‘సంక్రాంతికి వస్తున్నాం’ సినిమాలో మోస్ట్ సర్ప్రైజింగ్, ఎంటర్టైనింగ్ ఫ్యాక్టర్ అంటే బుల్లిరాజు అనే పాత్రలో రేవంత్ అనే చిన్న కుర్రాడు చేసిన కామెడీనే. ఓటీటీలకు ప్రభావితం అయి తనకు కోపం తెప్పించిన వాళ్లందరి మీదా బూతుల వర్షం కురిపించే బుల్లి రాజు పాత్రలో రేవంత్ అదరగొట్టేశాడు. ఈ పాత్ర చుట్టూ అల్లిన కామెడీ విషయంలో కొన్ని అభ్యంతరాలు వ్యక్తమైనప్పటికీ.. ఆ కామెడీ అయితే సూపర్ హిట్ అయిందనడంలో సందేహం లేదు.
ఈ పాత్రతో రేవంత్‌కు వచ్చిన పాపులారిటీ కూడా అంతా ఇంతా కాదు. రిలీజ్ తర్వాత ప్రమోషన్లలో ఎక్కడ చూసినా ఆ పిల్లాడి సందడే కనిపించింది. తనను టీవీ, యూట్యూబ్ ఛానెళ్లు ఇంటర్వ్యూలు కూడా చేశాయి. ఇప్పుడు బుల్లిరాజు పాపులారిటీ ఏ స్థాయికి చేరిందంటే.. తనను వేరే సినిమాల ప్రమోషన్లకు సైతం ఉపయోగించుకుంటున్నారు. ఈ దిశగా ముందుగా విశ్వక్సేన్ రంగంలోకి దిగాడు.
విశ్వక్ హీరోగా రానున్న కొత్త చిత్రం ‘లైలా’ కోసం బుల్లిరాజును రంగంలోకి దింపారు. విశ్వక్, రేవంత్ కలిసి చిన్న ప్రమోషనల్ వీడియో చేసి సోషల్ మీడియాలో వదిలారు. లైలా ఆంటీ భలే ఉందని, ఆ అమ్మాయిని తీసుకొచ్చి తన తండ్రికి ఇంకో పెళ్లి చేసి, తనకు రెండో పిన్నిగా చేసుకోవాలని ఆమె కోసం బుల్లిరాజు వెతకడం.. ఇంతలో విశ్వక్ తారసపడితే అతణ్ని లైలా కోసం వాకబు చేయడం.. ఇంతకీ లైలా దొరికితే ఏం చేస్తావ్ అంటే.. మా నాన్నకు రెండో పిన్నిని చేస్తా, ఆయన ఆమెను కొరికేత్తాడు కొరికేత్తాడు అంటూ తన ట్రేడ్ మార్క్ డైలాగ్ చెప్పడం.. ఇలా సాగింది ఈ ప్రమోషనల్ వీడియో.
ఫన్నీగా ఉన్న ఈ వీడియో ‘లైలా’ ప్రమోషన్లకు బాగానే ఉపయోగపడేలా ఉంది. ఒక చిన్న పిల్లాడి పాత్ర ఇంతగా పాపులర్ అయి.. ఇంకో సినిమా ప్రమోషన్లకు కూడా ఉపయోగపడడం అంటే విశేషంగానే చెప్పుకోవాలి. ‘లైలా’ ఈ నెల 14న ప్రేక్షకుల ముందుకు రానున్న సంగతి తెలిసిందే.
This post was last modified on February 11, 2025 5:13 pm
గత ఏడాది బాలీవుడ్ సెన్సేషనల్ బ్లాక్ బస్టర్ అందుకున్న సినిమా కిల్. ఒక రాత్రి పూట రైలులో జరిగే మారణ…
ఫిబ్రవరి మామూలుగా సినిమాలకు అంతగా కలిసొచ్చే సీజన్ కాదు. సినిమాలకు మహారాజ పోషకులైన యూత్ పరీక్షలకు సంబంధించిన హడావుడిలో ఉంటారు…
పార్లమెంట్ బడ్జెట్ సమావేశాల్లో భాగంగా ఏపీకి సంబంధించిన సమస్యలు వరుసగా ప్రస్తావనకు వస్తున్నాయి. అందులో భాగంగా మంగళవారం నాటి లోక్…
తిరుపతి లడ్డూ తయారీలో కల్తీ నెయ్యి వాడారన్న ఆరోపణలు దేశవ్యాప్తంగా పెను సంచలనం రేపిన సంగతి తెలిసిందే. అయితే, కల్తీ…
ఛాంపియన్స్ ట్రోఫీకి సిద్ధమవుతున్న తరుణంలో కెప్టెన్ రోహిత్ శర్మ మొన్నటివరకు వరుసగా విఫలమవ్వడం జట్టుకు భారంగా మారిందనే కామెంట్స్ ఎక్కువగానే…
ఒక్క అప్డేట్ బయటికి తెలియకుండా గుట్టుచప్పుడు కాకుండా షూటింగ్ జరుపుకుంటున్న ఎస్ఎస్ఎంబి 29 అడవుల బ్యాక్ డ్రాప్ లో రూపొందుతున్న…