ఇంకో నాలుగు రోజుల్లో విడుదల కాబోతున్న చావా మీద పెద్దగా బజ్ కనిపించడం లేదు. బాలీవుడ్ లో అత్యంత భారీ బడ్జెట్ తో రూపొందిన సినిమాల్లో ఒకటిగా దీని మీద ట్రేడ్ చాలా ఆశలు పెట్టుకుంది. అందులోనూ శంభాజి మహారాజ్ కథ కావడంతో జనాలు ఎగబడి చూస్తారనుకున్నారు.
కానీ అడ్వాన్స్ బుకింగ్స్ దానికి తగ్గట్టు లేవు. ట్రేడ్ అనలిస్టులు రెండు లక్షల టికెట్లు అమ్ముడయ్యాయని చెబుతున్నారు కానీ నిజానికీ సంఖ్య రెండు మూడింతలు ఎక్కువగా ఉండాలి. విక్కీ కౌశల్ టైటిల్ రోల్ పోషించగా రష్మిక మందన్న హీరోయిన్ గా నటించింది. ఏఆర్ రెహమాన్ సంగీతం మరో ఆకర్షణ.
మహారాష్ట్రలో చావాకు అమ్మకాలు బాగున్నాయి కానీ బయట బజ్ ఎందుకు తక్కువుందో చూద్దాం. శంభాజీ మహారాజ్ గురించి మరాఠి వాసులకు తప్ప ఇతర రాష్ట్రాల్లో తెలిసిన వాళ్ళు తక్కువ. ఎలా అంటే మన సైరా నరసింహారెడ్డి, అల్లూరి సీతారామరాజు గురించి ముంబైలో అవగాహన కలిగిన జనాలు పెద్దగా లేనట్టే శంభాజీ కథలు చదువుకున్న వాళ్ళు మన సైడ్ అంతంత మాత్రమే.
ఛత్రపతి శివాజీ గురించి పిల్లల చరిత్ర పుస్తకాల్లో ఉంటుంది కాబట్టి ఆ మాత్రం అవగాహన ఉంది కానీ ఇతర మరాఠా వీరుల గురించి నేర్చుకున్న వాళ్ళు అంతగా కనిపించరు. దీంతో సహజంగానే చావా మీద హైప్ లేకపోవడానికి దారి తీసింది.
గత నెల చావా మీద వివాదాలు చుట్టుముడితే కొంత భాగం తీసేసి కొన్ని డైలాగులను మార్చారు. సెన్సార్ చెప్పిన అభ్యంతరాలను పాటించారు. ఇది హిట్ కావడం నార్త్ ట్రేడ్ వర్గాలకు చాలా అవసరం. ఎందుకంటే పుష్ప 2 తర్వాత అక్కడి థియేటర్లకు పెద్దగా ఫీడింగ్ లేకుండా పోయింది.
స్కై ఫోర్స్, లవ్ యాపా, బ్యాడ్ ఆస్ రవికుమార్ లాంటివి ఆశించిన విజయం సాధించలేకపోయాయి. ముఖ్యంగా సింగల్ స్క్రీన్ల మనుగడ కష్టమైపోయింది. తిరిగి వాటికి చావా జీవం పోస్తుందని ఎదురు చూస్తున్నారు. ఇది సక్సెస్ అయితే రష్మిక మందన్నకు యానిమల్, పుష్ప 2 తర్వాత హ్యాట్రిక్ బ్లాక్ బస్టర్ నమోదవుతుంది.
This post was last modified on February 11, 2025 2:00 pm
సౌత్ ఇండియన్ మోస్ట్ వాంటెడ్ డైరెక్టర్ గా పేరొందిన లోకేష్ కనగరాజ్ కు మర్చిపోలేని బ్రేక్ ఇచ్చింది ఖైదీ. తెలుగులో…
భయం లేదు కాబట్టే… దుష్ట పాలనను బద్దలు కొట్టామని జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ అన్నారు.…
భారత దేశానికి బహుభాషే మంచిదని జనసేన అధినేత, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ స్పష్టం చేశారు. తాజాగా పిఠాపురంలో జరిగిన…
పిఠాపురంలోని చిత్రాడలో జనసేన 12వ ఆవిర్భావ సభను ఘనంగా నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే జయ కేతనం సభకు…
ఇప్పటికే రెండుసార్లు పెళ్లి చేసుకుని విడాకులు తీసుకున్న బాలీవుడ్ సూపర్ స్టార్ ఆమిర్ ఖాన్.. 60వ ఏట అడుగు పెడుతున్న…
జనసేన ఆవిర్భావ సభ జయకేతనం వేదికగా వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డిపై సంచలన ఆరోపణ వినిపించింది. మొన్నటిదాకా…