పదిహేడు నిమిషాల ఫుటేజీ మాత్రమే వున్న నర్తనశాల చిత్రాన్ని అలా అసంపూర్ణంగానే విడుదల చేస్తున్నారు. ఏటిటి ద్వారా నచ్చిన వాళ్లే ఈ సినిమా చూస్తారని ఆశిస్తున్నారు. చారిటీకి ఈ డబ్బులిస్తామని చెప్పడం వల్ల అసంపూర్ణ సినిమా విడుదల చేస్తున్నారనే నిందలేమీ పడడం లేదు. కాకపోతే పైరసీ తాకిడి వుంటుంది కనుక ఇది ఎంతవరకు పే చేస్తుందనేది రిలీజ్ అయ్యాక కానీ తెలీదు.
ఇదిలావుంటే ఈ సినిమాను ఇలా అసంపూర్ణంగా విడుదల చేస్తుండడంతో చాలా ఏళ్ల క్రితం చిరంజీవి హీరోగా మొదలైన భారీ చిత్రం ‘అబు: బాగ్దాద్ గజదొంగ’ చిత్రం ఫుటేజీని కూడా విడుదల చేయాలనే డిమాండ్లు పెరుగుతున్నాయి. అప్పట్లో బడ్జెట్ పెరిగిపోవడం, ముస్లిమ్ నేతల నుంచి తిరుగుబాటు రావడంతో ఆ సినిమా కొంత షూటింగ్ చేసి ఆపేసారు. దాంతో చిరంజీవిని అలా చూడాలనే అభిమానుల కోరిక మాత్రం అలా మిగిలిపోయింది.
నర్తనశాల ఇలా వస్తోంది కనుక అబు కూడా వస్తే చూడాలని వుందని అభిమానులు అంటున్నారు. నర్తనశాల అంటే బాలకృష్ణ సొంత ప్రాజెక్ట్ కనుక ఆ ఫుటేజీ భద్రపరచుకున్నారు. మరి అబుకి సంబంధించిన ఫుటేజీ ఎవరైనా జాగ్రత్తగా పెట్టారో లేదో? ఏదేమైనా నర్తనశాల కారణంగా అబు సినిమాని ఫాన్స్ మళ్లీ గుర్తు చేసుకుంటున్నారు.
This post was last modified on October 21, 2020 11:05 pm
మహారాష్ట్ర ఎన్నికల ఫలితాలలో కాంగ్రెస్, శివసేన(యూబీటీ), ఎన్సీపీ(ఎస్పీ)ల మహా వికాస్ అఘాడీ ఘోర పరాజయం సంగతి తెలిసిందే. మహారాష్ట్ర ఎన్నికల్లో…
దేశవ్యాప్త సినీ ప్రియులకు పరిచయం అక్కర్లేని పేరు మణిరత్నం. మౌనరాగం, నాయకుడు, గీతాంజలి, ఘర్షణ, రోజా, బొంబాయి లాంటి ఎన్నో…
2011 లో కెరటం చిత్రంతో తెలుగు సినీ ఇండస్ట్రీలో ఎంటర్ అయిన రకుల్ చాలా తక్కువ కాలంలోనే స్టార్ హీరోయిన్…
ఒక గెలుపు పార్టీకి ఎంతో బలాన్నిస్తుంది. ఈ విషయంలో సందేహం లేదు. అయితే.. మహారాష్ట్రలో బీజేపీ దక్కించుకున్న సీట్లు, ఈ…
ఎప్పుడూ చూసే వ్యవహారమే అయినా మెకానిక్ రాకీ విషయంలో విశ్వక్ సేన్ చూపించిన కాన్ఫిడెన్స్ సినిమా నిజంగా బాగుందేమోననే అంచనాలు…