ఎంత టాలెంట్ ఉన్నా ఇండస్ట్రీలో ఒక్కోసారి అవకాశాలు అంత వేగంగా రావు. హిట్టు పడినా సరే కొన్నిసార్లు దురదృష్టం పలకరించి ఆఫర్ల కోసం ఎదురు చూడాల్సి వస్తుంది. నటుడు, కమెడియన్ రఘుబాబు దీనికో మంచి ఉదాహరణగా నిలుస్తారు. 2005లో అల్లు అర్జున్ హీరోగా వచ్చిన బన్నీ తనకు మొదటి బ్రేక్.
కళ్ళు లేని గుడ్డి రౌడీగా తన క్యారెక్టర్ అందులో బాగా పండింది. పేరైతే వచ్చింది కానీ ఎవరూ ప్రత్యేకంగా దాని గురించి ప్రస్తావించలేదు. ఇండస్ట్రీలోనే కాదు వంద రోజుల వేడుకలోనూ తనకు అంతగా గుర్తింపు లేకపోవడం ఆయన్ను బాధించింది. సరిగ్గా అప్పుడే ముఖ్య అతిథి రూపంలో చిరంజీవి ఒక మేజిక్ చేశారు.
స్టేజి మీదకు బన్నీలో నటించినవాళ్లు, పని చేసినవాళ్లు అందరి గురించి మాట్లాడుతున్నారు కానీ రఘుబాబు ప్రస్తావన ఎవరూ తేవడం లేదు. దర్శకుడు వివి వినాయక్ సైతం ఇంత పేరు వచ్చాక కూడా ఇదేంటయ్యా ఎవరూ నీ గురించి చెప్పడం లేదంటూ ఆశ్చర్యపోయారు.
అనూహ్యంగా తన ప్రసంగంలో చిరంజీవి అదే పనిగా రఘుబాబుని గుర్తు చేసుకుని మరీ స్టేజి మీదకు పిలిచారు. భుజం మీద చెయ్యేసి చాలా బాగా చేశావని లైవ్ లో మెచ్చుకోవడమే కాక ఆ సినిమా మరోసారి చూడాలంటే నువ్వే మొదటి కారణమంటూ చెప్పడం ఒక్కసారిగా రఘుబాబుని ఎక్కడికో తీసుకెళ్ళిపోయింది.
అంత ఓపెన్ గా చిరంజీవి పొగిడేసరికి రఘుబాబుకి పాత్రలు క్యూ కట్టాయి. ఒకటి రెండు కాదు అక్కడితో మొదలుపెట్టి 400 సినిమాలకు పైగా నటిస్తూనే పోయాడు. ఎన్నో బ్లాక్ బస్టర్లు, సూపర్ హిట్లు పడ్డాయి. ఇదంతా నిన్న బ్రహ్మ ఆనందం ప్రీ రిలీజ్ ఈవెంట్ రఘుబాబే స్వయంగా పంచుకున్నారు.
1990 టైం రఘుబాబు సోదరుడు బోసుబాబు హీరోగా తండ్రి గిరిబాబు ఇంద్రజిత్ అనే కౌబాయ్ మూవీ నిర్మించారు. అదే టైంలో కొదమ సింహంతో పోటీ ఉండటం వల్ల ఇంద్రజిత్ ని కొంత ఆలస్యంగా రిలీజ్ చేశారు. ఆశించినంత రెవిన్యూ రాలేదు. దీని గురించి యాంటీ ఫ్యాన్స్ నెగటివ్ ప్రచారం చేశారు. కానీ అదే చిరంజీవి రఘుబాబుకి కెరీర్ వచ్చేలా చేయడం విధి లిఖితం.
This post was last modified on February 12, 2025 9:53 am
దక్షిణాది సంగీత దర్శకుల్లో అత్యధిక డిమాండ్ ఎంజాయ్ చేస్తున్న వాళ్లలో మొదట వినిపించే పేరు అనిరుధ్ రవిచందర్. బ్యాక్ గ్రౌండ్…
కాంగ్రెస్ అగ్రనేత, ఎంపీ రాహుల్ గాంధీపై సోషల్ మీడియాలో రకరకాల ట్రోలింగ్స్ వస్తుంటాయి. గతంలో అయితే ఆయనను పప్పు అంటూ…
తెలుగు సినిమా చరిత్రలోనే అత్యంత గొప్ప నటుడైన మోహన్ బాబును గత 20 ఏళ్లలో మన ఇండస్ట్రీ సరిగా ఉపయోగించుకోలేదనే…
సీఎం రేవంత్ రెడ్డి, మాజీ మంత్రి కేటీఆర్ ల మధ్య మరోసారి మాటల యుద్ధం మొదలైంది. కేటీఆర్ కు లగ్జరీ…
టాలీవుడ్ బిజీ హీరోల్లో ఆది సాయికుమార్ పేరు ఖచ్చితంగా ఉంటుంది. వరసగా హిట్లు లేకపోయినా అవకాశాలకు లోటు లేకుండా ఏదో…
విజయ్ సేతుపతి హీరోగా తమిళంలో బత్తా విడుదలయ్యింది. ప్రమోషన్లు జోరుగా చేశారు. తెలుగు డబ్బింగ్ చేద్దామనుకున్నారు కానీ ఎక్కువ రిలీజులు…