నందమూరి బాలకృష్ణ రెండు రోజుల కిందట పెద్ద సర్‌ప్రైజే ఇచ్చారు. దాదాపు రెండు దశాబ్దాల కిందట తన తండ్రి ఎన్టీ రామారావు నటించిన లెజెండరీ మూవీ ‘నర్తనశాల’ను రీమేక్ చేయడానికి సంకల్పించిన సంగతి తెలిసిందే. సౌందర్య ద్రౌపది పాత్రలో నటించిన ఈ సినిమా కోసం కొన్ని సన్నివేశాలు చిత్రీకరించారు. అంతలో సౌందర్య చనిపోవడంతో ఈ సినిమాను బాలయ్య ఆపేశాడు. ఈ సినిమాను ఆ తర్వాత పున:ప్రారంభించలేదు.
ఐతే అప్పుడు చిత్రీకరించిన సన్నివేశాలన్నింటినీ ఎడిట్ చేసి ఒక కొలిక్కి తీస్తే 17 నిమిషాల నిడివి తేలింది. ఇప్పుడు దాన్ని ఒక మినీ మూవీగా ప్రేక్షకుల ముందుకు తేవాలని బాలయ్య సంకల్పించాడు. శ్రేయాస్ ఏటీటీ ద్వారా దసరా కానుకగా ఈ నెల 24న బాలయ్య ‘నర్తనశాల’ విడుదల కాబోతోంది.
ఈ షార్ట్ మూవీని చూసేందుకు ప్రేక్షకులు టికెట్ కొనాల్సి ఉంటుందని, తద్వారా వచ్చే ఆదాయంలో కొంత భాగం ఛారిటీకి ఉపయోగిస్తామని బాలయ్య ఇంతకుముందే వెల్లడించిన సంగతి తెలిసిందే. ఐతే 17 నిమిషాల నిడివి చూసేందుకు మరీ ఎక్కువ రేటు పెట్టడం సమంజసం కాదని బాలయ్య భావించినట్లున్నాడు. అందుకే ఈ ధరను రూ.50కి పరిమితం చేశాడు. ఈ రేటుతోనే ముందే టికెట్ బుక్ చేసుకునే అవకాశం కల్పించారు.
ఇలా ఏటీటీలో సినిమాలు రిలీజ్ చేసే ఒరవడికి శ్రీకారం చుట్టిన రామ్ గోపాల్ వర్మ.. తన సినిమాలకు రూ.100, 150, 200 చొప్పున వసూలు చేసిన సంగతి తెలిసిందే. ఆయనేమీ రెండు రెండున్నర గంటల్లో ఫీచర్ పిలిమ్స్ తీయలేదు. అరగంట లోపు నిడివే అలా డబ్బులు వసూలు చేశారు. దాంతో పోలిస్తే బాలయ్య ఉదారంగా వ్యవహరించినట్లే. ఐతే ఇలా ఏటీటీలో రిలీజైన కంటెంట్ ఈజీగా పైరేట్ అయి ఇంటర్నెట్లోకి వచ్చేస్తున్న నేపథ్యంలో బాలయ్య ‘నర్తనశాల’ను ఎంతమంది డబ్బులు పెట్టి చూస్తారన్నది ఆసక్తికరం.
This post was last modified on October 21, 2020 5:37 pm
రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ భారత పర్యటనలో భాగంగా ఢిల్లీలోని 'హైదరాబాద్ హౌస్'లో బస చేయడం ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.…
రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ తన పర్యటనల్లో అధికారులు పుష్పగుచ్ఛాలు ఇవ్వడం, శాలువాలు వేయడం లాంటివి వద్దని సున్నితంగా…
బడ్జెట్ రెండు వందల ఎనభై కోట్ల పైమాటే. అదిరిపోయే బాలీవుడ్ క్యాస్టింగ్ ఉంది. యాక్షన్ విజువల్స్ చూస్తే మైండ్ బ్లోయింగ్…
చిన్నదా..పెద్దదా..అన్న విషయం పక్కనబెడితే..దొంగతనం అనేది నేరమే. ఆ నేరం చేసిన వారికి తగిన శిక్ష పడాలని కోరుకోవడం సహజం. కానీ,…
2024 సార్వత్రిక ఎన్నికల్లో టీడీపీ నేతృత్వంలోని ఎన్డీఏ కూటమి ప్రభుత్వం అఖండ విజయం సాధించిన సంగతి తెలిసిందే. టీడీపీ, జనసేన,…
ఊహించని షాక్ తగిలింది. ఇంకో రెండు గంటల్లో అఖండ 2 తాండవంని వెండితెరపై చూడబోతున్నామన్న ఆనందంలో ఉన్న నందమూరి అభిమానుల…