రెడీగా ఉన్నారంటే అర్థం చేసుకోవచ్చు రేంజ్ ఏ స్థాయిలో ఉందో. ఈయనిలా హ్యాపీగా ఉండగా దర్శకుడు అనిల్ శర్మ, హీరోయిన్ అమీషా పటేల్ పరస్పరం గొడవ పడుతూ రచ్చ చేస్తున్నారు.
అసలేం జరిగిందో చూద్దాం. గదర్ 2 స్టోరీ నెరేషన్ కు వెళ్ళినప్పుడు అనిల్ శర్మ చెప్పిన కథ ప్రకారం క్లైమాక్స్ లో విలన్ పాత్రను అమీషా పటేల్ చంపుతుంది. కీలక మలుపు కదానే సంతోషంతో ఆమె ఒప్పేసుకుంది. తీరా సెట్స్ లోకి అడుగుపెట్టాక అసలు ఆమె క్యారెక్టరే పాకిస్థాన్ వెళ్లే అవసరం లేకుండా మార్చేశారు.
సన్నీ డియోల్ కాకుండా ఆయన కొడుకుగా నటించిన ఉత్కర్ష్ శర్మ ప్రతినాయకుడిని చంపేలా చిత్రీకరించారు. ఎందుకయ్యా అంటే సదరు ఉత్కర్ష్ స్వయానా డైరెక్టర్ సాబ్ గారి కొడుకు కాబట్టి. ఇదంతా అమీషా పటేల్ ఇటీవలే ఒక ఇంటర్వ్యూలో పంచుకోవడంతో కాంట్రావర్సి బయటికి వచ్చింది. ఇక్కడితో అయిపోలేదు.
స్క్రిప్ట్ వినకుండా సంతకం చేయలేదు కదా అంటూ అనిల్ శర్మ రివర్స్ కౌంటర్ వేయడం బాలీవుడ్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. దానికి అమీషా పటేల్ ధీటుగా బదులు చెబుతూ ఆయన నెరేషన్ చేస్తున్న వీడియోని సోషల్ మీడియాలో పెట్టేసింది. ఇప్పుడు సమాధానం చెప్పమంటూ చిక్కుముడి వేసింది.
అయినా ముందు అనుకున్న కథకు తర్వాత మార్పులు చేర్పులు చేయడం చాలా సినిమాలకు జరిగేదే. గదర్ 2 మినహాయింపు కాదు. కాకపోతే అనిల్ శర్మ ఔను అవసరాన్ని బట్టి ఛేంజ్ చేశానని చెబితే సరిపోయేదానికి అవసరం లేకుండా కవరింగ్ చేసే ప్రయత్నం చేయడంతో వ్యవహారం రచ్చకెక్కింది.
This post was last modified on February 14, 2025 2:41 pm
కన్నడ కి అతి దగ్గర గా ఉండే లిపి తెలుగే. బళ్లారి ఆంధ్ర సరిహద్దు పట్టణం తెలుగు కూడా మాట్లాడుతారు.…
వెల్లులి బెట్టి పొగిచిన పుల్లని గోంగూర రుచిని బొగడగ వశమా? అంటూ గోంగూర రుచిని పొగిడారో తెలుగు కవి. గోంగూరకు…
ఏడు పదుల వయసులో రకరకాల పాత్రలు చేస్తూ తనకు తాను ఛాలెంజ్ విసురుకుంటున్న మలయాళం స్టార్ మమ్ముట్టి కొత్త సినిమా…
ఒకరికి శాపం మరొకరికి వరం అయ్యిందన్న తరహాలో అఖండ 2 వాయిదా బాలీవుడ్ మూవీ దురంధర్ కు భలే కలిసి…
బాలయ్య కెరీర్ లోనే మొదటిసారి ఇలాంటి పరిస్థితి చూస్తున్నామా అన్నట్టుగా అఖండ 2 తాలూకు పరిణామాలు ఫ్యాన్స్ ని బాగా…
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(ఏఐ)లో ఏపీ దూకుడుగా ఉందని కేంద్ర ప్రభుత్వం తెలిపింది. ఏఐ ఆధారిత ఉత్పత్తులు, వృద్ధి వంటి అంశాల్లో ఏపీ…