హీరో రామ్ చరణ్, నిర్మాత నాగబాబు కెరీర్లలో అత్యంత పెద్ద ఫ్లాప్ ఏదంటే ఠక్కున గుర్తొచ్చే పేరు ఆరెంజ్. మగధీర లాంటి ఇండస్ట్రీ హిట్ తర్వాత ఇంత ఓవర్ లవ్ స్టోరీలో మెగా పవర్ స్టార్ ని ప్రేక్షకులు చూడలేకపోయారు. కానీ హరీష్ జైరాజ్ అందించిన పాటలు ఎవర్ గ్రీన్ గా నిలిచిపోయాయి.
కమర్షియల్ గా అప్పట్లో ఫెయిల్యూర్ కావొచ్చు కానీ ఆడియో పరంగా మాత్రం క్యాసెట్లు, సిడిలు భారీగా అమ్ముడుపోయాయి. క్రమంగా ఆరెంజ్ జనాలకు అర్థం కావడం మొదలయ్యింది. అప్పట్లో థియేటర్ ఎక్స్ పీరియన్స్ మిస్ అయిన వాళ్ళు ఇప్పుడు ఎంజాయ్ చేస్తున్నారు. గత ఏడాది రీ రిలీజ్ కి ఇది కనిపించింది.
తాజాగా ప్రేమికుల రోజు సందర్భంగా ఆరెంజ్ మళ్ళీ రీ రిలీజయ్యింది. మొదటి షో పడక ముందే సుమారు 40 వేలకు పైగా టికెట్లు అడ్వాన్స్ బుకింగ్ లో అమ్ముడుపోయాయి. ముఖ్యంగా హైదరాబాద్, బెంగళూరు లాంటి నగరాల్లో ఉదయం ఏడెనిమిది గంటల ఆటకే యూత్ పోటెత్తున్న వైనం కనిపిస్తోంది.
ఇది ఈ ఒక్క రోజుకే పరిమితం కావొచ్చు లేదా కంటిన్యూ అవ్వొచ్చు. అది కాదు అసలు మ్యాటర్. ఏడాది తిరక్కుండానే మళ్ళీ రీ రిలీజ్ చేస్తే ఇప్పుడున్న టికెట్ రేట్లకే ఇంకోసారి చూసేందుకు ఫ్యాన్స్ పరుగులు పెట్టడం. విచిత్రంగా లైలా, బ్రహ్మ ఆనందం కన్నా ఆరెంజ్ అమ్మకాలే బాగుండటం ట్రేడ్ ని నివ్వెరపరుస్తున్న అంశం.
చూస్తుంటే ప్రతి సంవత్సరం ఆరెంజ్ ఏదో ఒక సందర్భంలో రిపీట్ రన్ కు వచ్చేలా ఉంది. నాగబాబు మాత్రం ఈ పరిణామాలు చూస్తూ షాక్ అవుతూ ఉంటారు. ఆ మధ్య ఓసారి దీని గురించి అడిగితే ఇలా చూసేదేదో అప్పుడే చేసి ఉంటే తనకు నష్టాలు తప్పేవని నవ్వుతు చెప్పడం అభిమానులకు గుర్తే.
బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వం వహించిన ఆరెంజ్ లో జెనీలియా హీరోయిన్ గా నటించింది. గత నెల గేమ్ ఛేంజర్ గాయాన్ని బాగా ఫీలైన మెగా ఫాన్స్ ఇప్పుడీ ఆరెంజ్ రూపంలో కొంత స్వాంతన పొందుతున్నారనుకోవాలి. అందరికంటే ఎక్కువ క్రెడిట్ ముందు అద్భుతమైన పాటలు ఇచ్చినందుకు హరీష్ జైరాజ్ కే ఇవ్వాలి.
This post was last modified on February 14, 2025 12:47 pm
జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ చేపట్టిన ధర్మ పరిరక్షణ యాత్ర శనివారం పూర్తి అయ్యింది. మూడు…
వైసీపీ కీలక నేత, గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ మోహన్ అరెస్టుపై టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఏపీ…
మావయ్యలంటే విపరీతమైన ప్రాణం, అభిమానం చూపించే సాయి ధరమ్ తేజ్ వాళ్ళ పక్కన నటించే ఛాన్స్ కోసం కెరీర్ మొదలైనప్పటి…
స్టార్ హీరో ఉంటే చాలు కంటెంట్ అటుఇటు ఉన్నా జనం ఎగబడి చూస్తారనే భ్రమలు ఇప్పుడు లేవు. ఏ మాత్రం…
సోషల్ మీడియా అన్నది రెండు వైపులా పదునున్న కత్తి. దీని వల్ల సినిమాల ప్రచారం కొత్త పుంతలు తొక్కుతోంది. సినిమాల…
కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీతో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి భేటీ అయ్యారు. పార్టీ అధిష్ఠానం పిలుపు మేరకు…