Movie News

వేలంటైన్స్ డే.. పాత సినిమాలదే పైచేయి?

ఫిబ్రవరి మామూలుగా సినిమాలకు అంతగా కలిసొచ్చే సీజన్ కాదు. సినిమాలకు మహారాజ పోషకులైన యూత్ పరీక్షలకు సంబంధించిన హడావుడిలో ఉంటారు కాబట్టి.. ఆక్యుపెన్సీలు పడిపోతుంటాయి. ఐతే ఈ నెలలో కొంచెం సందడి ఉండే వీకెండ్ అంటే.. వాలెంటైన్స్ డే టైంలోనే అని చెప్పాలి. ఆ వీకెండ్లో రెండు మూడు కొత్త సినిమాలు రిలీజవుతుంటాయి. ఎక్కువగా ప్రేమకథా చిత్రాలనే ఈ టైంలో రిలీజ్ చేస్తుంటారు.

కానీ ఈసారి టాలీవుడ్ బాక్సాఫీస్ బరిలో అలాంటి సినిమాలేవీ లేవు. కిరణ్ అబ్బవరం సినిమా ‘దిల్ రుబా’ ప్రేమకథా చిత్రమే కానీ.. ఫిబ్రవరి 14కు అనుకున్న ఆ చిత్రాన్ని ఎందుకో వాయిదా వేసేశారు. విశ్వక్సేన్ కామెడీ మూవీ ‘లైలా’తో పాటు బ్రహ్మానందం, ఆయన తనయుడు రాజా గౌతమ్ కలిసి నటించిన కామెడీ ప్లస్ ఎమోషనల్ డ్రామా ‘బ్రహ్మ ఆనందం’ వేలంటైన్స్ డే వీకెండ్లో ప్రేక్షకులను పలకరించబోతున్నాయి.

ఐతే ఇవి ఇంట్రెస్టింగ్ సినిమాల్లాగే కనిపిస్తున్నా వీటి చుట్టూ బజ్ ఓ మోస్తరుగానే ఉంది. వీటికి పోటీగా కొన్ని పాత క్లాసిక్ లవ్ స్టోరీలను వేలంటైన్స్ డే వీకెండ్‌లో థియేటర్లలోకి దించుతున్నారు. కొవిడ్ టైంలో ఓటీటీలో నేరుగా రిలీజై సూపర్ హిట్టయిన ‘కృష్ణ అండ్ హిజ్ లీల’ను ‘ఇట్స్ కాంప్లికేటెడ్’ పేరుతో ఇప్పుడు థియేటర్లలో రిలీజ్ చేస్తూ కొత్త ప్రయోగం చేస్తున్నాడు నిర్మాత రానా దగ్గుబాటి.

దీనికి ప్రమోషన్లు చేస్తున్నారు. అడ్వాన్స్ బుకింగ్స్ కూడా ఆశాజనకంగా ఉన్నాయి. మరోవైపు ఆరెంజ్, నా ఆటోగ్రాఫ్ స్వీట్ మెమొరీస్, సూర్య సన్నాఫ్ కృష్ణన్, ఎటో వెళ్లిపోయింది మనసు లాంటి మంచి ఫీల్ ఉన్న లవ్ స్టోరీలను వేలంటైన్స్ డే వీకెండ్లో రీ రిలీజ్ చేస్తున్నారు. బుకింగ్స్ ఓపెన్ అయిన సినిమాలకు బుక్ మై షోలో స్పందన కూడా బాగుంది. చూస్తుంటే కొత్త సినిమాలను వెనక్కి నెట్టి ఈ పాత చిత్రాలే ఈ వీకెండ్ పైచేయి సాధిస్తే ఆశ్చర్యం లేదనిపిస్తోంది.

This post was last modified on February 11, 2025 5:00 pm

Share

Recent Posts

స్థాలిన్ కూడా నోరు జారితే ఎలా?

గత ఎన్నికల్లో ఓటమి పాలైన డీఎంకే అధినేత స్థాలిన్ దాన్నుంచి ఎలాంటి గుణపాఠం నేర్చుకున్నట్లు లేదు. ఆయన, ఆయన కుమారుడు…

38 minutes ago

వందల కోట్ల ఆస్తి మిస్సయిన నవదీప్

మంచి అందగాడు, పెర్ఫామెన్స్ విషయంలోనూ ఢోకా లేదు. అయినా నవదీప్ టాలీవుడ్లో అనుకున్నంత పెద్ద స్థాయికి వెళ్లలేకపోయాడు. తేజ మూవీ…

46 minutes ago

పోటీకి రావడంలో ‘రియాలిటీ’ ఉద్దేశమేంటో

యంగ్ హీరో కిరణ్ అబ్బవరం మంచి జోష్ లో ఉన్నాడు. చెన్నై లవ్ స్టోరీ థియేట్రికల్ రన్ లో సూపర్…

52 minutes ago

కౌంట్ బాగుంది… ప్రేక్షకుల క్వాంటిటీ పెరగాలి

నిన్న కొత్త సినిమాలు చాలా రిలీజయ్యాయి. మాములుగా అయితే థియేటర్లు కిటకిటలాడిపోవాలి. అయితే ఆక్యుపెన్సీలు కొంచెం నెమ్మదిగా ఉన్న నేపథ్యంలో…

2 hours ago

లీక్ చెయ్యడానికి అదేమైనా ఆ టైపు సినిమానా?

ఈ శుక్రవారం ఒకేసారి నాలుగైదు చిన్న సినిమాలు రిలీజయ్యాయి. ఇంత పోటీలో వస్తున్నపుడు ప్రేక్షకుల దృష్టి తమ చిత్రం మీద…

3 hours ago

తారక్ కోపం వంద శాతం సమర్ధనీయం

ఏఐ దుర్వినియోగమవుతున్న తీరు చూస్తుంటే టెక్నాలజీ తాలూకు పరిణామాలు ఇంత దారుణంగా ఉంటాయా అనిపిస్తుంది. రోబోలో ఒక యంత్రం హీరోయిన్…

3 hours ago